రష్మిక.. విజయ్‌లు ఇద్దరూ ఒకే దగ్గర వుండి, వేరు వేరు వీడియోలు లేదా ఫొటోలు వదిలి, దొరికేస్తుంటారు ఎప్పుడూ. ఇది ఎప్పుడూ జరిగేదే. మరోసారి జరిగింది అంతే. రష్మిక.. విజయ్ ఇద్దరూ ప్రేమలో వున్నారని ఎప్పటి నుంచో గ్యాసిప్ లు వున్నాయి. ఆ ఇద్దరూ పెద్దగా ఖండించనూ లేదు. అంగీకరించనూ లేదు.
ఇద్దరూ ఎప్పుడో ఒకసారి పెళ్లి వార్త కచ్చితంగా చెబుతారని సినిమా ఫ్యాన్స్, వాళ్లిద్దరి ఫ్యాన్స్ అనుకుంటూ వుండగానే కాలం సాగిపోతోంది. ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు. కానీ ఇద్దరికీ మాత్రం మీడియా నుంచి ఎప్పటికప్పుడు ఒక్కళ్ల గురించి వేరొక్కళ్లకి ప్రశ్నలు ఎదురవుతూ వుంటాయి.
ఇదిలా వుంటే నిన్నటికి నిన్న మళ్లీ ఆ ఇద్దరూ ఒకే దగ్గర వుండి వేరు వేరు వీడియోలు వదిలి దొరికేసారు. నెటిజన్లు మామూలుగా వుండరు. కోడిగుడ్డుకు ఈకలు పీకేయగలరు. మొన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఫ్యామిలీ స్టార్ సినిమాకు. అది అయిన తరువాత తెల్లవారు ఝామున విజయ్ విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. లెక్క ప్రకారం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లకు విజయ్ అమెరికా వెళ్లాల్సి వుంది.
తాను అమెరికా వస్తున్నా, థియేటర్లలో కలుద్దాం అనేలా విజయ్ ఓ వీడియోను నిన్న సోషల్ మీడియాలో షేర్ చేసారు. గమ్మత్తేమిటంటే అదే విధంగా రష్మిక కూడా తన ఇన్ స్టా స్టేటస్ లో ఓ మాంచి నేచుర్ వీడియో పెట్టారు. ఈ రెండు వీడియోల్లో కామన్ పాయింట్ ను నెటిజన్లు పట్టేసారు. అందమైన నెమళ్లు ఆ రెండు వీడియోల్లో కనిపించాయి. పచ్చిక మైదానాలు కూడా రెండు వీడియోల్లో ఒకలాగే వున్నాయి.
దాంతో ఇద్దరూ ఒకే లోకేషన్ లో వున్నారని నెటిజన్లు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంట తమ పెళ్లి వార్తను. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీగా వున్నారు.