సింగర్‌గా మారిన సీఎం!

పశ్చిమ బెంగాల్ పట్ల కేంద్రం వివ‌క్షాపూరితంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని రెండు రోజుల పాటు చేపట్టినా ధర్నాలో బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సింగ‌ర్ గా మారారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నోబెల్ గ్ర‌హీత ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్…

పశ్చిమ బెంగాల్ పట్ల కేంద్రం వివ‌క్షాపూరితంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని రెండు రోజుల పాటు చేపట్టినా ధర్నాలో బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సింగ‌ర్ గా మారారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నోబెల్ గ్ర‌హీత ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ రాసిన  'ఎబర్ తోర్ మోరా గంగే' పాటను పాడారు. ప‌క్క‌న మ్యూజిక్ ప్లే చేస్తుండ‌గా పాట‌ను పాడ‌టం ఆస‌క్తి మారింది. కొంత‌మంది నాయకులు కోర‌స్ ఇస్తుండ‌గా సుమారు రెండు నిమిషాల పాటు బెంగాలీలో ఉన్న సాంగ్ ను పాడారు. 

రాష్ట్రానికి నిధుల విడుద‌ల‌లో కేంద్రం వివ‌క్ష చూపిస్తోంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో పాటు ఉపాధి హామీ ప‌థ‌కం నిధులు మంజూరు చేయ‌డం లేద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ రెండు రోజుల దీక్ష‌ను చేప‌ట్టారు. ధ‌ర్నాలో మ‌మ‌తా బెన‌ర్జీ మాట్లాడుతూ.. పేద‌ ప్రజల కోసం పనిచేస్తున్నని. 100 రోజుల పని ఆగిపోయిన ప్రజల కోసం పోరాడుతున్నానని.. అవసరమైతే ప్రధానమంత్రి ఇంటి దగ్గర కూడా ధ‌ర్నా చేస్తానని హెచ్చ‌రించారు. వివ‌క్ష‌తోనే రాష్ట్రానికి రావాల‌సిన నిధుల‌ను కేంద్రం విడుదల చేయలేదని మ‌మ‌త‌ ఆరోపించారు.

కాగా నిన్న‌టి సభా వేదికపై ఓ వాషింగ్ మెషిన్‍ తో విన్నూతంగా నిర‌స‌న చేశారు. వాషింగ్ మెషిన్ కు బీజేపీ అని పేరు పెట్టి… బీజేపీ వాషింగ్ మెషిన్‍లో నలుపు రంగు క్లాత్ వేస్తే.. తెలుపు రంగు క్లాత్‍లా మారుతుందనేలా మమతా బెనర్జీ ప్రదర్శించారు. కేసులు ఉన్న వారు, అవినీతిపరులు బీజేపీలో చేరితే స్వచ్ఛమవుతున్నారని అర్థమొచ్చేలా చేశారు.