పూరి ఎక్కడ..సినిమా ఎక్కడ?

దర్శకుడు పూరి జ‌గన్నాధ్ ఎక్కడున్నారు? ముంబాయిలో అని సమాధానం ఇచ్చేయచ్చు. అది కాదు పాయింట్. అసలు ఏం చేస్తున్నారు. సూపర్ యాక్టివ్ గా వుండే పూరి జ‌గన్నాధ్ అలా తెరవెనుక వుండిపోతే ఎలా?  Advertisement…

దర్శకుడు పూరి జ‌గన్నాధ్ ఎక్కడున్నారు? ముంబాయిలో అని సమాధానం ఇచ్చేయచ్చు. అది కాదు పాయింట్. అసలు ఏం చేస్తున్నారు. సూపర్ యాక్టివ్ గా వుండే పూరి జ‌గన్నాధ్ అలా తెరవెనుక వుండిపోతే ఎలా? 

సరైన స్క్రిప్ట్ దొరికితే మూడు నెలల్లో సినిమా తీసి పక్కన పెట్టగల దర్శకుడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్..బ్లాక్ బస్టర్..తరువాత అదే ఊపులో తీసిన లైగర్..అరి వీర డిజాస్టర్. అంతే తరువాత మరి అజా పజా లేదు. ఫైనాన్షియల్ గొడవలు, పోలీసు కంప్లయింట్లు..వార్తలు.. గతంలో కలిసిపోయాయి. పూరి సినిమా వార్త మాత్రం రావడం లేదు.

మెగాస్టార్ కు లైన్ చెప్పారనీ, మరోటి అనీ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అది కూడా వినిపించడం లేదు. నిజానికి మెగాస్టార్ భోళాశంకర్ తరువాత సరైన ప్రాజెక్టు కోసం చూస్తున్నారు. ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయి. కానీ మరి పూరి పేరు మాత్రం ఎందుకు వినిపించడం లేదో? తెలియదు. వివి వినాయక్ లాంటి ఓల్డ్ డైరక్టర్ పేరు వినిపిస్తోంది కానీ పూరి పేరు వినిపించడం లేదు.

నిజానికి ఇప్పుడు పూరి జ‌గన్నాధ్ కు మెగాస్టార్ తప్ప మరో సరైన ఆప్షన్ లేదు. కానీ మెగాస్టార్ కూడా వేరే డైరక్టర్ల వైపు చూస్తున్నారు. మరి ఇక పూరి ఏం చేస్తారో? స్వంతంగా ఏమీ నిర్మించాలన్నా కూడా లైగర్ సమస్యలు అడ్డం పడతాయి. మొత్తం మీద మరి కొన్నాళ్లు పూరి కి ఈ అజ్ఞాతవాసం తప్పకపోవచ్చు.