విశాఖ రాజధానిని బాబు అడ్డుకోలేరు

విశాఖ రాజధానిని అడ్డుకోవడానికి చంద్రబాబు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. అయితే బాబు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా కూడా విశాఖను పాలనా రాజధానిగా అడ్డుకోలేరని విజయసాయిరెడ్డి పక్కా…

విశాఖ రాజధానిని అడ్డుకోవడానికి చంద్రబాబు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. అయితే బాబు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా కూడా విశాఖను పాలనా రాజధానిగా అడ్డుకోలేరని విజయసాయిరెడ్డి పక్కా క్లారిటీ ఇచ్చేశారు.

విశాఖలో వరస ప్రమాదాల వెనక ఏ కుట్రలు ఉన్నాయో కూడా వెలికి తీస్తామని ఆయన చెప్పారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బదీసే శక్తులను అసలు  ఉపేక్షించమని ఆయన అన్నారు.  

వరస ప్రమాదాలు ఏ కారణంగా జరుగుతున్నాయన్నది సమగ్రమైన దర్యాప్తు ద్వారానే బయటపడుతుందని  వైసీపీ ఎంపీ అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ మహానగరం ప్రతిష్ట కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు ఉంటాయని అన్నారు.

మొత్తానికి చూసుకుంటే విశాఖ రాజధాని ప్రకటన తరువాతనే అనేక ఘటనలు జరగడం పట్ల మేధావుల్లోనూ చర్చ సాగుతోంది. అదే సమయంలో విపక్ష టీడీపీకి ఇది ఆయుధం అవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా రాజధాని చుట్టూనే తిరుగుతూండడంతో విజయసాయిరెడ్డి వంటి వారు రాజధాని బాబుతో సహా ఎవరూ అడ్డుకోలేరని ప్రకటించారని అంటున్నారు. 

ఏది ఏమైనా ప్రమాదాలు కూడా కొందరికి రాజకీయ ఆయుధాలుగా మారడమే బాధాకరమని అన్న మాట వినిపిస్తోంది.

దిమ్మతిరిగే షో మొదలవుతుంది

సాక్షిలో బిత్తిరి సత్తి ప్రోమో