భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త , పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్టు డ్రామా ఆడారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అసలే క్రీడాకారులైన ఇద్దరూ తమ అభిమానులతో కూడా గేమ్ ఆడారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరూ విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, వారు ఏ మాత్రం స్పందించలేదు. దీంతో వారి అభిమానుల్లో ఆందోళన నెలకుంది.
ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి పాకిస్తాన్‌కు చెందిన ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం, అలాగే తాజాగా సానియాకు మాలిక్ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పడంతో విడాకుల ప్రచారానికి తెరపడినట్టే అని చెబుతున్నారు. ఇటీవల సానియా ట్విటర్ వేదికగా మాలిక్‌తో విభేదాలున్నాయని, విడిపోతున్నారనే అర్థం వచ్చేలా పోస్టు పెట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ముఖ్యంగా పాకిస్తాన్ మీడియా స్టార్ సెలబ్రిటీ జంట విడిపోతున్నట్టు, వారి సన్నిహితులు చెబుతున్నారని వార్తా కథనాలు రాసింది. ఇటీవల కాలంలో సెలబ్రిటీ జంటలు విడిపోవడానికి ముందు… తమ సోషల్ మీడియా ఖాతాల్లో పరోక్షంగా సంకేతాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో సానియా జంట కూడా చేరబోతుందన్న వార్త విస్తృతంగా చక్కర్లు కొట్టింది.
ఈ నేపథ్యంలో ఇవాళ 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సానియాకు మాలిక్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.
“నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు చాలా ఆరోగ్యంగా, సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా. నీదైన పుట్టిన రోజును ఆస్వాదించు” అని మాలిక్ ట్వీట్ చేశారు. సానియాతో కలిసి వున్న ఫొటోను కూడా ఆయన షేర్ చేయడం గమనార్హం. సానియా జంట విడిపోతున్న ప్రచారం…కేవలం పబ్లిసిటీ స్టంట్‌గా నెటిజన్లు విమర్శిస్తున్నారు.