Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎట్టకేలకు పవన్ దర్శకుడికి మరో అవకాశం

ఎట్టకేలకు పవన్ దర్శకుడికి మరో అవకాశం

అప్పుడెప్పుడో వచ్చింది భీమ్లానాయక్ సినిమా. అప్పట్నుంచి మరో అవకాశం దక్కించుకోలేకపోయాడు ఆ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర. ఆ సినిమా టైమ్ లో సాగర్ చంద్ర కంటే, త్రివిక్రమ్ కు ఎక్కువ పేరు రావడం.. దర్శకుడిపై త్రివిక్రమ్ డామినేషన్ ఎక్కువగా కనిపించడంతో సాగర్ చంద్రకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

అలా భీమ్లానాయక్ తర్వాత మరోసారి గ్యాప్ ఫేస్ చేసిన సాగర్ చంద్ర, ఎట్టకేలకు మరో అవకాశం దక్కించుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రోజు ఈ సినిమా ప్రకటన వచ్చింది.

14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రాబోతోంది సాగర్ చంద్ర, బెల్లంకొండ సినిమా. ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో, మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోంది. ఇంతకుమించి ఈ ప్రాజెక్టుపై ఎలాంటి కొత్త విషయాలు బయటపెట్టలేదు మేకర్స్. ఎనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఎర్రకోట, పోలీస్ క్వార్టర్స్, ముంబయి నగరం ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం హిందీ ఛత్రపతి పనిలో బిజీగా ఉన్నాడు బెల్లంకొండ. ఈ పనులు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమా లాంఛ్ అవుతుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?