కామన్వెల్త్ గేమ్స్- 2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు బంగారు పతకం సొంతం చేసుకుంది.
కెనడా షట్లర్ లీపై పీవీ సింధు విజయం సాధించింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈవెంట్ లో పీవీ సింధు కామన్వెల్త్ గేమ్స్ లో ఛాంపియన్ గా నిలవడం ఇదే తొలిసారి. కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ ఈవెంట్ లో భారత్ కు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం.
బర్మింగ్ హామ్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్ కెనడా షట్లర్ మిచెల్లీ లీని సింధు మట్టికరిపించింది. మొదటి నుండి అధిపత్యం కనబరుతస్తూ (21-15, 21-13) ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించి విజేతగా నిలిచింది.
2014లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో కాంస్యం, 2018లో రజత పతకాలు గెలిచిన చివరికి ఈసారి స్వర్ణం గెలిచి తన ఖాతాలో సరికోత్త రికార్డ్ నెలకొల్పింది.