నవ్వుతున్నారు.. థూ.. అని ఊస్తున్నారు!

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్థ్రాలు సందించారు. వాలంటీర్లు తన కుమారుడు లోకేష్ లాగా మొద్దు అబ్బాయిలు కారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరిచ్చారు మీకీ అధికారం…

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్థ్రాలు సందించారు. వాలంటీర్లు తన కుమారుడు లోకేష్ లాగా మొద్దు అబ్బాయిలు కారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరిచ్చారు మీకీ అధికారం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు.

పదే పదే శోకాలు పెట్టడం తప్ప… ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించరాదనే కనీస సృహ కూడా ఆయనకు లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా లబ్దిదారులు జాబితా వెలువడి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

గ్రామ సచివాలయ ఉద్యోగాలు పొందిన తెలుగుదేశం కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక.. పులివెందుల పంచాయతీ, జె-ట్యాక్స్ అని చంద్రబాబు ఏడుపు రాగాలు తీస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఆయన మాటలపై తుపుక్కుమని ఊస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

నీ తెలుగు కంటే నేనే మేలు.. హాట్ యాంకర్ డైరెక్టర్ చిట్ చాట్