భారత ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నట్లు నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే తోజే ప్రకటించారు. ఇటీవల నార్వేకు చెందిన నోబెల్ అవార్డ్స్ కమిటీ భారత్ ను సందర్షించింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. నోబెల్ శాంతి బహుమతికి నరేంద్ర మోదీ అతిపెద్ద పోటీదారని.. ఆయన ప్రపంచ శాంతి కోసం నిరంతరం కృషి చేస్తున్నరంటూ ప్రశంసించారు.
ప్రపంచశాంతి క్రమాన్ని పునరుద్ధరించగల సామర్థ్యం మోదీకి ఉందని.. యుద్దాలు చేసే దేశాల చేత కూడా యుద్దాలను ఆపించగల సత్తా ఉన్నవాడని.. మోదీ లాంటి నేత శాంతిని పెంచడంలో కీలక పాత్ర పోషించగలరని నమ్ముతున్నట్లు అస్లే టోజే వెల్లడించారు. దీంతో ఈ ఏడాది ప్రకటించే అవార్డుల్లో ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలో కూడా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు పని చేసిన ప్రస్తుత తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ 2019 ఏడాదికి సంబంధించి నరేంద్ర మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాన్ని తీసుకొచ్చి 50 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమిళసాయి కోరారు.