సచివాలయ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్

ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం షాకిచ్చింది. ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నారో.. లేక పైస్థాయి అధికారులే అత్యుత్సాహం ప్రదర్శించారో తెలియదు కానీ, ఆదేశాలైతే వెలువడ్డాయి.  Advertisement ఇకపై గ్రామ సచివాలయంలో…

ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం షాకిచ్చింది. ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నారో.. లేక పైస్థాయి అధికారులే అత్యుత్సాహం ప్రదర్శించారో తెలియదు కానీ, ఆదేశాలైతే వెలువడ్డాయి. 

ఇకపై గ్రామ సచివాలయంలో పనిచేసే సిబ్బంది అంతా అదే గ్రామంలో నివాసం ఉండాలని, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది.. అదే మున్సిపాల్టీ లిమిట్స్ లో కాపురం పెట్టాలని తేల్చి చెప్పారు.

బ్యాచిలర్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ, 15వేల జీతగాడు పెళ్లాం పిల్లల్ని తీసుకుని గ్రామంలోకి లేదా, మున్సిపాల్టీ ఏరియాలోకి తరలిపోవాలంటే ఎంత కష్టం. జిల్లా స్థాయి ఉద్యోగాలు కావడంతో చాలామంది సిబ్బంది కష్టమైనా, నష్టమైనా.. ప్రతి రోజూ ప్రయాణాలు చేస్తున్నారు. సచివాలయ సిబ్బందిలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోయేవారే.

అందులోనూ ఎక్కడా ఎప్పుడూ సచివాలయ సిబ్బంది అందుబాటులో లేరు అన్న కంప్లయింట్స్ కూడా ఇప్పటి వరకూ రాలేదు. ప్రతి రోజు.. జిల్లా స్థాయి అధికారులు ఏదో ఒక చోట సచివాలయాలను తనిఖీ చేస్తుండటంతో.. అందరూ అలర్ట్ గానే ఉన్నారు. మరి ఇలాంటప్పుడు పనిచేసే చోటే నివాసం అనే నిబంధన అర్థవంతంగా ఉంటుందా లేదా అనేది ఉన్నతాధికారులు ఓసారి ఆలోచించుకోవాలి.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను నూరు శాతం చేరవేసేందుకు వీలుగా ఈ నిర్ణయం అంటూ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది అయినా, ఇంకే ఇతర పనులు చేసే ఉద్యోగులైనా.. ఆఫీస్ టైమింగ్స్ లో అందుబాటులో ఉంటే చాలు. అంతే కానీ 24 గంటలు స్థానికులకు అందుబాటులో ఉండాలంటే.. 15 వేల కోసం వారి జీవితాలను ప్రభుత్వానికి రాసివ్వలేరు కదా?

సాంకేతిక  పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో వర్చువల్ విధానంలోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి కదా? అలాంటప్పుడు సిబ్బంది కూడా డ్యూటీ టైమింగ్స్ మినహా మిగతా సమయాల్లో ఫోన్లో అందుబాటులో ఉంటే సరిపోతుంది కదా అంటున్నారు కొంతమంది.

మొత్తమ్మీద తాజాగా సచివాలయ సిబ్బంది స్థానిక నివాసంపై వెలువడిన నిబంధన సంచలనం రేకెత్తిస్తోంది. మరి ప్రభుత్వం దీనిపై పునరాలోచిస్తుందా, లేక కఠినంగా అమలు చేస్తుందా.. వేచి చూడాలి. 

రోజూ పొద్దున్నే బంగారం తింటున్నా