Advertisement

Advertisement


Home > Politics - National

అమెరికాలో ఎల్‌.వి. గంగాధర శాస్త్రి గీతాగాన ప్రవచన శంఖారావం!

అమెరికాలో ఎల్‌.వి. గంగాధర శాస్త్రి గీతాగాన ప్రవచన శంఖారావం!

‘గానయోగి’ ఘంటసాల గారి పాటతో అనుబంధం ఉన్న వారందరికీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు గంగాధర శాస్త్రితోనూ అనుబంధం ఉండి తీరుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఘంటసాల కచేరీలు చేస్తూ, సినీ నేపథ్య గాయకుడుగా కొనసాగుతున్న కాలంలో 18 సార్లు చేసిన ‘అమెరికా యాత్రలు’ ఆయన జీవిత గమనాన్నే మార్చేశాయి. 

‘‘జీవితమంటే Entertainment కాదు Enlightenment జీవితమంటే సమాజం నుంచి తీసుకోవడం కాదు, తిరిగి `సమాజానికి కృతజ్ఞతలు చెప్పి మరీ ఇచ్చెయ్యడం... ‘‘ జీవితమంటే జీవించి ఉన్న కాలంలో కాదు, దేహం చాలించాక కూడామనం లోకం కోసం చేసే మంచి పనుల ద్వారా ‘కీర్తి కాయం’ తో జీవించగలగడం...! ’’ అనినమ్మి ` ప్రపంచంలోనే మొదటిసారిగా ‘సంపూర్ణ భగవద్గీత’లోని 700 శ్లోకాలను తాత్పర్యసహితంగా గానం చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే Sound Technology లో రికార్డు చేసి, విడుదల చేసి, భారతదేశపు ప్రముఖులైన డా॥ ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం, శ్రీరామ్‌నాథ్‌ కోవింద్‌, శ్రీ నరేంద్ర మోది, శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి వంటి వారి ప్రశంసలుపొందిన ఏకైక గాయకుడు శ్రీ గంగాధర శాస్త్రి.

​అయితే ఈ బృహత్‌యత్నం అంత సులభంగా సాధ్యం కాలేదు. 9 సంవత్సరాల కాలం, 9 కోట్ల రూపాయల వ్యయం, దాదాపు 150 మంది సాంకేతిక నిపుణులు, పండితులు, సౌజన్య మూర్తుల చేయూతతో ఇది సాధ్యమయ్యింది. అటు సినిమా అవకాశాలను, దేశవిదేశాలలో కార్యక్రమాలను వదులుకుని, అప్పటి వరకూ సంపాదించిన ఆస్తిని, ఆదాయాన్ని, కుటుంబ సమయాన్ని త్యాగం చేస్తే ఇది సాధ్యమయ్యింది. 

‘ఇదంతా ఏఫలితం ఆశించి చేశారు?’ అని గంగాధర శాస్త్రిని అడిగితే ` ‘ప్రపంచ శాంతికి... స్వార్థరహిత మానవ సమాజ నిర్మాణుం కోసం చేశానే తప్ప, అశాశ్వతమైన రికార్డుల కెక్కడం కోసం కాదు’ అంటారాయన! ​‘మతాలు ఆవిర్భవించని కాలంలో శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని, సర్వమానవాళికి చేసిన కర్తవ్య బోధ ‘భగవద్గీత’ మత గ్రంథం కాదు. 

ఉత్తమ జీవన విధానగ్రంథం. అందుకే గీతా ప్రచారానికే నా జీవితం అంకితం చేశాను ` గీతా గాన ప్రవచనాలరూపంలో... గీతా సత్సంగాల రూపంలో ప్రపంచ పర్యటన చేస్తున్నాను. గీత నేర్చుకుంటేరాత మార్చుకున్నట్టే. మానసిక వత్తిడి లేని ఆనందం కోసం ‘గీత’ చదవండి’ అన్నారు గంగాధర శాస్త్రి. North America Telugu Society (NATS) వారు మే 26,27,28 తేదీలలో న్యూ జెర్సీలో నిర్వహిస్తున్న తెలుగు సంబరాలలో తొలిరోజు ` గంగాధర శాస్త్రి ` ‘ఘంటసాల జీవిత సాఫల్య పురస్కారాన్ని’ అందుకుంటూ, ఘంటసాల గీతా గాన వైభవాన్ని చెబుతూగాన ప్రసంగం చేయనున్నారు. 

రెండవ రోజు ‘భగవద్గీతా గాన ప్రవచనం’ చేయనున్నారు. భగవద్గీతను గానం చేస్తూ, నిత్య జీవితానికి గీత ఏ విధంగా ఉపయోగపడుతుందో స్ఫూర్తిదాయకంగా వివరిస్తూ, మధ్యలో ఘంటసాల భక్తి గీతాలను గానం చేయడం గంగాధర శాస్త్రి ప్రత్యేక శైలి!

​సేవ లేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదని భావించిన గంగాధర శాస్త్రి, స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ‘భగవద్గీత’ పునాదులపై నిర్మించిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక , సామాజిక సేవా సంస్థ... భగవద్గీతా పౌండేషన్‌ !

​2007లో స్థాపించిన భగవద్గీతా ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచంలోని వీలైనన్ని భాషల్లోకి‘సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత’ను గీతా ప్రచారంతో పాటు వ్యవస్థాపకులు గంగాధరశాస్త్రి మార్గ నిర్దేశకత్వలో...

• పేద విద్యార్థులకు, అనాథ బాలలకు, వికలాంగులకు వృద్ధాశ్రమాలకు చేయూత, • గో సేవ, యోగ శిక్షణ, వేద శాస్త్రాల పరిరక్షణ

• వైద్య సేవ, ఆయుర్వేదానికి సహకారం, • భారతీయ సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక సేవా కార్యక్రమాలతో ‘భగవద్గీతాఫౌండేషన్‌’ జనవాహినికి దగ్గరయ్యింది.

 అమెరికాలో గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచన కార్యక్రమాల కోసం...

• శ్రీ శేఖర రావు బసవరాజు `+ 1(817) 675 3404, • శ్రీ పురుషోత్తం తండు ` +1 (901) 606 ` 7012 లను సంప్రదించవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?