విశాఖ జిల్లాకు మంత్రి యోగం లేనట్లేనా..?

మెగా సిటీ, స్మార్ట్ సిటీ పరిపాలనా రాజధానిగా ప్రచారంలోకి వచ్చిన విశాఖ జిల్లాకు ఈసారి మంత్రి యోగం లేదా. అంటే జరుగుతున్న పరిణామాలు. లెక్కలు అదే నిజం అంటున్నాయి. Advertisement ఇక విశాఖ కొత్త…

మెగా సిటీ, స్మార్ట్ సిటీ పరిపాలనా రాజధానిగా ప్రచారంలోకి వచ్చిన విశాఖ జిల్లాకు ఈసారి మంత్రి యోగం లేదా. అంటే జరుగుతున్న పరిణామాలు. లెక్కలు అదే నిజం అంటున్నాయి.

ఇక విశాఖ కొత్త జిల్లాగా కేవలం ఆరు శాసన సభ స్థానాలతో ఏర్పాటు అవుతోంది. ఇందులో రెండంటే రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయి. మిగిలిన నాలుగు టీడీపీ చేతిలో ఉన్నాయి. ఇక తొలి మంత్రి వర్గంలో భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మంత్రిగా పనిచేశారు.

విస్తరణలో విశాఖ నుంచి కొత్తగా ఎవరికీ చోటు దక్కకపోవచ్చు అన్న ప్రచారం సాగుతోంది. దానికి కారణం సామాజిక, రాజకీయ సమీకరణలే అంటున్నారు. అవంతిని తప్పిస్తే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి చాన్స్ ఇవ్వాలి. ఆయన రెడ్డి సామాజికవర్గం.

దాంతో ఆ కోటాలో చాన్స్ దక్కదు. ఇక మరో వైపు చూస్తే ఎమ్మెల్సీగా సిటీ ప్రెసిడెంట్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అయితే ఆ సామాజిక వర్గం కోటాను ఇతర జిల్లాల నుంచి సీనియర్ నేతలతో భర్తీ చేయబోతున్నారు. దాంతో పాటు వంశీ ఎమ్మెల్సీగా నెగ్గి కేవలం కొద్ది నెలలు మాత్రమే కావడంతో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కకపోవచ్చు అని అంటున్నారు.

మొత్తంగా చూసుకుంటే విశాఖకు ఈసారి మినిస్టర్ పోస్ట్ అన్నది లేదు అనే తెలియవస్తోంది. మరి ఏదైనా అద్భుతం జరిగితే మాత్రం వంశీని మంత్రిగా చూడవచ్చు. ఇదే ఇపుడు వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది.