బాబును విశాఖలో అడుగుపెట్టనీయం…!

చంద్రబాబు అంటేనే విజనరీ, విజన్ 2020 స్రుష్టికర్త. నవ్యాంధ్ర సీఎంగా  ఆయన దూర ద్రుష్టి 2050 దాకా కూడా పాకింది. ఆయన అన్న గారి నుంచి అధికారం గుంజుకున్నపుడు  23 జిల్లాల ఉమ్మడి ఏపీకి…

చంద్రబాబు అంటేనే విజనరీ, విజన్ 2020 స్రుష్టికర్త. నవ్యాంధ్ర సీఎంగా  ఆయన దూర ద్రుష్టి 2050 దాకా కూడా పాకింది. ఆయన అన్న గారి నుంచి అధికారం గుంజుకున్నపుడు  23 జిల్లాల ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి. మరి విభజన ఏపీలో 13 జిల్లాల సీఎం. ఇక నిన్నటి ఎన్నికల్లో   అధికారం పోయాక   23 ఎమ్మెల్యేలతో మిగిలారు.

తాజా రగడ మూడు రాజధానుల పుణ్యమాని బాబు కేవలం అమరావతి ప్రాంతానికే పరిమితం అయ్యారు. ఇక బాబు ఉత్తరాంధ్రాపైన విషం చిమ్ముతున్నారు. ఆయన అనుకూల మీడియాలో విశాఖ అంటేనే  హుదూద్ అన్నంతగా దారుణమైన వార్తలు వండి వారుస్తున్నారు. రాజధాని పోయి పోయి అక్కడ పెట్టడమా అని బాబు గ్యాంగ్ ఎకసెక్కమాడుతోంది.

ఓ విధంగా విశాఖ సహా మూడు జిల్లా ప్రజలను అవమానపరుస్తోంది. మరి ఇంత చేసిన టీడీపీ మీద బాబు మీద జనానికి మంట ఉండదా. వారు ఎన్నుకున్న వైసీపీ ఎమ్మెల్యేలకూ కోపముండదా. అందుకే ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్న  చంద్రబాబును విశాఖలో అసలు అడుగుపెట్టనీయమని వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగానే తీర్మానించేశారు.

బాబు ఏ ముఖం పెట్టుకుని విశాఖ వస్తారని కూడా వారు నిలదీస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని పొగిడి ఇపుడు రాజధాని పెడతామంటే మాత్రం చిందులు తొక్కుతున్నారని, నిందలు వేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, కన్నబాబు రాజు ఫైర్ అయ్యారు.

బాబు పార్టీని ఏపీ అంతా తిప్పి కొడితే నాలుగు ఎమ్మెల్యే సీట్లు  ఇచ్చిన విశాఖ అంటే ఇదేనా చూపించే ప్రేమ అంటూ నిలదీస్తున్నారు. విశాఖ సిటీలో గెలిచిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని వారు చాలెంజ్ చేస్తున్నారు. మొత్తానికి బాబును విశాఖ రావద్దు అంటున్నారు. 23 జిల్లాలను ఏలిన ఒకనాటి ముఖ్యమంత్రికి ఇది ఎంత అవమానమో కదా.

ఆ సంఘటన ఇదే గ్రౌండ్స్ పక్కన జరిగిందని మీకు తెలుసా

మరో పెళ్లిచూపులు