చాయ్ తో సమోసా.. బ్రిటన్ లో భారతీయత

చాయ్-సమోసా.. ఇండియాలో ఫేమస్ కాంబినేషన్. ఇప్పుడిది బ్రిటన్ కు వ్యాపించింది. యూకే యువత ఎక్కువగ చాయ్ తో సమోసా తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం బయటపడింది. Advertisement…

చాయ్-సమోసా.. ఇండియాలో ఫేమస్ కాంబినేషన్. ఇప్పుడిది బ్రిటన్ కు వ్యాపించింది. యూకే యువత ఎక్కువగ చాయ్ తో సమోసా తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం బయటపడింది.

బ్రిటన్ లో చాయ్ లో బిస్కెట్ తినడం ఏళ్లుగా వస్తున్న ఆచారం. ఇంకా చెప్పాలంటే ఆ సంస్కృతే ఇండియాకు కూడా పాకింది. అయితే క్రమక్రమంగా బ్రిటన్ యువతలో చాయ్-బిస్కెట్ కల్చర్ మాయమౌతోంది. వాళ్లు భారతీయులు ఎక్కువగా ఇష్టపడే సమోసాను చిరుతిండిగా తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

55 ఏళ్లు పైబడిన బ్రిటిషర్లు ఇప్పటికీ చాయ్ తో బిస్కెట్ లేదా గ్రానోలా బార్స్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న బ్రిటిషర్లు మాత్రం ఎక్కువగా సమోసాపై దృష్టి పెడుతున్నారట. యూకే కు చెందిన టీ అండ్ ఇన్ ఫ్యూజన్స్ అసోసియేషన్ నిర్వహించిన సర్వేలో ప్రతి పదిమంది బ్రిటన్ యువతలో ఒకరు గ్రానోలా బార్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రెండో స్థానంలో సమోసా నిలిచింది.

18-29 ఏళ్ల మధ్య ఉండే బ్రిటిషర్లలో సమోస పట్ల మక్కువ 8శాతం చొప్పున పెరుగుతున్నట్టు ఈ అసోసియేషన్ తేల్చింది. ఇంకా చెప్పాలంటే.. ఇప్పటితరం బ్రిటిష్ యువత చాయ్ తో బిస్కెట్ ను వదిలించుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోందనేది ఈ సర్వే సారాంశం. ఇదే ట్రెండ్ కొనసాగితే, మరికొన్నేళ్లలో బ్రిటన్ లో సమోసా ఆధిపత్యం స్పష్టంగా కనిపించడం ఖాయం.