అల్లోపతి వైద్యం మరియు టీకాలకు వ్యతిరేకంగా రాందేవ్ బాబా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇండియాన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఎ) సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ఇవాళ వాదనలు జరిగాయి. యోగాను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన రామ్ దేవ్ ఇతర వ్యవస్ధలను విమర్శించడం కరెక్ట్ కాదని ధర్మాసనం హెచ్చరించింది.
రాందేవ్ బాబా అనుసరించే విధానలతో అన్ని రకాల వ్యాధులు నయం అవుతాయని గ్యారెంటీ ఏంటని సీజేఐ ప్రశ్నించింది. అయుష్ కంపెనీ ద్వారా బాబా రాందేవ్ చేసిన ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. బాబా రాందేవ్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్రానికి నోటిసులు జారీ చేసింది.
గత సంవత్సరం, రాందేవ్ మాట్లడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ లో దేశంలో అల్లోపతి మందుల వల్ల లక్షల మంది మరణించారు. వారికి చిక్సిత లేదా ఆక్సిజన్ అందక మరణించిన వారి కంటే చాలా ఎక్కువ అంటూ.. అల్లోపతిని ముర్జమైన మరియు దివాళా తీసిన శాస్త్రం అంటూ పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా చాలా మంది వైద్యులు మరణించారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఐఎంఎ రాందేవ్ ప్రకటనలు ద్వారా అల్లోపతిని అవమానిస్తున్నారని, తప్పుడు ప్రటనల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించినందునందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్య తీసుకొవాలని, అతనిపై విచారణ జరపాలని కోరింది.