మహేష్ సినిమాలో విలన్ గా తయారైన బాబు

మహేష్ బాబు సినిమా స్పైడర్ లో విలన్ గా దర్శకుడు ఎస్.జె.సూర్య కనిపించాడు. సూర్య క్యారెక్టరైజేషన్ ని చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేశారు దర్శకుడు మురుగదాస్. పక్కవాళ్లు బాధగా ఏడుస్తుంటే.. విలన్ పడే…

మహేష్ బాబు సినిమా స్పైడర్ లో విలన్ గా దర్శకుడు ఎస్.జె.సూర్య కనిపించాడు. సూర్య క్యారెక్టరైజేషన్ ని చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేశారు దర్శకుడు మురుగదాస్. పక్కవాళ్లు బాధగా ఏడుస్తుంటే.. విలన్ పడే సంతోషం, దాని వెనక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఒకరకమైన శాడిజాన్ని చూపెడతాయి. మిగతా అన్నిరకాల శాడిజాలకు అది పరాకాష్ట అన్నమాట. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే.. సూర్య క్యారెక్టర్ ని యాజ్ ఇటీజ్ గా రియల్ లైఫ్ లో దించేసినట్టున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక్క మంచి కూడా ఆయన కంటికి ఆనడం లేదు. కష్టాలు, కన్నీళ్లు, ఏడుపులు, అక్రమాలు.. ఇవేవీ రాష్ట్రంలో లేకపోయినా వాటిని ఊహించుకుంటూ కాలం గడుపుతున్నారు బాబు. కరోనా విలయతాండవం విషయంలో చంద్రబాబు శాడిజం పరాకాష్టకు చేరుకుంది.

ఇన్నాళ్లూ ఏపీలో కరోనా నిర్థారణ పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయి, అందుకే కేసుల సంఖ్య తక్కువగా ఉందని ఏడ్చారు చంద్రబాబు. ఇప్పుడు కేసుల సంఖ్య గురించి మాట్లాడ్డం మానేశారు. బాబు తాజా ఏడుపు దేనిగురించి అంటే.. యాక్టివ్ కేసుల్లో ఏపీ టాప్-5 లో ఉందట. రికవరీ కేసుల్లో చివరి నుంచి రెండో స్థానంలో ఉందట.

ఇన్నాళ్లూ మొత్తం కేసుల గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు యాక్టివ్ కేసుల గురించి మాట్లాడటం విడ్డూరం. కొత్త కేసులు తక్కువగా ఉంటే, రికవరీ కేసులు ఎందుకు పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి.

ఏ రాష్ట్రంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో.. ఆ రాష్ట్రంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్టు లెక్క. అలా చూసుకుంటే.. మరణాల సంఖ్యలో మనకంటే 11 రాష్ట్రాలు ముందున్నాయి. జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలను పక్కనపెడితే మరణాల సంఖ్యలో ఏపీ చివరి ఐదు రాష్ట్రాల్లో ఉంది. ఈ మంచి చంద్రబాబుకి కనపడలేదు.

కరోనా కేసులు మొదలైన తొలినాళ్లలో హైదరాబాద్ పారిపోయిన తండ్రీ కొడుకులు కేవలం టీడీపీ మహానాడు కోసమే తిరిగి రాష్ట్రంలో అడుగు పెట్టారు. ఎక్కడా ఏ ఒక్కరినీ పలకరించిన పాపాన పోలేదు, ఎలాంటి సహాయమూ నేరుగా చేయలేదు. అలాంటి చంద్రబాబుకి ఏపీలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై మాట్లాడే అర్హత ఉందా. అసలు అర్హతే లేని చంద్రబాబు.. ఇప్పుడు మరీ ఎక్కువగా నోరు చేసుకుంటున్నారు. తనకి ఘోర పరాభవాన్ని రుచిచూపించిన ప్రజలు నాశనమైపోవాలని కోరుకుంటున్నారు.

నేను డీసెంట్.. రవితేజ పెద్ద క్రాక్