పిల్ల‌ల్ని క‌నొద్ద‌ని అడ్డుకోలేం

పిల్ల‌ల్ని క‌నొద్ద‌ని తాము నియంత్రించ‌లేమ‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టులో కేంద్రం తాజాగా అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఒక‌వేళ అలా నియంత్రిస్తే ఏం జ‌రుగుతుందో కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.  Advertisement…

పిల్ల‌ల్ని క‌నొద్ద‌ని తాము నియంత్రించ‌లేమ‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టులో కేంద్రం తాజాగా అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఒక‌వేళ అలా నియంత్రిస్తే ఏం జ‌రుగుతుందో కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 

బీజేపీ నేత, న్యాయ‌వాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ప‌లు కీల‌క అంశాల‌పై వ్యాజ్యాలు వేయ‌డంలో దిట్ట అనే విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశంలో జ‌నాభా నియంత్ర‌ణకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అలాగే ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న‌ను తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాల‌ని అశ్వినీకుమార్ ఢిల్లీ హైకోర్టులో మొద‌ట పిటిష‌న్ వేశారు.

ఈ పిటిష‌న్‌లో ఆయ‌న పేర్కొన్న అంశాలు ఆస‌క్తికరంగా ఉన్నాయి. జ‌నాభా నియంత్ర‌ణ పెరుగుద‌ల‌తో కాలుష్యం, నిరుద్యోగం పెర‌గ‌డంతో పాటు క‌నీస అవ‌స‌రాలు ప్ర‌తి ఒక్క‌రికీ అంద‌డం లేద‌ని పేర్కొన్నారు. జ‌నాభా పెరుగుద‌ల అవినీతికి కార‌ణ‌మ‌వు తోంద‌ని ఆయ‌న ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. అయితే జ‌నాభా నియంత్ర‌ణపై చ‌ట్టాలు చేసేది చ‌ట్ట‌స‌భ‌లు మాత్ర‌మేన‌ని, కోర్టులు కాద‌ని న్యాయ‌స్థానం పేర్కొంటూ ఆ పిటిష‌న్‌ను కొట్టివేసింది.

ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ అశ్విని ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై  విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి అప్ప‌ట్లో నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల‌పై తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.  

ఈ అఫిడ‌విట్‌లో  దేశంలో కుటుంబ సంక్షేమ పథకం స్వచ్ఛందమ‌ని  పేర్కొంది. తమకు ఎంతమంది పిల్లలు కావాలో అది పూర్తిగా దంపతుల ఇష్టమేనని, కుటుంబనియంత్రణపై ఎలాంటి ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసింది.  

ఒకవేళ నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే పిల్లలు ఉండాలని  బలవంతపెడితే అది జనాభా వక్రీకరణకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.  ఇదే సంద‌ర్భంలో  భారత్‌లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోందని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.  

మ‌రో జోస్యం వ‌దిలిన స‌బ్బం