Advertisement

Advertisement


Home > Politics - National

విశాఖ వైపు మళ్ళిన మోడీ మనసు

విశాఖ వైపు మళ్ళిన మోడీ మనసు

ప్రధాని నరేంద్ర మోడీ మంచి ప్రసంగీకుడు. ఆయన అద్భుతంగా మాట్లాడుతారు. ఆయన ఉపన్యాసాలను విన్న వారంతా అలా అచేతనులు అవుతారు. ఆ మెస్మరైజ్ చేసే గుణమే మోడీని తిరుగులేని నాయకుడిని చేసింది. మోడీ సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆకాశవాణి మాధ్యమాన్ని కూడా తన మనసులోని మాటను చెప్పుకోవడానికి వినియోగించుకోవడం అందరికీ తెలిసిందే.

ప్రతీ నెలా చివరి ఆదివారం మోడీ మన్ కీ బాత్ పేరిట మనసులో మాట చెబుతారు. జాతిని ఉద్దేశించి ఆయన ప్రసగిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల గురించి వారి ఆచార వ్యవహారాలు వారి ప్రతిభా ప్రావీణ్యాలు మేధో సంపత్తి గురించి ఆయన మన్ కీ బాత్ లో చెబుతూంటారు. ఈ నెల 28న ప్రసారం అయ్యే మోడీ మనసులో మాటలో విశాఖ ప్రస్తావన ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

విశాఖ వాసులతో ఆయన ముచ్చటించిన విషయాలను దేశ ప్రజలతో పంచుకుంటారని తెలుస్తోంది. విశాఖలో ఆ రోజున రెండు వేల మందితో ఒక భారీ ర్యాలీని తీసి మరీ మోడీ మన్ కీ బాత్ ని జయప్రదం చేయడానికి బీజేపీ శ్రేణులు చూస్తున్నాయి.

విశాఖ గురించి మోడీ ఏమి చెబుతారు అన్నది ఇపుడు ఆసక్తిని రేపుతోంది. కర్నాటక ఎన్నికల తరువాత బీజేపీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టారు. ఏపీలో కీలకమైన నగరంగా ఉన్న విశాఖ గురించి ప్రజల గురించి మోడీ ఏమి చెప్పనున్నారు అన్నది మన్ కీ బాత్ లోనే నేరుగా వినాలి. 

ఇవన్నీ చూస్తొంటే మోడీ మనసు విశాఖ మీద మళ్ళిందని అంతా అంటున్నారు. మోడీ అలా ఏపీ మీద కూడా తన టార్గెట్ ఉంచారా అన్నది మన్ కీ బాత్ పూర్తిగా వింటే కానీ తెలియదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?