Advertisement

Advertisement


Home > Politics - National

జ‌గ‌న్ పై దాడి.. స్పందించిన ప్ర‌ధాని మోడీ

జ‌గ‌న్ పై దాడి.. స్పందించిన ప్ర‌ధాని మోడీ

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డిపై దాడి సంచ‌ల‌నంగా మారింది. జ‌గ‌న్ పై రాళ్ల దాడితో ఏపీ ఉలిక్కిప‌డింది. తృటిలో ప్ర‌మాదం త‌ప్పినా, దాడి తీవ్ర‌త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల‌ను షాక్ కు గురి చేసింది. 

ఈ దాడిపై ఇత‌ర రాష్ట్ర రాజ‌కీయ ప్ర‌ముఖులు, ప్ర‌ధాన‌మంత్రి కూడా స్పందించారు. జ‌గ‌న్ పై దాడి విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ స్పందిస్తూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

జ‌గ‌న్ పై దాడి విష‌యంలో త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ లు కూడా స్పందించారు. రాజ‌కీయ వైరుధ్యాలు ఇలాంటి హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు దారి తీయ‌డాన్ని స్టాలిన్ ఖండించారు. ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటివి కూడ‌ద‌ని స్టాలిన్ ట్వీట్ చేశారు.  ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి దాడులుకు తావు లేద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. జ‌గ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు!

అయితే ప‌చ్చ‌బ్యాచ్ మాత్రం త‌మ రాక్ష‌స‌మూక‌తో చెల‌రేగుతూ ఉంది. త‌మ‌దైన ప్ర‌చారాల‌తో తమ‌దైన రాక్ష‌స‌త్వాన్ని చాటుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?