కర్ణాటకలోని హాసన్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బు లేకపోయినా ఈ కామర్స్ పోర్టల్ నుండి ఐఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి ఐఫోన్ డెలివరీ చేసిన డెలివరీ బాయ్‌ని చంపి, అతని మృతదేహాన్ని నాలుగు రోజులు పాటు తన ఇంటిలో పెట్టుకోని, మృత దేహాం వాసన రావడంతో మృత దేహాన్ని బైక్‌పై రైల్యే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి ప్రెటోల్ పోసి నిప్పంటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హేమంత్ దత్త అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్ నుండి ఐఫోన్‌ను ఆర్డర్ చేశాడు. డెలివరీ తర్వాత రూ. 46,000 చెల్లించాల్సి ఉంది. ఫిబ్రవరి 7న, నాయక్ ఫోన్ డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు, దత్తా బాక్స్ తెరవమని అడిగాడు. అయితే, నాయక్ అందుకు నిరాకరించి, దానిని తెరిస్తే, దానిని వెనక్కి తీసుకోలేనని, ఫోన్ కోసం డబ్బు చెల్లించాలని దత్తాను కోరాడు. దీంతో తన వద్ద డబ్బులు లేవని, కాసేపు ఇంట్లో కూర్చుంటే తీసుకొస్తానని డెలివరీ ఏజెంట్‌ను నమ్మించాడు. ఆ మాటలు నమ్మి ఇంట్లోకి వచ్చిన ఆ డెలివరీ బాయ్‌ను.. హేమంత్ కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు . ఈ ఘటనలో డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
నాలుగు రోజులుగా డెలివరీ బాయ్ కనపడటం లేదని అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. హేమంత్ దత్త గతంలో వివిధ కొరియర్స్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేశారు. డెలివరీ బాయ్‌గా పనిచేసే టైంలో కూడా ఆర్డర్స్ దొంగిలిస్తున్నారని ఉద్యోగం కోల్పోయిన్నట్లు తెలుస్తోంది.