అన్న మెజార్టీని మించిన ప్రియాంక‌

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, త‌న అన్న రాహుల్‌గాంధీ మెజార్టీని ప్రియాంక గాంధీ మించిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌తో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాయ‌బ‌రేలి నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేసి, రెండు చోట్ల గెలుపొందారు, అయితే వ‌య‌నాడ్…

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, త‌న అన్న రాహుల్‌గాంధీ మెజార్టీని ప్రియాంక గాంధీ మించిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌తో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాయ‌బ‌రేలి నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేసి, రెండు చోట్ల గెలుపొందారు, అయితే వ‌య‌నాడ్ లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి రాహుల్ రాజీనామా చేయ‌డంతో ఉప ఎన్నిక వ‌చ్చింది. ఈ ఉప ఎన్నిక‌లో రాహుల్ చెల్లి ప్రియాంక గాంధీ పోటీ చేశారు.

తాజాగా వెల్ల‌డైన ఫ‌లితాల్లో త‌న స‌మీప సీపీఎం అభ్య‌ర్థి స‌త్య‌న్ మొకేరిపై ప్రియాంక గాంధీ 4,08,036 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ‌తంలో రాహుల్‌గాంధీకి 3ల‌క్ష‌ల 64వేల ఓట్ల మెజార్టీ ల‌భించింది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో భాగంగా మొద‌టి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొంద‌డం విశేషం.

ఇంత వ‌ర‌కూ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. తాజాగా వ‌య‌నాడ్‌లో గెలుపుతో అన్న‌తో పాటు లోక్‌స‌భ‌లో ప్రియాంక కూచోనున్నారు. వీరి త‌ల్లి సోనియాగాంధీ ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

ప్రియాంక‌గాంధీ ఎన్నిక‌తో కాంగ్రెస్‌కు మ‌రో బ‌ల‌మైన వాయిస్ ద‌క్కినట్టైంది. అయితే కాంగ్రెస్‌ను అధికారం వైపు న‌డిపించ‌డంలో ఏ మేర‌కు స‌క్సెస్ అవుతార‌నేది ముఖ్యం.

5 Replies to “అన్న మెజార్టీని మించిన ప్రియాంక‌”

Comments are closed.