ఈనాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ముందుగా ఫిబ్రవరి 16న త్రిపురలో పోలింగ్ జరుగుతుండగా.. నాగాలాండ్, మేఘాలయాలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతుండగా .. మార్చి 2న కౌంటింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మార్చి 15, 22 పూర్తికానున్నాయి. అలాగే నాగాలాండ్ అసెంబ్లీ కాల పరిమితి మార్చి 12న ముగియనుంది. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. నాగాలాండ్‍లో నేషనల్ డెమొక్రటివ్ ప్రొగ్రెసివ్ పార్టీ, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో కొనసాగుతున్నాయి.
త్రిపురలో బీజేపీ పార్టీ నాయకుడు మాణిక్ సాహా ముఖ్యమంత్రి కొనసాగుతుండగా, నాగాలాండ్, మేఘాలయ ప్రభుత్వాలలో కూడా బీజేపీ భాగస్వామిగా ఉంది. ఎన్నికలు జరగబోతున్న మూడు రాష్ట్రాల్లోను అసెంబ్లీ స్ధానాలు వరుసగా నాగాలాండ్(60), మేఘాలమా(60), త్రిపుర(60) స్ధానాలు ఉన్నాయి. ఈ ఏడాది ఈ మూడు రాష్ట్రాలతో పాటు.. మరో అరు రాష్ట్రాలు మిజోరం, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‍గఢ్, రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.