టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాష్ ను కేసులు వెంటాడుతున్నాయి. ఆయనపై నకిలీ ఐడి సృష్టించిన కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆయనను పిటివారంట్ పై చంచల్ గూడ జైలు నుంచి మియాపూర్ కోర్టుకు పోలీసులు తీసుకువెళ్లి హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విదించారు.
ఇప్పటికే అలందా మీడియా కేసులో 18 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే తమకు కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్ ను వచ్చే నెలకు వాయిదా వేశారు.
మరోవైపు బెయిల్ పిటిషన్ పై ఇంకా విచారణ జరగలవలసి ఉంది. తాజాగా ఐలాబ్స్ నటరాజన్ పేరుతో నకిలీ ఐడి తయారు చేశారని రవిప్రకాష్ పై అభియోగం రాగా, ఐటి చట్టం కింద కేసు పెట్టారు.