బ్రాహ్మణ సంఘాల సపోర్ట్ కావాలా? ఛీ

నిజమైన బ్రాహ్మణజాతి ఎప్పుడో ఈ వేణుని మానసికంగా తమవాడిగా గుర్తించడం మానేసింది.

వేణుస్వామి అని తనకు తాను స్వీయనామాన్ని ప్రకటించుకున్న పరాంకుశం వేణు, అతని సతీమణి శ్రీవాణి ఒక వీడియో వదిలారు. అందులో ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న ఆడియో కూడా వినిపించి టీవీ5 కి చెందిన జర్నలిస్టులు తమని ఐదు కోట్లు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఆరోపించారు.

ఇదే వీడియోలో తమకి ఆత్మహత్యే శరణ్యమని చెప్పుకొచ్చారు. వేణు అయితే తాను 15 కేజీల బరువు తగ్గిపోయానని బాధగా చెప్పుకున్నాడు. చివరిగా శ్రీవాణి “మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారో, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయో, చదువుకున్నవారు సపోర్ట్ చేస్తారో, పోలీసులు-లాయర్లు సపోర్ట్ చేస్తారో మీ ఇష్టం. మాకు ఎవరైనా అండగా నిబడతారని ఆసిస్తున్నాం” అని అన్నది.

అసలు బ్రాహ్మణ సంఘాలు ఎందుకు సపోర్ట్ చేస్తాయని ఆశిస్తున్నారు ఈ దంపతులు. నిజమైన బ్రాహ్మణజాతి ఎప్పుడో ఈ వేణుని మానసికంగా తమవాడిగా గుర్తించడం మానేసింది. అతని అలోచనలు, మాటలు, పనులు అన్నీ అబ్రాహ్మణీకాలే.

జ్యోతిష్యులుగా, పూజారులుగా, పురోహితులుగా, అర్చకులుగా, ప్రవచనకారులుగా జీవనాన్ని సాగించే బ్రాహ్మణుల నుంచి హైందవ సమాజం ఆశించేవి కొన్ని ఉంటాయి. వారు మద్యానికి, మాంసానికి దూరంగా ఉండాలని సమాజంలో ఉన్న అన్ని కులాల వారు కోరుకుంటారు. అలాగే డాంబికాలకి పోకుండా సదాచారాన్ని నమ్ముతూ వస్తృధారణలో సనాతన సంస్కృతిని ప్రతిబింబింపజేస్తూ ఉండాలని ఆశిస్తారు. ఎందుకంటే ఆస్తికత్వంలో ఉన్న హైందవులు ఆ వృత్తుల వారి నుంచి ప్రాధమికంగా కోరుకునేది అదే. ముందు ఇవన్నీ పాటించాక ఆ తర్వాత శాస్త్రజ్ఞానం, వాక్శుద్ధి చూస్తారు. అవి ఉన్నాయని హైందవ సమాజానికి అనిపిస్తే మరింత గౌరవిస్తారు.

అన్ని కులాలవాళ్లు అన్ని వృతుల్లో ఉన్నట్టే నేడు బ్రాహ్మణులనబడే వారు కూడా అన్ని వృత్తుల్లోనూ ఉంటున్నారు. వేరే వృతుల్లో ఉంటూ అబ్రాహ్మణమైన ఆహారనియమాలు, వస్త్రధారణ ఉన్నా సమాజం పెద్దగా పట్టించుకోదు కానీ పైన చెప్పబడిన వృత్తుల్లో ఉన్నవారు మాత్రం బ్రాహ్మణధర్మాలు కచ్చితంగా పాటించాలనే అందరూ కోరుకుంటారు.

కానీ ఈ వేణు అవేమీ పాటించడు. పైగా మాంసం తింటానని, మందు తాగుతానని, తనకి పబ్బులున్నాయని టీవీల్లోనే చెప్పాడు. ఆ మాటల్లో, మాట్లాడే విధానంలో కూడా అస్సలు బ్రాహ్మణత్వమే కనపడదు. అతను చేసే వృత్తికి, మాటకి పొంతన ఉండదు.

ఇన్ని లోపాలున్నా శాస్త్రజ్ఞానంలో ఏమైనా అఘోరించాడా అంటే అతను చెప్పే జాతకాలు, చేసే వివరణలు శాస్త్రం తెలిసిన ఇతర బ్రాహ్మణులకి చిరాకు పెట్టిస్తాయి. అసలితనికి ఏమీ తెలియదన్న విషయం బంగారయ్య శర్మగారు కొన్ని రోజుల క్రితమే టీవీ5 మూర్తి ఇంటర్వ్యూలో వివరించి మరీ చెప్పారు. వేణు ఎన్ని తప్పులు చేస్తున్నాడో, ఎలాంటి పాపాలు చేస్తున్నాడో వివరించారాయన.

చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక ప్రవచనంలో తీవ్రదేవతారాధన పేరుతో మద్యమాంసాల నైవేద్యాల వంటివి దేవతలకి ఎలాంటి ఆగ్రహాన్ని, బాధని తెప్పిస్తాయో కూడా చెప్పారు.

బ్రాహ్మణ సంఘాల సపోర్ట్ కావాలి అని ఒక బ్రాహ్మణ జంట అడిగినంత మాత్రాన పరుగెట్టుకుని వచ్చేయవు. అసలు ఆ బ్రాహ్మణుడు చేసే వృత్తి ఏమిటి, చేసిన పనేంటి అనేది ప్రాధమికంగా అంచనా వేసుకుని తప్ప ముందుకి రావు.

కనుక వేణు దంపతులకి బ్రాహ్మణసంఘాలు ఎటువంటి సపోర్ట్ ఇవ్వవు. ఎందుకంటే ఇవ్వకూడదు కాబట్టి. ఇస్తే అతని పాపం మొత్తం జాతికే తగులుతుంది కాబట్టి.

ఇక జర్నలిస్టులు సపోర్ట్ చేస్తారా అని మరొక ఆశాభావాన్ని వ్యక్తం చేసారు శ్రావణి. అది కూడా అయ్యే పని కాదు. ఎందుకంటే ఆవిడ రెండు రోజుల క్రితం తాను కూడా గతంలో జర్నలిస్టునే అని చెప్పుకుని మరీ జర్నలిస్టులకి, మీడియాకి సుదీర్ఘమైన క్లాస్ పీకిందామె. ఆ క్లాస్ ఏమిటో, ఎందుకో క్లియర్ గా అర్ధం కాలేదు. బహుశా సెలబ్రిటీల జీవితాలు బయటపెట్టడం మీడియా చేత మానిపించాక తన భర్త జోలికి రమ్మని చెప్పడం ఆమె ఉద్దేశ్యమేమో. జర్నలిస్టులకి క్లాసులు పీకాక ఇక వాళ్లెందుకొస్తారు సపోర్ట్ కి? అదే వీడియోలో తనకి ఎల్వీ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ కావాలంటూ నాగచైతన్యని అడిగింది. ఏమిటో? ఆమె మాటల్లో, ఎమోషన్లో కన్సిస్టెన్సీ లేదు.

సరే..ఇక పోలీసులు, లాయర్లు సపోర్ట్ అట! పోలీసుల సపోర్ట్ అంటే రక్షణ కల్పించడం వరకు చేస్తారు. కంప్లైంట్ సరిగా ఇస్తే తమని బ్లాక్ మెయిల్ చేసిందెవరో పట్టుకొస్తారు. వాళ్లకి అది చిన్న విషయం.

ఇక లాయర్లంటారా..వాళ్లని ఆశ్రయించి ఫీజు చెల్లిస్తే తమ తరపున వాదించే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప పోలీసులు, లాయర్లు వీరి వెనుక తామున్నాం అని మూకుమ్మడిగా ఎందుకొస్తారు? అంతా అయోమయం జగన్నాధం జంటలాగున్నారు వీళ్లు.

వేణు ఇప్పుడు కాదు..చాలా ఏళ్ల క్రితమే టీవీ5 మూర్తి షోలో బాబుగోగినేని చేత గాలి తీయించబడ్డాడు. అదే షోలో అతను “నా పేరు వేణుస్వామి. నేను జ్యోతిష్యం పేరుతో చెప్పేవన్నీ తప్పులు..జరగవు. నమ్మే వాళ్లు నమ్మండి. నమ్మని వాళ్లు నమ్మకండి” అని చేతులెత్తి దండం పెట్టి మరీ పారిపోయాడు.

అయినా ఇలాంటివాడిన ఇన్నేళ్లుగా నమ్ముతున్న జనమున్నారు. అది వాళ్ల ఖర్మ.

ఏవో తీవ్రపూజలు చేస్తే ఏదో అయిపోతామనుకోవడం మూర్ఖత్వం. నిజమైన ఆస్తికులు ఇలవేల్పుని, కులవేల్పుని, తల్లిదండ్రుల్ని దైవాలుగా నమ్ముకుంటే చాలు. అంతకు మించి ఏ గ్రహం దగ్గరకి, ఏ అనుగ్రహం కోసం వెళ్లనక్కర్లేదు. ఒకవేళ వెళ్లాలని మనసు లాగినా వేణు వంటి వారి దగ్గరకి అస్సలు వెళ్లకూడదన్న ఇంగితం ప్రజలకు రావాలి.

ఎందుకంటే అతనికి శాస్త్రం తెలీదని అతనే ఒప్పుకున్నాడు కనుక;

అతని మాటలు, యోనిపూజలు, మద్యమాంసాల నైవేద్యాలు చూసి హైందవసమాజంలోని అధికసంఖ్యాకులు ఛీకొడుతున్నారు కనుక.

ఆ మధ్యన నరేంద్రమోదీని అస్సాం ముఖ్యమంత్రి కలిసిన ఫోటోనొకదానికి మార్ఫింగ్ చేసి ముఖ్యమంత్రి ప్లేసులో తనను పెట్టుకుని పేపర్లో యాడ్ వేయించుకున్న ఫేక్ బాబా ఈ వేణు. అలాంటి నేపథ్యమున్న వ్యక్తి ఒక ఫేక్ ఆడియోని తయారు చేసి తమ రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తున్నాడని టీవీ5 జర్నలిష్టులు కేసేస్తే అది మరింత బలపడుతుంది.

ఇక్కడ కోరుకునేది ఒక్కటే. ఆత్మహత్య సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే అదే జరిగితే కుహనా జ్యోతిష్యుడిగా, బ్రాహ్మణత్వాన్ని మంటకలిపిన వ్యక్తిగా, ఫేక్ బాబాగానే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది.

అలా కాకుండా వామాచారాన్ని వదిలి, సదాచర పద్ధతిలోకి వచ్చి, నచ్చిన శాస్త్రాన్ని శ్రద్ధగా నేర్చుకుని, సద్బ్రాహ్మణుడిగా జీవనం సాగిస్తే ఇదే సమాజం మళ్లీ గౌరవిస్తుంది. అలా మారడం కష్టమనుకుంటే ఈ వృత్తిని వదిలేసి ఏ రియల్ ఎస్టేటో, పబ్ బిజినెస్సో చేసుకుంటానన్నా స్వాగతిస్తుంది లోకం.

మార్పుకి కులసమాజమే కాదు, యావత్ సమాజం ఎప్పుడూ ఒప్పుకుంటుంది.

దర్భశయనం శ్రీరామకృష్ణ

51 Replies to “బ్రాహ్మణ సంఘాల సపోర్ట్ కావాలా? ఛీ”

  1. ఇదే ప్రధమం అనుకుంటా ఒక అంశం మీద ఇంత సాధికారంగా, పద్దతిగా ఎవరిమీదా బురద జల్లకుండా, పాజిటివ్ కోణంలో సలహాలిస్తూ ఒక వ్యాసం ఈ దిక్కుమాలిన సైట్ లో రావడం.

    సంతోషం.

    1. అంటే పదోతరగతి కోవిడ్ లాకౌట్ టైం లో పాస్ అయి జర్నలిస్టు అని రాసేవాడికి, నిజంగా జర్నలిజం చదువుకొని పద్ధతిగా వ్రాసేవాళ్ళకి తేడా ఉంటుంది కదండీ!!

  2. I request you to do enough research before writing any article. First of all he is not a brahmin and its a inter caste marriage (Venu is from Satani caste and SriVani is from Brahmin caste). In that context, why any brahmin unions will support them? I highly doubt.

  3. ఆ అమ్మాయి కి మంచి సంస్కారం ఉంది.. కానీ నాలుగు రోజులు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్న చందాన.. ఆమె కూడా పాపం బ్రష్టు పట్టింది…

  4. ఇప్పుడు షో బిజినెస్ చేసే అఘోరలకి బాగా డిమాండ్ వుంది. మీడియా వాళ్ళు కూడా వాళ్ళని బాగా పాపులర్ చేస్తున్నారు

    వేణు చేసే పనులు కూడా అలానే వుంటయ్యి కాబట్టి, వేణు అఘోర గా మారి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే సరి. మంచి ఆదాయం.

    (అసలు సిసలు నియమబద్ద అఘోరా లు సమాజంలో కి బహిరంగంగా రారు. డబ్బు కోసం పనులు చేయరు. )

  5. Yenno kulalu vuntai vari vrttulu varu chesukuntaru. Doctor annaka evidido okadidi pranalu potai, engineer annaka dam construction lo lopalu bayata padatai. Jathakalu cheppatam lo kuda oka sari porapatu jaraga vachhu. Polavaeam lo jarigina tappidamu gurinchi cheppa kunda venu swamy gurinchi debate lu pettatam blackmail kinda vastundi. Vellaku anthe leda

  6. అడ్డమైన పనులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది

  7. వాళ్లు మద్దతుగ వస్తారా రారా అనేది వాళ్ల జాతకము చూసుకొనీ వాళ్లే చెప్పాలి

  8. ఇన్నాళ్లు జగన్ పార్టీ కి సపోర్ట్ చేసినందుకు అయిన వేణు కి గ్రేట్ ఆంధ్ర ఫ్యాన్ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి కదా. .

    మీరు కూడా హ్యాండ్ ఇచ్చారా !

    1. ఒంగోలు ఎలెక్షన్ ఇష్యూ బయటికి వస్తుంది అని ఇది అంత చేస్తున్నారు

        1. జోక్ ఏమి వుంది బ్రదర్ 12 VVPATLU కౌంట్ చెయ్యమంటే ఎలక్షన్ కమిషన్ చెయ్యట్లేదు అంటే న్యూస్ కాదు అంటారా అది కూడా కాండిడేట్ అమౌంట్ పే చేస్తున్నాడు

  9. ఇద్దరూ వెధవలే.. అయితే ఒకడు పనిలేని పనికిమాలిన వెధవ.. మరొకడు పరమ ప్రమాదకరమైన వెధవ…

  10. దర్భశయనం శ్రీ రామకృష్ణ గారు నమస్తే.

    మీరు ఎంతో ఓపికతో ఆ వేణుగాణ లోలుడి గురించి చాలా చక్కహా రాశారు…ఓకే. హ్యాపీసు..

    అతనొక పనికిరాని………….(ఎడిట్) అని మీకు పరిపూర్ణంగా తెలిసినప్పుడు….ఆ……..(ఎడిట్) గురించి రాసి,అతనికి గుర్తిపుతెచ్చారు..ఇది అవసరమా…

    ‘పేల పిండి గాలికి రామార్పణం’ అన్న సామెత చందాన మీరు ఆ మాంస భక్షక వేణువుని చేత్తో పట్టుకుని, తుడిచి, మీ నోట్లో పెట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఊదడం… *శాంతాకారం భుజగ శయనం*.. లా ..*దర్భాశయనం* అని ఇంటిపేరునే పవిత్రమైన దర్భాలుగా పెట్టుకున్న మీరు ఇలాటి రోడ్డుసైడ్ వేణువుల గురించి పట్టించుకొని కులానికి ఎంగిలి అంటించుకోడం మీకు అవసరమా..? సర్.

    అసలు..మీ చెవిలో ఒక విషయం చెప్తున్నా…*శిఖలేని బ్రాహ్మణుడు ఎటువంటి శాస్త్రవిషయాల్లో శిఖరాగ్రం* చేరగలరా…? గంగాజాలంతో శుద్ధి కావలిసిన వేణువు…నెత్తుటి నీటిలో కులుకుతున్నది అని తెలిసిన తర్వాత ….బ్రహ్మ జ్ఞానం ఉన్న సమాజాలు..జాలి,కనికరం చూపించవు..శ్రీ రామకృష్ణ గారూ..మీలోని అక్షర సరస్వతికి అంటూ తగిలే ఇలాటి ఎంగిలి వేణువుని టెస్ట్ కోసమని కూడా ఊదకండి. అలాచేస్తే..మీరు గంగలో మునిగినా మీలోని సరస్వతి శుద్దికాదు.

    ఈ విషయాన్ని మీరు రాహు కాలంలో చూడకండి. లగ్నంలో కుజుడు ఉన్నపుడు అసలే చదవకండి. అక్షర సంక్రమణం పూట చదివితే.. మీకు మీ కీ బోర్డ్ కి విడాకులు తధ్యం.

  11. వామాచారం చేసి, మళ్ళి సాత్విక ఉపాసన చేయాలంటే అంత సులువు కాదు.. ప్రాయశ్చిత్తం చేసుకొవాలి..

    వామాచారం లో ఫెయిల్ అయిన వాళ్ళంతా రోగం తోనో, లేక యాక్సిడెంట్ లోనో, లేక చంపబడడమో జరిగింది

    1. వామాచార పద్దతిలో వశపరుచుకోడం సులభం.. అయితే.. ఆ శక్తి ని సంతృప్తి పరచడం కష్టం.. ఆఖరికి ఆత్మశమర్పణం చేసుకోవలసి వస్తుంది…

  12. జగన కిన్సపోర్ట్ చేస్తూ ఇతను చాలా పోరాటం చేశాడు గతం లో.

    కాబట్టి, ఇప్పుడు ఇతను కష్టాల్లో ఉన్నప్పుడు , జగన్ కి సపోర్టు గా నిరాహార దీక్ష చేయాలి, ఢిల్లీ లో.

    అలాగే అతనికి సాక్షీ లో నెలకి పాతిక లక్షలు సాలరీ తో ఉద్యోగం ఇవ్వాలి.

    1. అప్పుడే , తనని నమ్మిన వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు, జగన్ కాపాడతాడు ఆన్న మంచి పేరు వస్తుంది.

  13. జ్యోతిషం అంటే బాలు మున్నంగి గారి లాగ నిజాయితీ గా వుండాలి.

    విద్యను మంచి పనుల కోసం ఉపయోగించాలి.

  14. ఇతనేం బ్రాహ్మణుడు. మద్యం మాంసము తినేవాడు.‌ అసలు “ఇతనికి” భవిష్యత్తులో తనకు ఏమి జరుగుతుందో చెప్పమనండి చూద్దాం . అసలు 5 కోట్లు అడగడానికి, ఇతను ఏమి ఘోరమైన నేరం చేశాడు అనేది ముందు బయట పెట్టాలి.

  15. Venu swamy anta tappu yemi cheya ledu. Atanini over project chesindi one section of media to keep their cadres in heat. Right now they are exposing their grudge as he is belongs weaker section/ lonely person.

  16. వీళ్ళ సొంత జాతకాలు వీళ్లకు తెలియదుగానీ, ఊళ్ళో వాళ్ళ జాతకాలు మాత్రం అడగకుండానే చెప్పేస్తారు

  17. బ్రాహ్మణత్వం చాల మంది బ్రాహ్మణుల్లో ఈరోజుల్లో మృగ్యమైపోయింది. ఎంతమంది బ్రహ్మ మూహూర్తం లో లేచి సంధ్య వందనాలు చేసి, వేదాలు పఠిస్తున్నారు. సామాన్య ప్రజల దగ్గరే ఈ బ్రాహ్మణత్వం బ్రతికి బట్టకడుతుంది. వేణుస్వామి లాంటి దొంగ స్వాము లు ఈ రోజుల్లో వీధికొక్కరు పుట్టుకొస్తున్నారు. ప్రజలు అప్రమత్తం గా ఉండాలి, ఈ మూర్తి హై హ్యాండెడ్నెస్ వీడియోస్ నేను చూడలేదు కానీ, ఎవరో ఒకరు వీళ్ళ కుయుక్తులను బయటపెట్టకపోతే వీళ్ళ ఆగడాలు ఆగవు. బ్రాహ్మణ కులం లో పుట్టిన వాళ్ళు తమని తాము సంస్కరించుకోవలసిన సమయం వచ్చింది. హిందూ మతం మీద ఇతర కులాల వారికీ మంచి అవగాహనా, పట్టు ఇంటర్నెట్ పుణ్యమా అని వచ్చింది. ఈ మార్పు ని వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకోవాలి ధర్మాన్ని, తర్కాన్ని, మీమాంస ని తెలియపరచి హిందువుల మన్ననలు పొందాలి.

  18. బ్రాహ్మణత్వం చాల మంది బ్రాహ్మణుల్లో ఈరోజుల్లో మృగ్యమైపోయింది. ఎంతమంది బ్రహ్మ మూహూర్తం లో లేచి సంధ్య వందనాలు చేసి, వేదాలు పఠిస్తున్నారు. సామాన్య ప్రజల దగ్గరే ఈ బ్రాహ్మణత్వం బ్రతికి బట్టకడుతుంది. వేణుస్వామి లాంటి దొ0గ స్వాము లు ఈ రోజుల్లో వీధి/కొ/క్క/రు పుట్టుకొస్తున్నారు. ప్రజలు అప్రమత్తం గా ఉండాలి, ఈ మూర్తి హై హ్యాండెడ్నెస్ వీడియోస్ నేను చూడలేదు కానీ, ఎవరో ఒకరు వీళ్ళ కుయుక్తులను బయటపె/ట్ట/క/పో/తే వీళ్ళ ఆగడాలు ఆగవు. బ్రాహ్మణ కులం లో పుట్టిన వాళ్ళు తమని తాము సంస్కరించుకోవలసిన సమయం వచ్చింది. హిందూ మతం మీద ఇతర కులాల వారికీ మంచి అవగాహనా, పట్టు ఇంటర్నెట్ పుణ్యమా అని వచ్చింది. ఈ మార్పు ని వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకోవాలి ధర్మాన్ని, తర్కాన్ని, మీమాంస ని తెలియపరచి హిందువుల మన్ననలు పొందాలి.

    1. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు

      చాలా మంది ఈ రోజుల్లో కోడిగుడ్డు, చికెన్, మటన్ , మద్యం, దూమపనం లకి అలవాటు పడ్డారు.

      ఇప్పుడు మిగతా సామాజిక వర్గాల వారే , రాజు, కాపు, కమ్మ, రెడ్డి, వైశ్యా, రజక, కుమ్మరి, కమ్మరి, విశ్వ బ్రాహ్మణ, మాల, మాదిగ, ఎరుకల, కోయ కుటుంబాల్లో వారు చక్కగా శాఖాహారం వైపు మారి, అగ్నిహోత్రం, సంధ్యా వందనం లాంటి వి నేర్చుకుని పాటిస్తున్నారు.

  19. జ్యోతిష్యం ఒక శాస్తం..దీనికి కులం లేదు..అలాగే ఈ స్వామికి కూడా కులం లేదు..ఆయనకు మతం (వైష్ణవ )మాత్రమే వుంది..వైష్ణవులు,బ్రాహ్మణ వర్గాలు వేర్వేరు..అయితే ఈ స్వామి చాలా తెలివిగా బ్రాహ్మణ అమ్మాయిని బురిడీ కొట్టించి పెళ్ళి చేసుకున్నాడు.ఫలితం ఆ సోదరి తల్లి దండ్రుల నిరసనకు గురై వారికి దూరమయ్యింది. (ఇందులో పొరపాటు వుంటే..ఎవరినైనా నొప్పిస్తే…సవరణకు సిద్ధం )

  20. చాలా బాగుంది. ఈ బ్రోకర్ ఛానెల్ లో మొదటిసారి ఒక విషయం గురించి చక్కగా మాట్లాడిన సందర్భం

  21. ఇలాంటి వెధవ లకి మళ్లీ సపోర్ట్ ఒకటా? ఇన్నాళ్లూ ఏ సంఘాన్ని అడిగి అందరి జాతకాల చెప్పేవు. వాళ్ళు ఎదురు తిరిగితే నీకు సంఘాలు అవసరమయ్యాయ? బార్ లలో ను పబ్బు లలో ను తిని సాగినప్పుడు ఏ సంఘాలు గుర్తుకు రలేదా? నీ నోటి దూతకు ఏ సంఘం నీకు తోడు రాదు. నువ్వే ఏదో ఒకటి చేసికొని చావు దరిద్రుడా.

  22. Why these socalled journalists and media hoises with party-affiliations and caste-affiliations conduct days-together and years-togethers on the issues which are of no use to the society. If such media and journalists are honest and genuine and unbiased, then they have every right and responsibility to question persons like venusway. While the concerned persons are not taking venuswamy’s comments seriously and just leaving.them.. what is the pain and problem for this media fellows to repeatedly show such episodes. Instead, they should highlight public grievances and work for public interest.

Comments are closed.