సోనియా గాంధీకి మళ్లీ కరోనా!

ఈ ఏడాది జూన్‌లో కోవిడ్ భారిన పడిన కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండోసారి కూడా వైరస్‌ బారిన పడ్డారు. ఈ సమాచారాన్ని పార్టీ ఎంపీ, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం…

ఈ ఏడాది జూన్‌లో కోవిడ్ భారిన పడిన కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండోసారి కూడా వైరస్‌ బారిన పడ్డారు. ఈ సమాచారాన్ని పార్టీ ఎంపీ, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్‌లో తెలియజేశారు.

“కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆమె హోం ఐసోలేష‌న్ లో ఉంటుంది” అని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.

అంతకుముందు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా త‌ను కూడా వైరస్‌ బారిన ప‌డ్డాన‌ని ఐసోలేషన్‌లో ఉన్నారని తెలియజేశారు.

ఇది ఇలా ఉండ‌గా జూన్‌లో కోవిడ్ బారిన ప‌డినా సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.