Advertisement

Advertisement


Home > Politics - National

డీఏ పెంపుతో సంతోషంగా లేకపోతే.. నా తల తీసేయండి!

డీఏ పెంపుతో సంతోషంగా లేకపోతే.. నా తల తీసేయండి!

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న డీఏతో సమానంగా తమకు కూడా ఇవ్వాలంటూ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు చేస్తోన్న నిరసనల‌పై మమత మండిపడ్డారు. 

ప్ర‌తి సారి డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న దానికంటే పెంచడం కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇప్పటికే అదనంగా మూడు శాతం డీఏ ప్రకటించాం.  ఇంకా ఎంత కావాలి అంటూ అగ్ర‌హం వ్య‌క్తం చేస్తు.. ఆ పెంపుతో మీరు సంతోషంగా లేకపోతే.. నా తల తీసేయండి అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

అదనపు డీఏ కోసం రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో క‌లిసి నిర‌స‌న‌లు చేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల పే స్కేల్ వేర్వేర‌ని.. వేత‌నంతో కూడిన ఇన్ని సెల‌వుల‌ను ఏ ప్ర‌భుత్వం ఇస్తోంది అంటూ ఉద్యోగులు, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విరుచుకుప‌డ్డారు.

కాగా ఫిబ్రవరి 15న అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, మార్చి నుంచి ఉపాధ్యాయులు, పెన్షనర్లతో సహా ఉద్యోగులకు ప్రభుత్వం 3 శాతం అదనపు డీఏ చెల్లిస్తుందని ప్రకటించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?