Advertisement

Advertisement


Home > Politics - National

విరాట్ శ‌కం ముగుస్తోంది, యాడ్ మార్కెట్ లో కొత్త టాప‌ర్!

విరాట్ శ‌కం ముగుస్తోంది, యాడ్ మార్కెట్ లో కొత్త టాప‌ర్!

భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఆడుతూ స్టార్ డ‌మ్ ను సంపాదించుకున్న వారు నిస్సందేహంగా ఇండియ‌న్ యాడ్ మార్కెట్ లో సూప‌ర్ స్టార్లు అవుతారు. ఇది గ‌తం నుంచి అంద‌రికీ తెలిసిన అంశ‌మే. టీమిండియా త‌ర‌ఫున అద్భుతాలు సాధించి, ప్ర‌పంచ క్రికెట్ లో మాస్ట‌ర్ బ్లాస్టర్ అనిపించుకున్న స‌చిన్ టెండూల్క‌ర్ చాలా కాలం పాటే యాడ్ మార్కెట్ ను శాసించాడు. బోలెడ‌న్ని బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్ గా సచిన్ భారీ పారితోషికాల‌ను పొందాడు. క్రికెట్ కు మించి స‌చిన్ కు యాడ్ రెవెన్యూ క‌లిసి వ‌చ్చింది. బాలీవుడ్ నుంచి కొద్దో గొప్పో పోటీ ఉన్నా.. స‌చిన్ టెండూల్క‌ర్ యాడ్ మార్కెట్ లో టాప‌ర్ గా నిలిచాడు. అప్ప‌ట్లో స‌చిన్ కు షారూక్, అమితాబ్ నుంచి ఈ విష‌యంలో కొంత పోటీ ఉండేది. అది కొంత వ‌ర‌కూ మాత్ర‌మే!

చాలా కాలానికి సచిన్ యాడ్ మార్కెట్ కు థ్రెట్ ఏర్ప‌డింది ధోనీ ఎంట్రీతో. టీమిండియా త‌ర‌ఫున ధోనీ ఆరంగేట్రం చేసిన అతి త‌క్కువ కాలంలోనే స్టార్ అయ్యాడు. తొలి తొలి ఇన్నింగ్స్ ల‌లోనే ధోనీ అద్భుతాలు చేయ‌డంతో ఫ్యాన్స్ క్రేజ్ ఒక్క‌సారిగా ధోనీ వైపు మ‌ళ్లింది. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యంతో ధోనీ సూప‌ర్ స్టార్ అయ్యాడు. స‌చిన్ అప్ప‌టికీ అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా.. స‌చిన్ కు ధీటుగా ఎండోర్స్ మెంట్ డీల్స్ ను ధోనీ సొంతం చేసుకున్నాడు. అదే ఊపులో స‌చిన్ స్థాయిని అధిగ‌మించాడు. దేశీయ యాడ్ మార్కెట్ లో ధోనీ టాప‌ర్ గా నిలిచాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి స‌చిన్ రిటైర్మెంట్ త‌ర్వాత పూర్తిగా ధోనీ హ‌వా కొన‌సాగింది. అయితే కొంత కాలానికే విరాట్ కొహ్లీ ఉద‌యించాడు!

ఇప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్ లో సెంచ‌రీల విష‌యంలో స‌చిన్ త‌ర్వాత ఉన్న‌ది విరాట్ కొహ్లీనే. కేవ‌లం సెంచ‌రీల హీరోనే కాదు.. ప‌రుగులు సంఖ్య‌లో కూడా ఓవ‌రాల్ గా స‌చిన్ త‌ర్వాతి స్థానాన్ని కొహ్లీనే పొందే అవ‌కాశాలున్నాయి. కొహ్లీ పొందిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, యాడ్ మార్కెట్ లో అత‌డి లీడ‌ర్ స్థానం గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ధోనీని అధిగ‌మించి కొహ్లీ ఎప్పుడో నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ ను సొంతం చేసుకున్నాడు!  ఇప్పుడు విశేషం ఏమిటంటే.. కొహ్లీ బ్రాండ్ వ్యాల్యూ క్ర‌మంగా త‌గ్గుతుండ‌టం!

గ‌త రెండు మూడేళ్లుగా విరాట్ కొహ్లీ ఫామ్ అంతంత మాత్ర‌మే! మంచి ఊపు మీద ఉన్న‌ప్పుడు వెనుక‌బ‌డిన కొహ్లీ ఆ త‌ర్వాత మునుప‌టి స్థాయిలో పుంజుకోలేక‌పోతున్నాడు. అడ‌పాద‌డ‌పా ఆడుతున్నా.. మూడేళ్ల కింద‌టి కొహ్లీకి, ప్ర‌స్తుత కొహ్లీకి చాలా తేడా ఉంది. అప్పుడు కొహ్లీ సెంచ‌రీలు బాదుతూ ఉంటే అంతా చ‌ప్ప‌ట్లు కొట్టారు, ఇప్పుడు వేరే వాళ్లు ఆడుతుంటే కొహ్లీ చ‌ప్ప‌ట్లు కొడుతున్నాడు! అంత తేడా ఉంది. అయితే జ‌ట్టులో స్థానం ఉంది. టీ20ల విష‌యంలో బీసీసీఐ ప‌క్క‌న పెట్టేసింది ఎప్పుడో. వ‌న్డేలు, టెస్టుల వ‌ర‌కూ ఫ‌ర్వాలేదు. అయినా కొహ్లీ ప్ర‌ద‌ర్శ‌నలో మాత్రం మునుప‌టి అద్భుతాలు లేవు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా కొహ్లీ వెనుక‌బ‌డ్డాడు. మ‌రోవైపు క్రికెట్ లో కొత్త కెర‌టాలు వ‌స్తున్నాయి. దీంతో కొహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ త‌గ్గుతోంది. ఈ నేప‌థ్యంలో ఇత‌డి యాడ్ మార్కెట్ కూడా అదే బాట‌ను అనుస‌రిస్తోంది.

తాజాగా మొత్తం ఎండోర్స్ మెంట్ డీల్ విలువ‌లో కొహ్లీ స్థాయిని అధిగ‌మించాడు బాలీవుడ్ హీరో ర‌ణ్ వీర్ సింగ్. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఇండియాలో యాడ్ మార్కెట్ లీడ‌ర్ గా ఎప్పుడూ ఎవ‌రో ఒక క్రికెట‌రే ఉంటూ వ‌చ్చారు. స‌చిన్ స‌మ‌యంలో షారూక్, ధోనీ స‌మ‌యంలో ఇత‌ర బాలీవుడ్ స్టార్లు వెనుకే నిలిచారు. మొన్న‌టి వ‌ర‌కూ కూడా ర‌ణ్ వీర్ ది కొహ్లీ త‌ర్వాతి స్థాన‌మే. అయితే ఇప్పుడు స్థానాలు మారాయి. కొహ్లీని దాటేసి ర‌ణ్ వీర్ తొలి స్థానాన్ని పొందాడు. ఇలా క్రికెట్ క్రేజ్ ను బాలీవుడ్ జ‌యించింది.

ర‌ణ్ వీర్ యాడ్ రెవెన్యూ ప్ర‌స్తుతం ఏడాదికి 18 కోట్ల డాల‌ర్ల స్థాయిలో ఉంది. కొహ్లీ 17 కోట్ల డాల‌ర్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. 2020లో కొహ్లీ ఈ మార్గంలో సుమారు 23 కోట్ల డాల‌ర్ల ఆదాయాన్ని పొందాడు. ఇప్పుడు 17 కోట్ల డాల‌ర్ల స్థాయికి అత‌డి మార్కెట్ రేంజ్ త‌గ్గింది. ఇక వీరి త‌ర్వాతి స్థానాల్లో అక్ష‌య్ కుమార్ 15 కోట్ల డాల‌ర్ల తో, అలియా భ‌ట్ 10 కోట్ల డాల‌ర్ల‌తో ఉన్నారు. దీపికా ప‌దుకోన్ దాదాపు 8 కోట్ల డాల‌ర్ల ఆదాయంతో ఆ త‌ర్వాతి స్థానంలో నిలుస్తోంది.

మొత్తానికి యాడ్ మార్కెట్ లో విరాట్ శ‌కంగా ముగుస్తున్న‌ట్టుగా ఉంది. యంగ్ క్రికెట‌ర్ల‌కు వైపు కూడా ఎండోర్స్ మెంట్ డీల్స్ ఇక చూసే అవ‌కాశం ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?