కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా రాహుల్ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నైట్‌క్లబ్‌లో పాల్గొన్న వీడియోను ప్రత్యర్థులు ఆయుధంగా వాడుకుంటున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్‌క్లబ్‌లో చైనా మహిళా దౌత్యవేత్తతో కలిసి రాహుల్ ప్రత్యక్షం కావడాన్ని ప్రత్యర్థులు రాజకీయంగా వాడుకుంటున్నారు.
నైట్‌క్లబ్‌లో రాహుల్ కనిపించడంపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ సుమ్నీమా ఉదాస్ వివాహ వేడుక కోసం సోమవారం రాహుల్ గాంధీ ఖాట్మాండు వెళ్లారు. స్నేహితులతో కలిసి ఖాట్మాండ్‌లోని మారియట్ హోటల్లో బస చేశారు. ఇదిలా వుండగా మయన్మార్‌లో భూమ్ ఉదాస్ నేపాల్ అంబాసిడర్‌గా ఉన్నారు.
పెళ్లి వేడుకలో భాగంగా రాహుల్ నైట్ పార్టీకి వెళ్లి ఉండొచ్చని సమాచారం. ఈ వీడియోని అడ్డం పెట్టుకుని బీజేపీ ఐటీ ఇన్చార్జి అమిత్ మాలవియాతో పాటు పలువురు ఆ పార్టీ నేతలు రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ సీరియస్‌గా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సూర్జేవాలా స్పందిస్తూ రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోలో తప్పేముందని? నిలదీశారు. ఫ్రెండ్ వివాహ వేడుకకు రాహుల్ నేపాల్ వెళ్లడం నేరమా? అని సూటిగా ప్రశ్నించారు. బహుశా బీజేపీ త్వరలో బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని నేరంగా ప్రకటిస్తుందేమో అని రణదీప్ సూర్జేవాలా సెటైర్స్ విసిరారు.