నిమ్మగడ్డ-ఈనాడు.. ఇది ప్రత్యేకమైన ‘కమ్మ’ని బంధం

తనకి ప్రాణ భయం ఉందని, అధికార పార్టీ తనని టార్గెట్ చేసిందంటూ.. గతంలో కేంద్ర హోంమంత్రి, హోం సెక్రటరీకి లేఖలు రాశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.  Advertisement ఆ లేఖలన్నీ టీడీపీ…

తనకి ప్రాణ భయం ఉందని, అధికార పార్టీ తనని టార్గెట్ చేసిందంటూ.. గతంలో కేంద్ర హోంమంత్రి, హోం సెక్రటరీకి లేఖలు రాశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. 

ఆ లేఖలన్నీ టీడీపీ కార్యాలయాల నుంచే వెళ్లాయని, వాటికి ప్రూఫ్ రీడింగ్ కూడా ఈనాడు సంస్థల్లో జరిగిందనే పుకార్లు ఉన్నాయి. ఆ సంగతి పక్కనపెడితే.. ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ హైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్ ముందు రోజే ఈనాడుకి లీక్ కావడం మరో విశేషం.

ఆయన అఫిడవిట్ సమర్పించే రోజే.. ఈనాడు పేపర్లో దాని సారాంశం వచ్చేసింది. అంటే.. ముందు రోజే ఆ సమాచారమంతా పత్రిక కార్యాలయానికి చేరిందనమాట. ఇక దీనికి కొనసాగింపుగా జరిగిన మరో సంఘటన ఈనాడు-నిమ్మగడ్డ మధ్య ఉన్న ''కమ్మ''ని సంబంధాన్ని బట్టబయలు చేస్తోంది.

స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని లేఖాస్త్రాలు సంధించుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించలేమంటూ, ఇతర రాష్ట్రాలతో మనకి పోలిక వద్దంటూ నీలం సాహ్ని రాసిన లేఖ అన్ని మీడియా సంస్థలకు ఒకే సమయంలో చేరింది. మరి దీనికి ప్రతిగా నిమ్మగడ్డ రాసిన లేఖ మాత్రం ఈనాడుకి ప్రత్యేకం.

“ఎన్నికల తేదీపై నిర్ణయాధికారం మాదే..” అనే శీర్షికతో ఈనాడులో వచ్చిన వార్త దీనికి నిదర్శనం. అక్కడికేదో రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఈసీకే పెత్తనం ఉన్నట్టు, ఆయన చెప్పినట్టే జరగాలని రాజ్యాంగంలో ఉన్నట్టు, కోర్టులు కూడా ఆయనకే మద్దతిచ్చినట్టు ఈనాడు రాసుకొచ్చింది.

ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న భ్రమల్లో ఉంటే తొలగించుకోవాలని ఆయన లేఖలో సూచించారట. ప్రభుత్వం తన స్వీయ, సంకుచిత ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాందోళనలు ప్రేరేపించడం అనైతికం అని ఎస్ఈసీ అభిప్రాయపడ్డారట. ఈ వివరాలన్నీ ఆయన లేఖలో ఉన్నట్టు ఈనాడు చెప్పుకొచ్చింది.

నిజంగానే ప్రభుత్వం భ్రమల్లో ఉంటే.. తన అధికారంతో నిమ్మగడ్డ ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను తనకు తానే ప్రారంభించొచ్చు కదా. ప్రభుత్వాన్ని కోరడం ఎందుకు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ కు తహతహలాడటం ఎందుకు. తన అధికార పరిధి తెలిసి కూడా ప్రభుత్వం పెత్తనం కోసం పరితపిస్తున్నారు నిమ్మగడ్డ. సందేహాలుంటే కోర్టుని అడగండి అని నిమ్మగడ్డ అంటున్నారంటే… అక్కడ సందేహం ఉంది ప్రభుత్వానికి కాదు, నిమ్మగడ్డకే.

కేంద్రం ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో ఎలాంటి కోతా లేదు కాబట్టి.. కరోనా పూర్తిగా తగ్గిపోయిన తర్వాతే నింపాదిగా ఎన్నికలు జరపాలనే విషయంలో వైసీపీ ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ మిస్ అయిన నిమ్మగడ్డే అవసరం ఉంటే మరోసారి కోర్టుని అడగాల్సిన అవసరం ఉంది. 

అది వదిలేసి.. ప్రభుత్వంపై, చీఫ్ సెక్రటరీపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. లేఖలు రాస్తూ, ఫిర్యాదులు చేస్తూ కాలం గడుపుతున్నారు నిమ్మగడ్డ. 

బిగ్ బాస్ ఓటింగ్ అంతా ఫేక్ అని తెలుసు