చంద్రబాబు తాత దిగివచ్చినా… ఆగదట..!

చంద్రబాబే ఇపుడు తాత. రాజకీయాల్లో  నిండా అనుభవం గలిగిన సీనియర్ నేత. ఆయన తాతల గురించి కబుర్లు ఎందుకు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. మరి జగన్ తాత రాజారెడ్డి గురించి టీడీపీ తమ్ముళ్ళు…

చంద్రబాబే ఇపుడు తాత. రాజకీయాల్లో  నిండా అనుభవం గలిగిన సీనియర్ నేత. ఆయన తాతల గురించి కబుర్లు ఎందుకు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. మరి జగన్ తాత రాజారెడ్డి గురించి టీడీపీ తమ్ముళ్ళు వీలు దొరికితే చాలు  మాట్లాడుతూ ఉంటారు కదా. అందువల్ల ఇపుడు మరింత గట్టిగా సవాల్ చేయాలంటే బాబుని, ఆయన గారి  తాతని కూడా సీన్ లోకి  తేవాల్సిందేనా.

అందుకే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాధ్ చంద్రబాబు తాత గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. విశాఖే మన  రాజధాని, అందులో ఎవరికీ ఎటువంటి సందేహమూలేదు. ఈ విషయంలోతాత్కాలికంగా కాస్తా  ఆగిందంతే. అంతేతప్ప పూర్తిగా ఆగిపోయిన సంగతేమీ అందులో లేదని గుడివాడ  అంటున్నారు.

చంద్రబాబు కాదు కదా ఆయన తాత దిగి వచ్చి అడ్డుకున్నా కూడా విశాఖ రాజధాని అయి తీరుతుందని, ఇందులో రెండవ మాటకు అసలు వీలేలేదని  గుడివాడ సూటిగా, సుత్తి లేకుండా భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

చంద్రబాబు శాసనమండలిలో తనకున్న మందబలంలో ఏదో చేసానని అనుకుంటున్నాడని, అయితే ఆయన ఆటలు ఎక్కువ రోజులు సాగవని, అనుకున్న టైం కల్లా రాజధానిని తెచ్చి విశాఖలో జగన్ పెడతారని గుడివాడ కడు ధీమాగా చెప్పేశారు.

మొత్తానికి బాబుకు గుడివాడ స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారనుకోవాలి. ఇప్పటికే తాము అమరావతిని తరలిపోకుండా ఆపేశామంటూ మందడం గ్రామాల్లో పూలవానలతో తడిసి ముద్దవుతున్న బాబుకు, తమ్ముళ్ళకూ  ఇది గొప్ప రిటార్టే మరి.

అడియ‌న్స్ హిరోల‌కంటే సినిమా క‌ధ‌నే చూస్తారు..నాగ శౌర్య‌