ఈ నెల తొలివారంలో జాను సినిమాతో జనం ముందుకు వస్తున్నాడు హీరో శర్వానంద్. ఇది ఇలా వుండగానే మరో సినిమాకు కూడా డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. శ్రీకారం అనే సినిమాను ఏప్రియల్ 24న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అంటే జస్ట్ రెండు నెలల గ్యాప్ లో మరో సినిమా అన్నమాట.
వాస్తవానికి ఈ సినిమాను స్టార్ట్ చేసినపుడే సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. ఇది పక్కా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందువల్ల సంక్రాంతి మంచి టైమ్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సంక్రాంతి బోలెడు సినిమాలు పోటా పోటీగా వస్తున్నాయో, ఆ ఆలోచన పక్కన పెట్టి, షూటింగ్ చేసుకుంటూ వెళ్లారు.
పిబ్రవరిలో చేద్దాం అనుకుంటే జాను సినిమా వుంది. అందుకే మధ్యలో ఓ నెల గ్యాప్ ఇచ్చి, ప్రీ సమ్మర్ లో డేట్ ఫిక్స్ చేసుకున్నారు. రామ్ ఆచంట..గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు కిషోర్ అనే కొత్త దర్శకుడు పని చేసారు. గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయం అయిన ప్రియాంక హీరోయిన్ గా నటించింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.