ఉత్తర ప్రదేశ్ లో ఎంపీ సీట్లకు బిజెపి అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ ఏ మాత్రం సంప్రదించలేదట.
Advertisement
80 మంది అభ్యర్థుల్లో ఒక్కర్ని కూడా యోగీ సూచించిన వారిని ఎంపిక చేయలేదు. యోగీని మాత్రమే కాదు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ప్రధాన కార్యదర్శిని కూడా పట్టించుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
తాము తమ సర్వే ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేశామని అమిత్ షా చెప్పారట. కాగా అంతా తన వాళ్లే ఉంటే భవిష్యత్ రాజకీయసమీకరణాల్లో యోగీ ఆదిత్యనాథ్ ప్రభావం ఉండదని మోదీ భావిస్తున్నట్లు తెలిసింది.