Advertisement

Advertisement


Home > Politics - National

మల్టీప్లెక్సు మార్కెట్లో మరో కుదుపు..?

మల్టీప్లెక్సు మార్కెట్లో మరో కుదుపు..?

కరోనా టైమ్ లో, కరోనా తర్వాత మల్టీప్లెక్స్ మార్కెట్ దారుణంగా దెబ్బతింది. సినిమాలకు జనాలు రావడం తగ్గించిన తర్వాత.. మాల్ లో 50శాతానికి పైగా షాపులు ఖాళీ అయ్యాయి. ఇప్పుడిప్పుడే మాల్టీప్లెక్స్ మార్కెట్ కోలుకుంటున్న టైమ్ లో మరో భారీ కుదుపు. ఈసారి మాంద్యం పీవీఆర్ మార్కెట్ ను తాకినట్టు కనిపిస్తోంది.

పీవీఆర్ సంస్థ, తన చెయిన్ లో 50 స్క్రీన్స్ ను మూసివేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. గడిచిన 3-4 నెలల్లో ఈ సంస్థ.. దేశవ్యాప్తంగా అదనంగా 79 స్క్రీన్స్ ను జోడించింది. అంతలోనే 50 స్క్రీన్స్ ను మూసేస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రానున్న 6 నెలల్లో ఈ 50 స్క్రీన్స్ మూతపడతాయి.

ప్రస్తుతం పీవీఆర్ గ్రూప్ నష్టాల్లో ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 333 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించింది ఆ సంస్థ. అంతకుముందు క్వార్టర్ లో ఈ కంపెనీ నష్టం 105 కోట్ల రూపాయలు. ఇలా ప్రతి త్రైమాసికానికి నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో.. అంతగా ఆదరణ దక్కించుకొని, ఆక్యుపెన్సీ కనిపించని స్క్రీన్స్ ను మూసేయాలని సంస్థ నిర్ణయించింది. తాజా నిర్ణయానికి కారణం ఇదే.

నిజానికి స్క్రీన్స్ కౌంట్ పెంచాలనేది పీవీఆర్ లక్ష్యం. ముగిసిన త్రైమాసికంలో నష్టం చవిచూసినప్పటికీ, ఓవరాల్ గా పీవీఆర్ ఆదాయం రెండింతలు పెరిగి 1143 కోట్ల రూపాయలకు చేరుకుంది. అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో 168 కొత్త స్క్రీన్స్ జోడించాలని అనుకుంది. ఇందులో భాగంగా ఆల్రెడీ 79 స్క్రీన్స్ ప్రవేశపెట్టింది. అంతలోనే ఓ 50 స్క్రీన్స్ తగ్గించబోతోంది.

పీవీఆర్ పై బాలీవుడ్ సినిమాల ప్రభావం గట్టిగా పడింది. గతేడాది డిసెంబర్ లో వచ్చిన అవతార్ తర్వాత, మళ్లీ ఆ స్థాయిలో పఠాన్ తో మాత్రమే ఆక్యుపెన్సీ చూసింది పీవీఆర్ ఛెయిన్. మధ్యలో వచ్చిన బాలీవుడ్ సినిమాలేవీ ఈ కంపెనీకి కలిసిరాలేదు. భోళా, సెల్ఫీ, షెహజాదా లాంటి సినిమాలు మరింత దెబ్బతీశాయి. ఈ క్రమంలో గ్రూప్ లో చిన్న కుదుపులు తప్పడం లేదు.

ప్రస్తుతం పీవీఆర్ ఛెయిన్ కు భారతదేశం, శ్రీలంకలోని 115 నగరాల్లో 1689 స్క్రీన్స్ ఉన్నాయి. ఇంతకుముందే చెప్పినట్టు, అది తన స్క్రీన్ కౌంట్ ను పెంచుతుందా, లేక వచ్చే త్రైమాసికానికి మరింత తగ్గిస్తుందా అనేది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?