టీడీపీ దొంగ ఓట్ల డ్రామా.. రక్తికట్టించిన ఎల్లో మీడియా

“దొంగ ఓట్లు వేయడానికి 5వేల మంది వచ్చారు.. ఎవరి దగ్గరా ఐడీ కార్డుల్లేవ్, ఓటరు స్లిప్పుల్లేవ్. వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు.” ఓవైపు తిరుపతి లోక్ సభ సెగ్మెంట్ పరిథిలో పోలింగ్ జరుగుతుంటే, మరోవైపు టీడీపీ…

“దొంగ ఓట్లు వేయడానికి 5వేల మంది వచ్చారు.. ఎవరి దగ్గరా ఐడీ కార్డుల్లేవ్, ఓటరు స్లిప్పుల్లేవ్. వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు.” ఓవైపు తిరుపతి లోక్ సభ సెగ్మెంట్ పరిథిలో పోలింగ్ జరుగుతుంటే, మరోవైపు టీడీపీ నేతల విమర్శలు-ఆరోపణలు ఇలా సాగుతున్నాయి. ఇలాంటి ఆరోపణలు ఎప్పుడొస్తాయా, ఎప్పుడు వాటిని హెడ్ లైన్స్ గా మార్చేద్దామా అని ఎదురుచూస్తున్న ఎల్లో మీడియాకు ఆహారం దొరికేసింది. పొద్దున్నుంచి ఇవే వార్తలు.

ఓసారి లాజికల్ గా ఆలోచిద్దాం. తిరుపతిలో 5వేల మంది వ్యక్తులు బయట నుంచి వచ్చి ఓట్లు వేయడం సాధ్యమా? ఒక్క బస్సును ఆపేసి, 5వేల మంది దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని ఆరోపించడంలో లాజిక్ ఉందా? కల్యాణ మండపంలో ఉన్న వ్యక్తులను బెదరగొట్టి వాళ్లు దొంగ ఓటు వేయడానికి వచ్చారని ఆరోపించడంలో అర్థం ఏంటి?

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డొల్ల విమర్శలు, పసలేని వాదనలు కనిపిస్తాయి. కానీ ఇవేవీ ఎల్లో మీడియాకు అక్కర్లేదు. బాబు-లోకేష్ కు మైలేజీ వచ్చిందా లేదా అనేదే వాటికి కావాలి. ఇవన్నీ ఒకెత్తయితే.. అసలు టీడీపీ నేతలు చెబుతున్నట్టు దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వ్యక్తుల్ని ఎక్కడ పట్టుకున్నారు. 

ఏదైనా పోలింగ్ బూత్ వద్ద అలాంటి వ్యక్తుల్ని పట్టుకుంటే కనీసం వాదనకు నిలబడుతుంది. రోడ్డుపై బస్సులో వెళ్తున్న వ్యక్తుల్ని పట్టుకొని వాళ్లంతా దొంగ ఓట్లు వేయడానికే వచ్చారంటే ఏమనుకోవాలి? రోడ్లపై బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్లంతా దొంగ ఓట్లు వేయడానికే వస్తున్నట్టా? వాళ్లకు మిగతా పనులేం ఉండవా?

ఇలా పసలేని ఆరోపణలో రచ్చ చేసేందుకు చూస్తోంది టీడీపీ, ఎల్లో మీడియా. ఇదంతా దేని కోసమనే విషయం కాస్త లాజికల్ గా ఆలోచిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమౌతుంది. తిరుపతి సెగ్మెంట్ లో వైసీపీ గెలుపు ఖాయమనే విషయం అందరికీ తెలిసిందే. సో.. తమ ఓటమికి సాకులు వెదికే క్రమంలో టీడీపీ నేతలు తెరపైకి తీసుకొచ్చిన అంశమే ఈ దొంగ ఓట్ల కట్టుకథ.