అమరావతి రైతుల ఆందోళనలకు చంద్రబాబు మొహం చాటేశారు, చినబాబు ట్విట్టర్ లో కూడా ఆ ప్రస్తావన తేవడం లేదు, రాజకీయ శవయాత్రలకు వెళ్లి కూడా నాలుగైదు రోజులవుతోంది. అంతు చూస్తా, తాట తీస్తానంటూ రెచ్చిపోయిన కమలం బాబు.. హైదరాబ్ షూటింగ్ లో బిజీ బిజీ. ఈ ఉద్యమ ధీరులంతా మధ్యలోనే అస్త్ర సన్యాసం చేస్తే రైతులు ఏంకావాలి. జోలె పట్టి విరాళాలు సేకరించి పెద్ద సీన్ క్రియేట్ చేసిన బెగ్గింగ్ బాబు ఏమైపోయారో జనాలకు అర్థం కావడం లేదు. రెండు గాజులిచ్చేసి చేతులు దులుపుకున్నారా లేక, ఎమ్మెల్సీ పదవులు ఊడుతుండే సరికి పచ్చ ఎలుకలన్నీ కలుగుల్లోకి వెళ్లిపోయాయా. ఒకటైతే వాస్తవం టీడీపీ అమరావతి కాడె పడేసింది.
నకిలీ ఉద్యమానికి మద్దతిచ్చినప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీని ఛీకొట్టినట్టే.. ఇప్పుడు అమరావతి ప్రాంత జనం కూడా వారి నాటకాలను అర్థం చేసుకుంటున్నారు. టెంట్లు వేయించి, మధ్యాహ్న భోజనాలు పెట్టి.. తమని రోడ్లపైకి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయించిన బాబు.. ఇప్పుడు తన అసలు రంగు చూపించారని గొణుక్కుంటున్నారు.
అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల సమస్యలపై తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకుంటోంది. ఇప్పటికే రైతులకు కౌలు పెంచారు, అసైన్డ్ భూములు ఉన్నవారిని కూడా కౌలు పరిధిలోకి తెచ్చి వేలాదిమందికి భరోసా ఇచ్చారు. అసలు సిసలు రైతులెవరో వారికి లబ్ధి చేకూర్చేలా, నకిలీలు, కబ్జాకోరుల ఆట కట్టించేలా అటు ఈడీ రంగంలోకి దిగింది. ఈ పరిణామాలన్నీ చూసి అమరావతిపై జగన్ కి ఉన్న అభిమానాన్ని ఇన్నాళ్లూ శంకించామా అని చాలామంది ఆలోచనలో పడ్డారు.
వైసీపీ ఎంపీ స్వయంగా ఆందోళనకారుల దగ్గరకు వెళ్లి సముదాయించే సరికి వారిలో ఆలోచన మొదలైంది. ఆందోళనలకు స్వస్తి పలికేందుకు కొంతమంది సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ డబుల్ గేమ్ కి బలయ్యే కంటే.. అధికార పక్షాన్ని నమ్ముకోవడమే మంచిదని ఓ వర్గం భావిస్తోందట. అదే జరిగితే.. మూడు ప్రాంతాల ప్రజలు హ్యాపీ. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అసంతృప్తి లేకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్న ఘనత జగన్ కి దక్కుతుంది. అమరావతి ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటే అంతకంటే మంచి పరిణామం ఏముంటుంది.