తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నోరు జారారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత విచారణ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ స్టేజ్ ఛీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మేం భయపడేటోళ్లం కాదు. కేసీఆర్ అనుకుంటుండు మేం భయడతామని, బీజేపీ కార్యకర్తలు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నరని అన్ని జిల్లాల్లో రూమ్ లు ఏర్పాటు చేయండి. ఎన్ని జైళ్లయినా రెడీ చెయ్ అంటూనే.. ఆడ కూడా నీ బిడ్డకు రెడీ అవుతోంది కదా అని కామెంట్ చేశారు.
గతంలో కవితపై బండి సంజయ్ మాట్లాడుతూ.. కవితను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యాలపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బండి వ్యాఖ్యలపై కేసు నమోదుకు సిఫారసు చేసింది. ఈ రోజు కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ శ్రేణుల నుండి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న.. తన అనారోగ్య కారణాలతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని తెలిపారు. కానీ ఈడీ మాత్రం కవిత వినతిని తోసిపుచ్చి… ఈడీ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం.