Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప2 టార్గెట్…ఆర్.ఆర్.ఆర్

పుష్ప2 టార్గెట్…ఆర్.ఆర్.ఆర్

పుష్ప‌ 2 సినిమా షూట్ చకచకా జ‌రుగుతోంది. సుకుమార్-బన్నీ-మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి చేసిన కమర్షియల్ మ్యాజిక్ పుష్ప. దేవీశ్రీ ప్రసాద్ పాటలు ఆ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. 

ఇప్పుడు దాని సీక్వెల్..తగ్గేదే లే అన్నట్లు రెడీ అవుతోంది. ఇప్పుడు బన్నీ టార్గెట్ ఒక్కటే ఆర్ఆర్ఆర్. బాహుబలి రికార్డులను షేక్ చేసాడు కొన్ని చోట్ల అయినా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ను కొట్టాలి. ఇలా అని పైకి ఎవరూ చెప్పకున్నా దాని టార్గెట్ అయితే అదే.

సినిమా షూట్ సిటీలోని ఓ గవర్నమెంట్ గెస్ట్ హవుస్ ను పోలీస్ స్టేషన్ సెట్ గా మార్చి డే అండ్ నైట్ షూట్ చేస్తున్నారు. సినిమా కోసం ఇప్పటికే షూట్ చేసిన ఓ ఫైట్ చాలా అద్భుతంగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు. సినిమాలో హీరో ఫుల్ రిచ్ గెటప్ లో రకరకాల కాస్ట్యూమ్స్ లో కనిపిస్తాడట.

సినిమా కోసం దేవీ ఇప్పటికే ట్యూన్ లు కొన్ని ఇచ్చాడు. కానీ వాటి వర్క్ ఇంకా పూర్తి కావాల్సి వుంది. 2024 సమ్మర్ లో విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్ల వరకు వుంటుందని వార్తలు వున్నాయి. అసలు లెక్కలు మైత్రీ మూవీస్ అధినేతలకే తెలియాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?