రసిక రాజా- అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన బీజేపీ ఎమ్మెల్యే

చ‌ట్టసభలో కూర్చొని జనానికి సంబంధించిన పనులు చేయాల్సిన ప్రజాప్రతినిధులు.. హోదాను, ఉన్న చోటును కూడా మర్చిపోయి పోర్న్ వీడియోలు చూడటం పరిపాటిగా మారుతోంది. త్రిపుర‌లో జ‌రుగుతోన్న అసెంబ్లీ స‌మావేశాల్లో బాగ్ బాసా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన…

చ‌ట్టసభలో కూర్చొని జనానికి సంబంధించిన పనులు చేయాల్సిన ప్రజాప్రతినిధులు.. హోదాను, ఉన్న చోటును కూడా మర్చిపోయి పోర్న్ వీడియోలు చూడటం పరిపాటిగా మారుతోంది. త్రిపుర‌లో జ‌రుగుతోన్న అసెంబ్లీ స‌మావేశాల్లో బాగ్ బాసా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ‌ద‌బ్ లాల్ నాథ్ త‌న స్థానంలో ద‌ర్జాగా కూర్చొని పోర్న్ వీడియోలు చూస్తుండ‌గా కెమెరాకు చిక్కారు. 

నిత్యం మాట‌కు ముందు మాటకు త‌ర్వాత ప్ర‌తి దానిని ధ‌ర్మం కోస‌మే అని మాట్లాడే బీజేపీ నేత‌లు నిత్యం అసెంబ్లీలో కూర్చోని పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోతున్నారు. గ‌తంలో కూడా కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌ఘ‌డ్ లాంటి రాష్ట్రాల్లో సైతం కొంత మంది బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫోర్న్‌ వీడియోలు చూస్తూ కెమెరాలకు అడ్డంగా బుక్ అయ్యారు. ప్ర‌స్తుతం త్రిపుర ఎమ్మెల్యే వీడియో వైర‌ల్ అవడంతో.. నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.

కాగా ఇటీవ‌ల జ‌రిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 60 స్థానాలకు గాను బీజేపీ 32 సీట్లను దక్కించుకొని.. అధికారాన్ని నిలబెట్టుకుంది. కాషాయ పార్టీ మిత్ర పక్షం ఐపీఎఫ్‍టీ ఒక్క సీటు సాధించింది. త్రిపా మోతా – 13, సీపీఎం – 11, కాంగ్రెస్ – 3 స్ధానాలు ద‌క్కించుకున్నాయి. ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా కొనసాగనున్నారు.