Advertisement

Advertisement


Home > Politics - National

అత్యథిక ఉద్యోగుల్ని కలిగిన టాప్-5 సంస్థలివే..!

అత్యథిక ఉద్యోగుల్ని కలిగిన టాప్-5 సంస్థలివే..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లే-ఆఫ్ సీజన్ నడుస్తోంది. ఫలానా కంపెనీ ఇంతమందిని విధుల నుంచి తొలిగించిందని, ఫలానా సాఫ్ట్ వేర్ కంపెనీ వందలాది మందికి పింక్ స్లిప్స్ ఇచ్చిందని రోజుకు పదుల సంఖ్యలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో, అసలు ప్రపంచంలో అత్యథికంగా ఉద్యోగుల్ని కలిగిన కంపెనీలు ఏంటనే చర్చ మొదలైంది.

ప్రపంచంలో అత్యథిక సంఖ్యలో ఉద్యోగుల్ని కలిగిన సంస్థ వాల్ మార్ట్. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఉద్యోగుల పరంగా వరల్డ్ లో నంబర్-1 కంపెనీ ఇదే. ఇక 15 లక్షల 44వేల ఉద్యోగాలతో రెండో స్థానంలో అమెజాన్ నిలిచింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఉద్యోగుల్ని తొలిగిస్తున్నప్పటికీ, ఉద్యోగాల సంఖ్యాపరంగా ఇది రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇక మూడో స్థానంలో ఫాక్స్ కాన్ (8,26,000), నాలుగో స్థానంలో ఎసెంచర్ (7,38,000), ఐదో స్థానంలో ఫోక్స్ వాగన్ (6,41,900) సంస్థలు నిలిచాయి. భారత్ కు చెందిన టీసీఎస్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.

అత్యథిక ఉద్యోగుల్ని కలిగిన సంస్థల్లో ఎక్కువశాతం ఆటోమొబైల్ రంగంలో ఉండడం విశేషం. ఇక అత్యథికంగా ఉద్యోగుల్ని కలిగిన సంస్థల్లో ఎక్కువ కంపెనీలు చైనాకు చెందినవి కావడం విశేషం. అపారమైన మానవ వనరులు కలిగిన భారత్ నుంచి కేవలం 3-4 కంపెనీలకు మాత్రమే టాప్-50 లిస్ట్ లో చోటు దక్కింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?