Advertisement

Advertisement


Home > Politics - National

పాలసీ డబ్బుల కోసం ఏకంగా కుటుంబాన్నే..!

పాలసీ డబ్బుల కోసం ఏకంగా కుటుంబాన్నే..!

బీమా సొమ్ము కోసం చనిపోయినట్టు నటించి, తీరా కుటుంబానికి ఆ డబ్బులు వచ్చాక తిరిగొచ్చే ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారు. బీమా సొమ్ము కోసం అయినవారిని ఏకంగా మట్టుబెట్టే బ్యాచ్ గురించి కూడా మనం వార్తల్లో విన్నాం. ఇక్కడో వ్యక్తి 'చావు' తెలివితేటలు వీరి కంటే అమోఘంగా ఉన్నాయి. ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీ కారు ప్రమాదంలో చనిపోయినట్టు అందర్నీ నమ్మించాడు. బీమా సొమ్ము బంధువులకు వచ్చేలా చేశాడు. కానీ చివరి నిమిషంలో దొరికిపోయాడు.

ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు, అతడ పేరుమీద ఇటీవలే పెద్ద పాలసీ తీసుకున్నారంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. అదే సమయంలో నామినీతో సహా కుటుంబం మొత్తం చనిపోయిందంటే ఎవరికీ పెద్దగా అనుమానం రాదు. సరిగ్గా అలాగే ప్లాన్ చేశాడు చత్తీస్ గఢ్, కాంకేర్ జిల్లాకు చెందిన సమీరన్ అనే వ్యక్తి. వ్యాపారంలో అప్పులపాలు కావడంతో తన పేరుమీద బీమా చేయించాడు. నామినీగా కుటుంబ సభ్యుల పేర్లు రాయించాడు. నామినీ కూడా చనిపోతే దగ్గరి బంధువులకు బీమా సొమ్ము ముట్టచెబుతారనే ప్లాన్ తో రంగంలోకి దిగాడు. ముందే ఈ ప్లాన్ కుటుంబ సభ్యులందరికీ అర్థమయ్యేలా చెప్పాడు.

మార్చి1న కుటుంబంతో సహా సమీరన్ కాంకేర్ నుంచి కారులో బయలుదేరి ధామ్ తరి అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఓ లాడ్జ్ లో కుటుంబ సభ్యులను ఉంచాడు. అదే రోజు కాంకేర్ సమీపంలోని చావడి అనే గ్రామం దగ్గర కారు, చెట్టుకి ఢీ కొట్టినట్టు సీన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కారుని తగలబెట్టాడు. కారులో ఉన్నవారంతా మంటల్లో కాలి చనిపోయారనేట్టుగా సీన్ క్రియేట్ చేశాడు.

సమీరన్ బంధువులు కాలిపోయిన కారు వద్ద బోరున విలపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బీమా సొమ్ము కోసం రంగంలోకి దిగారు. పోలీసులకు మాత్రం అది నమ్మశక్యంగా లేదు. కారులో కనీసం ఒక్కరి శవానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా దొరక్కపోవడంతో వారు లోతుగా దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, చనిపోయారంటున్నవారి సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అసలక్కడ ప్రమాదమే జరగలేదని తేల్చారు.

చివరకు సమీరన్ పేరుమీద 72 లక్షల రూపాయల బీమా సొమ్ముకోసం బంధువులు ప్రయత్నాలు చేస్తున్నారని తేలే సరికి యాక్సిడెంట్ అనేది పెద్ద డ్రామా అని నిర్థారించారు. పోలీసులకు విషయం తెలిసిపోయిందని సమీరన్ కి సమాచారం అందింది. దీంతో అతడు కాంకేర్ లోని ఇంటికి వచ్చాడు. పోలీసులకు లొంగిపోయాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?