నా పేరు: పవన్ కల్యాణ్
దరఖాస్తు చేయు ఉద్యోగం: అనుమానం లేదు. సీఎమ్మే. (అలాగని ‘ఏక్ దిన్ కా సుల్తాన్ అనుకునేరు. కాదు. అయదేళ్ళకీ ఒక్క రోజు కూడా తక్కువ కాకూడదు.) మరి ఎమ్మెల్యే కావటం సంగతో..? అంటారేమో. సీఎం అయ్యాక ఆరునెలల్లో అవ్వక పోతామాఏమి?
వయసు: ఉంది కాబట్టే, పార్టీ పెట్టి పదేళ్ళు వెయిట్ చేశాను. వెయిటింగ్ రికార్డుల్లో మనల్ని ఎవరూ కొట్టలేరు.
ముద్దు పేర్లు: ‘గోదావరి’ కల్యాణ్ ( కర్ణాటకలో కుమారస్వామి పాత మైసూరును నమ్ముకున్నట్లు నేనిప్పుడు ఉభయగోదావరులను నమ్ముకున్నాను.)
విద్యార్హతలు: ఏం చదివావూ అని అడక్కూడదు. ఎంత చదివావూ అనడగాలి. (చుట్టూ వందల పుస్తకాలు పెట్టుకున్న నా ఫోటో వైరల్ అవుతోంది చూడలేదా?)
విలాసం: ఎత్తయిన ‘వారాహి’ వాహనం మీద…అభిమానులకు అందనంత ఎత్తులో.. వోటర్లకు అందుతాను లెండి!
గుర్తింపు చిహ్నాలు: ఒకటి: నిత్య రాజకీయ విద్యార్థిని. పాఠాలు నేర్చుకుంటూనే వుంటాను. ఒక్కొ ఎన్నిక ఒక్కో పాఠం నేర్పుతుంది.
రెండు: సిధ్ధాంతాలే నాకు కాస్ట్యూమ్స్. అందుకే అంతవేగంగా మారుస్తాను. మొన్న ఎరుపు, నిన్న నీలం, నేడు కాషాయం.
వృత్తి: ఏం వృత్తులు అనొచ్చుగా. నాకు రెండువున్నాయి. ఒకటి: నటన, మరొకటి: రాజకీయం. ఒకటి జమ, మరొకటి ఖర్చు. బ్యాలెన్స్ అయిపోతోంది.
అనుభవం: ఆరడుగుల బులెట్ గానే అందరూ చూశారు. బులెట్ ఏ తుపాకిలో పెట్టినా పేలుతుంది. అందుకే ఇతర పార్టీనేతలు నావల్ల గెలిచారు. అందుకే ఇకనయినా బులెట్ గా కాకుండా గన్ లావుండాలనుకుంటున్నాను. అయితే ఆపేరుతో ఒక నేత వున్నాడు కాబట్టి తెలుగులోనే అంటాను. తుపాకీ నవుతాను అని.
మిత్రులు: ఉన్నారు. పొత్తంటారో, అవగాహనంటారో చూడాలి.
జీవిత ధ్యేయం: సినిమా హిట్టయినా ఫ్లాపయినా ‘వపర్’ స్టార్‌నే.. రాజకీయాల్లో కూడా అదే ఫేమ్ తెచ్చుకోవాలని
సర్