Advertisement

Advertisement


Home > Politics - National

ఓ నీఛుడు కడుపు చేశాడు.. మరో నీఛుడు కడుపుకోత మిగిల్చాడు

ఓ నీఛుడు కడుపు చేశాడు.. మరో నీఛుడు కడుపుకోత మిగిల్చాడు

అత్యాచారానికి గురైన ఆడబిడ్డల విషయంలో తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంటుందనేది ఊహించలేం. చేయని తప్పుకి ఆమెను కూడా శిక్షించేవారు కొందరు. మృగాళ్ల వేటకు బలైపోయిన కూతురిని కడుపులో పెట్టుకుని చూసుకునేవారు మరికొందరు. 

ఇక్కడ ఓ తండ్రి తన కన్నబిడ్డకు వచ్చిన కష్టం చూసి తట్టుకోలేకపోయాడు. అదే సమయంలో అతడు కూడా దారుణంగా వ్యవహరించాడు. అత్యాచారానికి గురైన బాలికకు పుట్టిన బిడ్డను తండ్రి అతి కిరాతకంగా చంపాడు. గొంతుకోసి మురికి కాల్వలో విసిరిపారేశాడు. ఈ హృదయ విదారక సంఘటన గుజరాత్ లో జరిగింది.

గుజరాత్‌లోని పఠాన్‌ జిల్లాలో ఈ అమానవీయ ఘటన జరిగింది. కొన్ని నెలల కిందట ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఆమె గర్భందాల్చింది. రేప్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసు విచారణ జరుగుతోంది. బాధిత బాలికకు అబార్షన్ చేసే అవకాశం లేకపోవడంతో ఆమెకు ఎప్పటికప్పుడు వైద్య సహాయం అందిస్తూ శిశు సంక్షేమ శాఖ అధికారులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. 

బాలిక ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. సడన్ గా ఓ రోజు అధికారులు ఇంటికి రాగా.. బాలిక కడుపులో బిడ్డ మాయమైంది. పోనీ ప్రసవం అయిందా అని ఆరా తీస్తే పురిటి బిడ్డ ఇంట్లో లేదు. ఏం జరిగిందని తెలుసుకుంటే బాధిత బాలిక తండ్రి ఈ దారుణానికి ఒడికట్టాడని తేలింది.

ఎనిమిదన్నర నెలల గర్భంతో ఉన్న బాలికకు రెండురోజుల క్రితం పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లడం ఇష్టం లేక, తండ్రే ప్రసవం చేశాడు. పుట్టిన బిడ్డను తల్లి కళ్లముందే గొంతు నులిమి చంపేశాడు. ఆ శిశువు తల నరికి ఇంటికి దూరంగా తీసుకెళ్లి మురికి కాల్వలో పడేశాడు. వైద్య అధికారులు ఇంటికి రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. 

కన్నబిడ్డకు ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా ఆమెను ఆస్పత్రికి కాన్పుకి తీసుకెళ్లకుండా తానే ప్రసవం చేసిన తండ్రి, పుట్టిన బిడ్డను కూడా అత్యంత దారుణంగా చంపడం సంచలనంగా మారింది. పరువుపోతుందనే అతడు ఈ పనికి ఒడిగట్టునట్టు తేలింది. పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?