భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవడంతో భారతీయులు అందరూ వర్షం వ్యక్తం చేస్తున్నారు. 200 సంవత్సరాల పైగా భారత్ ను పరిపాలించిన బ్రిటిష్ వారికి ఒక భారత సంతతి వ్యక్తి ప్రధాన కావడం భారతీయులందరూ గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. నిన్నటి నుండి ట్వీట్టర్ లో బ్రిటన్ పీఎంగా ఎన్నికైన రిషి సునాక్ పేరు మారుమెగిపోతోంది.
భారత ప్రధాని మొదలుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా రిషి సునాక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించిన సునాక్ సాధారణ స్థాయి నుంచి బ్రిటన్ ప్రధాని స్థాయికి ఎదిగారు. భారతీయ మూలాలున్న రిషి సునాక్ తాను హిందువునని గర్వంగా చెప్పుకుంటారు.
ఇవాళ రిషి సునాక్ ప్రధాని కావడం పై తన మామ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి స్పందించారు. 'తమ అల్లుడు బ్రిటన్ కి ప్రధాని కావడం చాలా ఆనందంగా ఉందని, రిషి ఎన్నిక మా కుటుంబానికే కాక యావత్ భారత్ కూడా గర్వకారణంగా ఉందంటూ..రిషి ప్రధానిగా బ్రిటన్ ప్రజలకు అత్యున్నత సేవలు అందిస్తారని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు'. 2009లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షితమూర్తితో రిషి సునాక్ బెంగళూరులో వివాహం అయింది.