మీరెక్క‌డున్నా…ఆ ప్ర‌క్రియ‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌!

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో తీసుకొచ్చిన భూసంస్క‌ర‌ణ‌లపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. దేశంలో ఎక్క‌డున్నా… భూముల రిజిస్ట్రేష‌న్‌కు మార్గం సుగుమం చేస్తూ ఆధునిక టెక్నాల‌జీకి కేంద్ర ప్ర‌భుత్వం అగ్ర‌స్థానం క‌ల్పించింది. దీంతో…

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో తీసుకొచ్చిన భూసంస్క‌ర‌ణ‌లపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. దేశంలో ఎక్క‌డున్నా… భూముల రిజిస్ట్రేష‌న్‌కు మార్గం సుగుమం చేస్తూ ఆధునిక టెక్నాల‌జీకి కేంద్ర ప్ర‌భుత్వం అగ్ర‌స్థానం క‌ల్పించింది. దీంతో భూమి ఉన్న ప‌రిధిలోనే స‌ద‌రు వ్య‌క్తి ఉండాల‌నే నిబంధ‌న‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేష‌న్‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. దీని వ‌ల్ల ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌లు త‌గ్గుతాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి ఇవాళ పార్ల‌మెంట్‌లో 2022 బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. ఇందులో భాగంగా ఒకే దేశం – ఒకే రిజిస్ట్రేష‌న్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.  'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్‌వేర్‌ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (NGDRS)తో దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చ‌ని ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు.  

దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు నూతన ఆధునిక వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఈ విష‌య‌మై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్ – వన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చామ‌న్నారు. 

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా తీసు కొచ్చిన భూసంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల సుదూరంలో ఉన్న వాళ్లు త‌మ వ్యాపార లావాదేవీల‌ను ఉన్న‌చోటు నుంచే నిర్వ‌హించుకునే సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టైంది.