భార్య పై దాడికి పాల్పడిన మాజీ క్రికెటర్!

నిత్యం వివాదాలు చూట్టు తిరిగే భార‌త మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లీపై ముంబై పోలీసులు కేసు న‌మోదు చేశారు. వినోద్ కాంబ్లీ బాంద్రాలోని త‌న నివాసంలో మ‌ద్యం మ‌త్తులో త‌న భార్య‌పై దాడి చేసిన…

నిత్యం వివాదాలు చూట్టు తిరిగే భార‌త మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లీపై ముంబై పోలీసులు కేసు న‌మోదు చేశారు. వినోద్ కాంబ్లీ బాంద్రాలోని త‌న నివాసంలో మ‌ద్యం మ‌త్తులో త‌న భార్య‌పై దాడి చేసిన ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదు చేశారు. వినోద్ కాంబ్లీ పాన్ హ్యాండిల్‌ని తనపైకి విసిరాడని, దాని వల్లే తన తలకు గాయమైందని కాంబ్లీ భార్య ఆరోపించింది.

గ‌తంలో కూడా మద్యం మత్తులో కారును ఢీకొట్టిన కేసులో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు. బాంద్రా సొసైటీకి చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో అప్ప‌ట్లో కాంబ్లీని ఆరెస్ట్ చేసి.. ఆ రోజే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇప్పుడు భార్య‌ను కొట్టిన కేసులో పోలీసు కేసు న‌మోదైంది.

వినోద్ కాంబ్లీ టీమిండియా త‌రుపున 17 టెస్టులు,  104 వ‌న్డే మ్యాచ్ లు ఆడటం విశేషం.   1991లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు.  అక్టోబర్ 2000లో వినోద్ కాంబ్లీ చివరి మ్యాచ్ ఆడాడు. నిత్యం తన ప్రవర్తనల వ‌ల్ల వ‌రుస‌ వివాదాలతో కూరుకుపోతున్నారు. గ‌తంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రీడలో మెళుకువల్ని నేర్చుకుంటూ కాంబ్లీ ప్రతిభావంతుడైన క్రికెటర్‌గా ఎదిగాడు.