రాజాసింగ్‌‌ సస్పెండ్!

ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. మ‌హ్మ‌ద్ ప్ర‌వక్త‌పై చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌ధ్యంలో బీజేపీ అధిష్టానం గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. పార్టీలోని అన్ని…

ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. మ‌హ్మ‌ద్ ప్ర‌వక్త‌పై చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌ధ్యంలో బీజేపీ అధిష్టానం గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. పార్టీలోని అన్ని ప‌దవుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు బీజేపీ ప్ర‌క‌టించింది. 

అలాగే రాజాసింగ్ కు ప‌ది రోజుల గడువిచ్చి ఆ వాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి టైం ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 2 లోగా స‌మాధానం చెప్పాల‌ని ఎమ్మెల్యేను పార్టీ అధిష్టానం అదేశించింది. 

మీరు వివిధ విషయాలపై పార్టీ వైఖరికి విరుద్ధంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు, ఇది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలోని రూల్ XXV. 10 (a)ని స్పష్టంగా ఉల్లంఘించేలా ఉన్న‌యంటూ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ తెలిపారు. త‌క్ష‌ణ‌మే పార్టీ నుండి మరియు మీ బాధ్యతలు నుండి సస్పెండ్ చేయబడ్డాయి, తక్షణమే అమలులోకి వస్తుంది అంటూ లేఖ‌లో పెర్కొన్నారు.

రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే విడుదల చేసిన వీడియోపై మజ్లిస్‌ నేతలు, మైనార్టీలు.. అర్ధరాత్రి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల ఫిర్యాదుతో యూట్యూబ్‌ వీడియోలను రాజాసింగ్‌ తొలగించారు.