ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 06

జగన్ వీరాభిమానులు కూడా సమర్థించలేని పాలసీ వైసిపి ప్రభుత్వం అవలంబించిన సారాయి పాలసీ.

జగన్ వీరాభిమానులు కూడా సమర్థించలేని పాలసీ వైసిపి ప్రభుత్వం అవలంబించిన సారాయి పాలసీ. పాదయాత్ర టైములో 2017లో జగన్ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తానని మాట యిచ్చాడు. బాబు మద్యాన్ని ఆదాయ వనరుగానే చూస్తున్నాడని, కుటుంబ సంక్షేమం గురించి పట్టించుకోలేదని అన్నాడు. 2019 మానిఫెస్టో తయారీ వచ్చేసరికి దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తాం అన్నాడు. ఈ దశలవారీ… అనేది అరిగిపోయిన మాట. ఋణమాఫీలు, సంక్షేమపథకాలు లాటి వాటిల్లో దశల వారీగా పెట్టడమో, తీసివేయడమో చూస్తాం. అలాగే మద్యనిషేధం విషయంలో కూడా ఊరికి నాలుగు షాపులకే అనుమతి యివ్వడం, వారంలో కొన్ని రోజులే అమ్మడం, అమ్మకం వేళలు తగ్గించడం, ఫలానా వయసు మించిన వాళ్లకే అమ్ముతాననడం, డ్రైవింగు లైసెన్సులా, డ్రింకింగు లైసెన్సుకి అప్లయి చేయమనడం… యిలాటివి ఎన్నయినా చేయవచ్చు. కానీ ఎవరూ చేయరు. ఊరికే పైపై కబుర్లు చెప్తారు.

ప్రజల్లో మద్యపానం వలన కలిగే దుష్ఫలితాలపై అవగాహన తెచ్చి, వారిని ఒప్పించి, సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తాం అని ఏ నేత చెప్పినా అది బోగస్. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీయార్‌ను గద్దె దించిన ఉదంతం గుర్తున్న నాయకుడెవరూ ఆ జోలికి పోరు. సంపూర్ణ మద్యనిషేధం హామీపై 1994 ఎన్నికలలో గెలిచి, గెలిచాక దాన్ని చిత్తశుద్ధిగా అమలు చేసి, మద్యం లాబీ ఆగ్రహాన్ని మూట కట్టుకున్నాడు ఎన్టీయార్. అందుకే ఆ లాబీ చంద్రబాబును వెనక నిలిచి, ఎమ్మెల్యేల ఫిరాయింపుకు దోహదపడింది. ప్రతిఫలంగా బాబు అధికారం చేజిక్కించుకుంటూనే మద్యనిషేధం ఎత్తివేశారు. మద్యవ్యాపారి నడిపిన ‘‘ఉదయం’’ దినపత్రిక తనకు పోటీ రావడంతో మద్యనిషేధం ఉద్యమం ఉధృతంగా నడిపిన ‘‘ఈనాడు’’ చంద్రబాబు దాన్ని ఎత్తివేస్తే కిమ్మనలేదు. ఇప్పటికీ బాబు ‘తమ్ముళ్లారా, మిమ్మల్ని యింకా తాగిస్తాను.’ అని నినాదమివ్వడానికి కారణం మద్యం లాబీ మద్దతే!

మద్యం లాబీ అంత బలీయంగా ఉన్న విషయం తెలిసినా, జగన్ అధికారంలోకి వచ్చి సారాయి వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ పెద్ద రిస్కే తీసుకున్నాడు. ప్రభుత్వ నిర్వహణలో ఉండడం మంచిదే. ఎందుకంటే ప్రయివేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నపుడు అమ్మకాలు పెంచడమే లక్ష్యంగా పని చేస్తారు. అర్ధరాత్రి దాటినా షాపు మూయరు, బెల్టు షాపులు పెట్టి అమ్ముతారు, షాపు బయట కుర్చీలు వేసి అక్కడే తాగవచ్చంటారు. ప్రభుత్వోద్యోగులైతే యిలాటి ప్రయత్నాలేమీ చేయరు. ఎందుకొచ్చిన పనిరా యిది అనుకుంటూ చేస్తారు. ఇక్కడితో ఆగకుండా జగన్ కొన్ని బ్రాండ్లను మాత్రమే అమ్మాలన్నాడు. ఇదెందుకో ఎప్పుడూ వివరించలేదు. డబ్బిచ్చి కొనుక్కునే కస్టమర్‌కు ఛాయిస్ యివ్వకపోవడం అన్యాయం! వరద బాధితులకై ట్రక్కుల్లో తెచ్చిన అన్నం పొట్లమా యిది, పులిహారే పెడతాను, తింటే తిను, లేకపోతే మానేయ్ అనడానికి. మామూలు కంటె ఎక్కువ రేటు పెట్టి కొనేవాడికి తనకు కావలసిన బ్రాండ్ లేకుండా చేయడంలో లాజిక్ లేదు.

ఇలా ఎందుకు చేశాడు? టిడిపి ఆర్థిక మూలాలు దెబ్బ తీయడానికి అని కొందరన్నారు. పాత సారాయి కాంట్రాక్టర్లందరికీ టిడిపితో లింకులున్నాయి. వాళ్లకి వ్యాపారం లేకుండా చేస్తే, టిడిపికి వెళ్లే మామూళ్లు ఆగిపోతాయని ప్లాను అన్నారు. మద్యం వ్యాపారులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకి కమిషన్ యిస్తూండడం అనాదిగా సాగుతున్న వ్యవహారం. అధికార పక్షానికీ, ప్రతిపక్షానికీ యిద్దరికీ కమిషన్లు యిచ్చేటంత ఔదార్యం వాళ్లకుంటుందనుకో లేము. మహా అయితే వాళ్లకు టిడిపితో స్నేహబంధం ఉండవచ్చు, సానుభూతి ఉండవచ్చు. అధికార పార్టీకి ముట్టవలసినది ముడుతూన్నపుడు వ్యాపారి మనోభావాలతో పనేముంది? ఎవరికీ తెలియని కొత్త బ్రాండ్‌లు అమ్ముతున్నారు అనే ఆరోపణ వచ్చినపుడు జగన్ ‘మేము కొత్తగా ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతి యివ్వలేదు, అన్నీ బాబు యిచ్చినవే’ అని చెప్తూ వచ్చాడు. అలాటప్పుడు ఆ కంపెనీలకు కూడా టిడిపితో లింకు ఉన్నట్లేగా! మరి వాళ్లనెందుకు ఆపలేదు?

పైగా దేశవ్యాప్తంగా పేరు మోసిన బ్రాండ్లను రాష్ట్రంలోకి రానీయకుండా చేయడమేమిటి? లోకల్ బ్రాండ్లయితే ఫలానా వాళ్లవి అని ముద్ర కొట్టవచ్చు. కానీ నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లను మార్కెట్లోంచి నిషేధించడమేమిటి? వాటిపై ఎంఆర్‌పి ఇంత అని ప్రింటు చేసి ఉంటుంది కాబట్టి దాని కంటె ఎక్కువకి ఎందుకు అమ్ముతున్నారని అడుగుతారనా? ఎందుకంటే లోకల్ బ్రాండ్లను విపరీతమైన రేట్లు పెట్టి అమ్మేశారు. చివరకు ఎలా తయారైందంటే రేషన్ షాపు వాడు ‘ఈసారి యిదే వచ్చింది, తీసుకుంటే తీసుకో’ అన్నట్లయింది. రేషన్ షాపులో చౌకగా దొరుకుతాయి. ఇక్కడేమో విపరీతమైన రేట్లు! రేటు ఎక్కువగా పెట్టడం గొప్ప స్ట్రాటజీగా జగన్ ఫీలయ్యాడు. ‘మద్యం అమ్మకాలు తగ్గాయి, కానీ ప్రభుత్వానికి ఆదాయం ఎప్పటిలాగే వస్తోంది. ప్రభుత్వానికి నష్టం కలగకుండా ప్రజారోగ్యం కాపాడాను చూడండి’ అని నేషనల్ మీడియాకు గొప్పగా చెప్పుకున్నాడు.

పాలకులు ధరలు పెంచాలనుకున్నపుడు అధికారుల చేత ఎక్కువగా ధర పెట్టించేసి, ప్రజల్లో గగ్గోలు పుట్టగానే వాటిని కాస్త తగ్గించి, ప్రజల కష్టాలకు స్పందించాడు అనే క్రెడిట్ కొట్టేస్తూంటారు. జగన్‌కు ఆ పాటి లౌక్యం కూడా లేకుండా నేనే పెంచాను అని గొప్పగా చెప్పుకున్నాడు. జగన్ హయాంలో మద్యపానం కచ్చితంగా తగ్గింది. ధరలు భరించలేక, అందుబాటులో ఉన్న బ్రాండ్లు నచ్చక, వారానికి ఐదు రోజులు తాగేవాడు రెండు రోజులతో సరిపెట్టుకున్నాడు. ఈ మధ్య ఆ ధోరణి తగ్గింది కానీ, ధూమపానం అలవాటు విపరీతంగా ఉండే రోజుల్లో కేంద్ర బజెట్‌లో ఏడాది ఏడాదికి సిగరెట్లపై సుంకం పెంచుతూనే ఉండేవారు. బజెట్ ప్రసంగం వినగానే ‘రేపణ్నుంచి సిగరెట్లు మానేస్తున్నాను.’ అంటూండేవారు ధూమకేతువులు. ఆ తర్వాత కొన్నాళ్లకు అడిగితే ‘సాంతం మానేయలేదు కానీ రోజుకి ఒక పెట్టెకి మించటం లేదు’ అనేవారు. వ్యసనాలకు హెచ్చు ధరల ఫిలాసఫీ లోకంలో ఎక్కడైనా ఉన్నదే కానీ ఫలానా బ్రాండే లభ్యం చేస్తామనడం యీనాటి మార్కెట్ ఎకానమీలో పొసగని విషయం.

తక్కిన బ్రాండ్లను ఎందుకు అనుమతించటం లేదు అనేదానిపై ప్రభుత్వాధినేతగా ప్రజలకు కానీ, పార్టీ అధ్యక్షుడిగా క్యాడర్‌కు కానీ జగన్ ఏనాడూ వివరణ యివ్వలేదు. దాంతో ప్రజలడిగే ప్రశ్నలకు పార్టీ నాయకులు తెల్లమొహం వేసేవారు. పైగా దొరికే బ్రాండ్లకు పెట్టిన పేర్లను చూస్తే తాగేవారిని వెక్కిరించినట్లున్నాయి. రెగ్యులర్ మార్కెట్‌లో అలాటి పేర్లు పెడితే ఏ ప్రొడక్టూ అమ్ముడుపోదు. ఇక్కడైతే చచ్చినట్లు కొంటారు కదాని ఆ పేర్లు వాడారు. వీటన్నిటి వలన ఆంధ్రలో మద్యవ్యాపారం అనేది ఒక పెద్ద యిస్యూ అయిపోయింది. దీన్ని అలుసుగా తీసుకుని టిడిపి జగన్ సర్కారు అమ్మే బ్రాండ్లు రుచీపచీ లేనివనీ, నాణ్యత లేనివనీ, విషపూరితమనీ, తెగ ప్రచారం చేసింది. రుచి అనేది వ్యక్తిగతమైనది. దాని గురించి తక్కినవారు వ్యాఖ్యానించ లేరు. నాణ్యత లేదని అనేసినవారు క్వాలిటీ కంట్రోలు సంస్థకు ఫిర్యాదు చేశారా? రాష్ట్ర సంస్థ అయితే తప్పుడు సర్టిఫికెట్టు యిస్తుందనుకుంటే, కేంద్ర సంస్థలైన సిడిఎస్‌సిఓ వంటి సంస్థకు శాంపుల్స్ పంపించి, వాళ్లు నాసిగా ఉందని చెప్తే దాన్ని చూపించి యాగీ చేయవచ్చుగా! అలాగే విషపూరితమైనది అంటే డిసిజిఐకు ఫిర్యాదు చేయవచ్చుగా! అది తాగి ఎవరైనా మరణిస్తే పెద్ద ఉద్యమం లేవదీయవచ్చుగా! ఏదీ చేయలేదు.

అంతెందుకు, కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటింది. ఆ బ్రాండ్లను ఆపేశారా? లైసెన్సు పరిమితి యింకా ఉంది కాబట్టి కొనసాగిస్తున్నాం అంటే క్వాలిటీ కంట్రోలు యిన్‌స్పెక్టర్లను పంపించి, తనిఖీ చేయించి, ఫ్యాక్టరీలు మూసేయించ వచ్చుగా! ఎందుకు చేయలేదు? అంటే తాము గతంలో చెప్పినవి అబద్ధాలని ఒప్పుకున్నట్లేగా! ఇతర బ్రాండ్లను మార్కెట్‌ లోకి అనుమతించారు తప్ప వీటిని నిషేధించలేదు. ఇప్పుడు బాబు అందర్నీ వారమంతా తాగండి అని ప్రోత్సహించే మోడ్‌లో ఉన్నారు. అలాటప్పుడు విషపూరితమైన బూమ్‌బూమ్‌లను తాగనిస్తే ప్రజలు ఢామ్‌ఢామ్‌ అంటూ చచ్చిపోరూ? వీళ్లు విషపూరితమని ఆరోపణ చేసినప్పుడు వైసిపి ప్రభుత్వం ‘ఇదిగో క్వాలిటీ గురించి, ఫలానా కేంద్ర సంస్థ యిచ్చిన సర్టిఫికెట్టు’ అని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టి ఉంటే సరైన సమాధానం యిచ్చినట్లు ఉండేది. కానీ ‘జనం బాబు మాటలు నమ్మరు’ అనే గుడ్డి నమ్మకంతో జగన్ అచేతనంగా ఉన్నాడు.

ఇక సారాపై ఆదాయం గురించి – దీని క్యాష్‌లోనే ఎందుకు పెట్టారు? అన్నదానికి జగన్ ప్రభుత్వం ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. కొత్తిమీర కట్ట అమ్మే అమ్మి కూడా క్యూఆర్ కోడ్ అట్ట చూపిస్తున్న యీ రోజుల్లో వైన్ షాపుల్లో కేవలం క్యాషేనా అనే సందేహం నన్ను పీడిస్తూ వచ్చింది. కొందరు మిత్రులకు ఫోన్ చేసి అడిగితే తలొకరూ తలొకలా చెప్పారు. వైసిపి నాయకులు కానీ, ‘‘సాక్షి’’ పత్రిక కానీ దీనిపై ఏదైనా వివరణ యిచ్చి ఉంటే అది నేను చూడలేదు, వినలేదు. ఇలా తీసుకున్న క్యాష్‌తోనే ఒకటవ తారీకున పెన్షన్లు నగదు రూపంలో యిస్తున్నారండీ అన్నారు కొందరు. అంటే 2వ తారీకున వసూలైన మొత్తమంతా 29 రోజుల పాటు ఓ గోనెసంచెలో పోసి పెట్టుకుని కూర్చుంటారా? క్యాష్ క్రంచ్ యింతలా ఉన్న ప్రభుత్వంలో!? బ్యాంకులో వేసి వడ్డీ ఖర్చు తగ్గించుకోరూ?

అయినా వ్యక్తుల మధ్య లావాదేవీల్లో పన్ను తప్పించుకోవడానికి కొంత వాటాగా క్యాష్‌లో మేనేజ్ చేయవచ్చు. కానీ అనేక వేలమంది పని చేసే ప్రభుత్వోద్యోగుల్లో ప్రభుత్వ ఖాతాల్లోకి రాకుండా మొత్తమంతా క్యాష్‌ లోనే అమ్మకాలు, కొనుగోళ్లు జరగడం సాధ్యమా? ప్రతీ ట్రాన్సాక్షన్‌కు కాంట్రా ఎక్కడో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడున్న మెకానిజమ్‌తో జిఎస్టీ ఎగ్గొట్టినా పట్టుకో గలుగుతున్నారు కదా. ప్రభుత్వం చూపించే ఆదాయం కంటె ఎక్కువ వస్తే దాన్ని ఎలా దాచగలరు? నాకంతా అయోమయంగా ఉంది. ప్రతిపక్షాలు దీనిలో అవినీతి జరిగిందని చెప్తున్న అంకెలు మారిపోతూ వస్తున్నాయి. చివరకు ఎంతకు తేలుతుందో తెలియదు. దాన్ని వెల్లడించే ముందు మోడస్ ఒపరాండి కూడా చెప్తే నా బోటి వాళ్లకు కాస్తయినా అర్థమౌతుంది. టిడిపి ప్రభుత్వం వచ్చాక డిజిటల్ పేమెంట్స్ పెట్టి ఉంటారు. లోకల్ బ్రాండ్స్‌పై వస్తున్న ఆదాయాన్ని పాత ఆదాయంతో పోల్చి చూస్తే అనుమానానికి ఎంత ఆస్కారం ఉందో తెలుస్తుంది.

ఇక ఇసుక దోపిడీ గురించి – టిడిపి హయాంలోనూ విన్నాను. వైసిపి ప్రభుత్వం వస్తూనే ఆ విధానాన్ని ఆపేసి, కొత్త విధానాన్ని రూపొందించడానికి కొంత సమయం తీసుకుంది. దాంతో భవన నిర్మాణ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. కొత్త విధానం తెచ్చేదాకా యథాతథ స్థితి కొనసాగిస్తే వచ్చి పడే ముప్పేమిటి? టిడిపి హయాంలో పెట్టారు కనుక వెంటనే ఆపేయాలి అనుకుంటూ ఆపేశారు కానీ దానివలన రియల్ ఎస్టేటు రంగం దెబ్బ తింటుంది అని ఆలోచించలేదు. వైసిపి దిగగానే టిడిపి మళ్లీ ఫ్రీ యిసుక అంటూ వైసిపి పోగు పెట్టి ఉంచిన ఇసుక నంతా ఊడ్చి పారేసింది. ఇప్పుడు మళ్లీ వైసిపి పెట్టిన యాప్ విధానాన్నే తిరిగి తెస్తున్నారంటున్నారు. ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో వైసిపి ఎమ్మెల్యేలు యిసుక దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వాటికి ఏ మేరకు ఆధారాలున్నాయో టిడిపి పెట్టబోయే కేసుల బట్టి, పడబోయే శిక్షల బట్టి తెలుస్తుంది. ఇప్పుడు టిడిపి ప్రజాప్రతినిథులు ఏం చేయబోతారో వేచి చూడాలి.

180 డిగ్రీల మార్పులు గతంలో యింత ఘోరంగా ఉండేవి కాదు, వైసిపి, టిడిపి పాలనలు వచ్చిన దగ్గర్నుంచి పాతవి తిరగతోడడంతోనే సరిపోతోంది. పేర్లు పెట్టడాలూ, పేర్లు మార్చడాలూ ఖరీదైన కసరత్తుగా మారింది. ఇందిరా గాంధీ ఉండేటప్పుడు సంస్థలకు గాంధీ, నెహ్రూల పేరు ఎక్కువగా పెట్టినా తక్కిన జాతీయ నాయకులవీ బాగానే పెట్టింది కానీ తన పేరు పెట్టుకోలేదు. రాజీవ్ వచ్చాక ఇందిర పేర సంస్థలు పెట్టాడు కానీ తన పేర పెట్టుకోలేదు. రాష్ట్రంలో ఎన్టీయార్ అన్నిటికి తెలుగు, తెలుగు అని పెట్టాడు తప్ప తన పేరు పెట్టుకోలేదు. కాంగ్రెసు వాళ్లు వచ్చాక అన్నిటికీ రాజీవ్ పేరే. చంద్రబాబు వచ్చాక మొదట్లో కాంగ్రెసు వాళ్ల పేర్లే పెట్టి, తర్వాత ఎన్టీయార్ పేరు మొదలుపెట్టాడు. వైయస్ వచ్చి మళ్లీ రాజీవ్ అన్నాడు. ముఖ్యమంత్రులు తమ పేర్లు పెట్టుకోలేదు. జీవించి ఉన్న తమ నాయకురాలు సోనియా పేరూ పెట్టలేదు. కిరణ్ కుమార్ మాత్రం ఓ పథకానికి తన పేరు కలిసి వచ్చేట్లు ఉద్యోగకిరణాలు అని కాబోలు పెట్టాడు.

సాధారణంగా తాము అధికారంలో ఉండగా తమ పేర్లు, విగ్రహాలు పెట్టుకోరు. కానీ కరుణానిధి చెన్నయ్‌లో తన పేర కలైజ్ఞర్ కరుణానిధి నగర్ అని కట్టించాడు. ఎమ్జీయార్ అధికారంలోకి వస్తూ దాన్ని సింపుల్‌గా కెకె నగర్ అని పిలవసాగాడు. కరుణానిధి అధికారంలో ఉండగానే డికె నాయకుడు వీరమణి మౌంట్ రోడ్డులో అతని విగ్రహం పెట్టాడు. అతి త్వరలోనే కరుణానిధి పదవీభ్రష్టుడయ్యాడు. చాలా ఏళ్ల తర్వాత ఎమ్జీయార్ మరణానంతరం జరిగిన అల్లర్లలో ఎవరో ఆ విగ్రహాన్ని పగలగొట్టాడు. తర్వాత వచ్చిన ఎన్నికలలో కరుణానిధి నెగ్గాడు. విగ్రహంతో కలిగిన అరిష్టం, ధ్వంసంతో పోయిందను కున్నాడేమో కరుణానిధి మళ్లీ పెట్టించే ప్రయత్నం చేయలేదు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రలో బాబు, తెలంగాణలో కెసియార్ తమ పేర పథకాలు పెట్టనారంభించారు. చంద్రన్న కానుక, కెసియార్ కిట్లు.. అంటూ. ఇక జగన్ వచ్చాక పిచ్చి పీక్స్‌కి వెళ్లిపోయింది. అన్నీ జగనన్న, వైయస్‌ఆర్ పేర్లే. ఎన్టీయార్ వైద్యసంస్థను వైయస్ పేర మార్చి జగన్ సాధించినదేమిటో తెలియదు. ఆంబేడ్కర్ విద్యా దీవెన పేరు వైయస్ పేర మార్చడం దేనికి? వైయస్ పేర అన్ని పెట్టారు కదా, ఒకటి రెండు మిగతావాళ్లకు వదిలేస్తే నష్టమేమైనా ఉందా? ఓట్లేమైనా తక్కువ పడతాయా? మోస్ట్ ఇన్సెన్సిటివ్ చర్యలివి. ఇప్పుడు వీటన్నిటినీ మార్చే పనిలో పడ్డారు బాబు. ఒక సంస్థ పేరు మారిందంటే దాని తాలూకు బోర్డులు, స్టేషనరీ. బహుశా బిల్డింగు రంగులు కూడా మార్చే పని ఎంత ఖర్చుతో కూడుకున్నది? ఆసుపత్రిలో డయాలసిస్ మెషిన్ కొనాలంటే నిధులు లేవంటారు. పేరు, రంగులు మార్చడానికి లక్షలు ఖర్చు పెడతారు.

తెలంగాణలో చూడండి, తెరాస మంత్రుల ముందుమాటతో పాఠ్య పుస్తకాలు అచ్చయ్యాయని కోపగించి వాటిని స్కూళ్ల నుంచి మళ్లీ వెనక్కి రప్పించేశారు. జగన్ పాలనలో ప్రతీ దానికీ నీలం రంగు, కోర్టు అదేశాలతో గోకేసి మళ్లీ యింకో రంగు. ఎంత ప్రజాధనం వ్యర్థం! ఆ రంగులేవీ అధికారాన్ని నిలపవనే యింగితం ఉండాలి కదా. ఇప్పుడు బాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకి రామోజీ పేరు పెట్టవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీయార్ అంటే పదవిలోకి వచ్చి ప్రజాసేవ చేసినవాడు. రామోజీ అలా ఏమీ చేయలేదు కదా! ప్రభుత్వం తరఫున ప్రెస్ క్లబ్ బిల్డింగు కట్టి దానికి ఆయన పేరు పెడితే సరేలే అనుకోవచ్చు. ఏకంగా ఎయిర్‌పోర్టుకా? మరో ప్రభుత్వం వస్తే మార్చవచ్చు. అవసరమైన వాటికి డబ్బుల కోసం తడుముకుంటూ ఎందుకొచ్చిన పనులివి?

జగన్‌కు జీవిత లక్ష్యమేమిటంటే, 30 ఏళ్లు పాలించాలనీ, తను పోయిన తర్వాత కూడా ప్రజల యిళ్లల్లో తన ఫోటో ఉండాలని! అతనే స్వయంగా చెప్పుకున్నాడు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పటికే 20 ఏళ్లు నిరాఘంటంగా పాలించిన జ్యోతి బసు రికార్డు బద్దలు కొట్టాలను కుంటున్నానని చెప్పేవారు. కానీ 9 ఏళ్లకే దిగాల్సి వచ్చింది. అది చూసి కూడా జగన్ 30 ఏళ్ల టార్గెట్ పెట్టుకున్నాడు. ఫోటోల సంగతి చెప్తే ‘గోడల మీద ఫోటోలు ఔటాఫ్ ఫేషన్. అమ్మానాన్నల ఫోటోలే పెట్టుకోవటం లేదు, మీవేం పెట్టుకుంటారు?’ అని ఎవరో చెప్పి ఉంటారు. దాంతో వీళ్ల రోగం కుదర్చాలని ఎక్కడ పడితే అక్కడ తన ఫోటోలు గుప్పించాడు. ఈ రోజుల్లో అందరూ చేసే పనే యిది. కానీ జగన్ ఒక మైలు ఎక్‌స్ట్రా వెళ్లి మైలురాళ్ల మీద కూడా వేయించాడు. చివరకు అదే కొంప ముంచింది. లాండ్ టైట్లింగ్ యాక్ట్‌ మీద జగన్ బొమ్మ చూపించి, బాబు ఓటర్లను భయభ్రాంతులను చేయగలిగాడు. గడియ వేషానికి గడ్డం, మీసం గీయించినట్లయింది జగన్‌కు.

‘మేం చేసిన మంచి పనులను చెప్పుకోలేక పోయాం, మాపై ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టలేక పోయాం.’ – ఓడిపోయిన ప్రతి పార్టీ వల్లించే డైలాగు యిది. వైసిపి నాయకులు కూడా యిప్పుడు యిదే వల్లిస్తున్నారు. పదవిలో ఉండగా ఎందుకు చెప్పుకోలేక పోయారు? ఎందుకు తిప్పి కొట్టలేక పోయారు? సింపుల్ సమాధానం! జగన్ అహంకారం! మనం యిచ్చే పథకాల గురించి చెప్తే చాలు, ప్రతిపక్షాల, మీడియా విమర్శలు పట్టించుకో నక్కరలేదు. 50శాతం ఓటు బ్యాంకు మనతో ఉంది కాబట్టి ఎవరికీ సమాధానం చెప్పుకోనక్కరలేదు, మన పార్టీ వారితో సహా ఎవరికీ వివరణ యివ్వవలసిన పని లేదు అనుకున్నాడు. ఫ్రెంచ్ చక్రవర్తులైన బర్బన్స్ గురించి ఒక కొటేషన్ ఉంది – దే లెర్న్‌డ్ నథింగ్ అండ్ ఫర్‌గాటెన్ నథింగ్ అని. నేర్చుకోకపోతే గుర్తుంచు కోవడానికి ఏముంటుంది? అనే ప్రశ్న వస్తుంది కదా! ఇక్కడ చమత్కారం ఏమిటంటే ఫ్రెంచ్ విప్లవం తర్వాత కూడా తమ తప్పుల నుంచి వారు నేర్చుకోలేదని. మర్చిపోనిదేమిటంటే, తాము ఒకప్పుడు చక్రవర్తులమని!

జగన్‌కు అన్వయించాలంటే ‘అతను వినలేదు- చెప్పలేదు’. వినకపోవడం గురించి చాలామందే పలు విధాలుగా చెప్పారు. ఆ సలహాదార్లు ఏం చేస్తున్నారో కానీ…. అంటూ వ్యాఖ్యానించేవారు. జగన్ యిన్ని పథకాలు పెట్టాడంటే అన్నీ అతని తలలోంచే పుట్టాయని అనుకోవడానికి లేదు. సలహాదార్లు కొందరైనా తమ పని చేశారు, చెప్పారు. వాటిల్లోంచి అతను తనకు కావలసినవి ఏరుకున్నాడు. ఇక తక్కినవారు చెప్పినది పెడచెవిన పెట్టాడు, అసలు చెప్పనివ్వలేదు అంటే సబబుగా ఉంటుంది. ఎమ్మెల్యేలను కానీ, ప్రజాప్రతినిథులను కానీ, విమర్శకులను కానీ కలవలేదని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మరీ చెప్తున్నారు. అస్సలు కలవకపోవడం అనేది అతిశయోక్తి అనుకున్నా, కలిసినప్పుడు అప్రియమైనది మాట్లాడితే మళ్లీ కలవనిచ్చేవాడు కాదేమో! ఇచ్చకాలు చెప్పేవాళ్లకు మాత్రమే దర్శనభాగ్యం కలిగివుంటుంది.

ముఖ్యమంత్రులు ఇంటి దగ్గర ప్రజా దర్బారు అని పెట్టుకుంటారు. కనీసం వారానికి ఒకసారైనా అందర్నీ కలిసి అర్జీలు తీసుకుంటారు. ఇవన్నీ ఒక ప్రహసనమే. వచ్చే అర్జీల్లో 90శాతం వ్యక్తిగతమైనవే ఉంటాయి. వాటి గురించి సిఎం చేసేదేమీ ఉండదు. అయినా ముఖ్యమంత్రిని కలిశామన్న తృప్తి వాళ్లకు, మా నియోజకవర్గ ప్రజలను దగ్గరుండి తీసుకుని వచ్చి కలిపించానన్న తృప్తి ఎమ్మెల్యేకు ఉంటుంది. అవి జగన్ ఎత్తేశాడు. ఏం అంటే ‘నా దగ్గరకు వాళ్లు రానక్కర లేకుండానే పనులు జరిగిపోయే గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ పెట్టాను కదా. అది గొప్పా? కలవడం గొప్పా?’ అన్నాడు. వ్యవస్థ ఏర్పరడం మంచిదే. కానీ అవెలా పని చేస్తున్నాయో ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవాలి కదా! బ్యాంకులో క్లర్కు చేసినదాన్ని ఆఫీసరు, అతను చేసినదాన్ని పై ఆఫీసరు, వాళ్లు చేసినదాన్ని ఆడిటరు.. యిలా అంచెలంచెలుగా పర్యవేక్షణ సాగుతుంది. రకరకాల మార్గాల్లో ప్రజాస్పందన తెలుసుకుంటేనే పాలనలో లోపాలు తెలుస్తాయి.

ప్రజా దర్బారు లేదు సరే, ఎమ్మెల్యేలతో కలుస్తూంటేనే కదా, పథకాల వలన జరిగే మంచీచెడూ, వాటి కౌంటర్ ఎఫెక్టులు, ప్రత్యామ్నాయాలు, వారి ఫిర్యాదులూ.. యివన్నీ తెలిసేవి. వాళ్లు వస్తే ఏదో ఒకటి అడుగుతారు. మనం చేయలేము. రానీయక పోవడమే మంచిది అనుకుంటే ఎలా? సిఎం అన్నవాడు ఒక కంపెనీ సిఇఓలా ప్రవర్తిస్తే ఎలా? జగన్ అనేక ప్రయోగాలు, అనేక దుస్సాహసాలు ఒకేసారి చేశాడు. బలమైన శక్తులను ఐదేళ్లలో వ్యవధిలో కూకటివేళ్లతో పెకలించడానికి అనేక మందితో ఒకేసారి వైరం పెట్టుకున్నాడు. అలాటప్పుడు తన వెనుక ఉన్న సైన్యాన్ని హుషారు చేయాలి, ప్రోత్సహించాలి. అది లేదు, సైన్యం అక్కరలేదు నేనే ఒన్ మ్యాన్ ఆర్మీని, నాకు ప్రజాబలం ఉంది అనుకుని భ్రమపడ్డాడు. అందుకే ఎమ్మెల్యేలకు ఎపాయింట్ మెంటు యిచ్చేవాడు కాదు, యిచ్చినా మీకు పాలిటిక్స్ అర్థం కావు, సర్వేలు నాకు సర్వం చెపుతున్నాయి అనేవాడు.

ప్రజలు తన పక్షాన ఉన్నారో లేదో తెలియాలంటే ప్రజల్లో తిరగాలి. టాప్‌డౌన్ ఎడ్మినిస్ట్రేషన్‌లా పైనుంచి ఆదేశాలిస్తాం, నోరు మూసుకుని అమలు చేయండి అన్నట్లు సాగింది వైసిపి పాలన. జగన్ అనే వాడు దిల్లీ నుంచి రుద్దబడిన ముఖ్యమంత్రి కాదు, ప్రజలతో మమేకమై పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చినవాడు. అధికారం చేజిక్కిన తర్వాత ప్రజలకు దూరమై పోయి, నా ఫోటో చూసి తరించండి అంటే ఎలా? సిద్ధం సభలకై బయటకు వచ్చినప్పుడు మాత్రమే జనాలు సంతోషించారు. ఆదరాభిమానాలు కురిపించారు. ఈ పని ముందే ఎందుకు చేయలేదు అని హితైషులు వాపోయారు. అప్పుడూ బయటకు రాకుండా ఉంటే ఆ 39శాతం కూడా వచ్చేవి కాదేమో!

ఇప్పుడు అధికారం పోయాక కొందరు పార్టీ నాయకులతో సమావేశాలు జరుపుతున్నాడట. ‘ప్రతిపక్షంలో ఉండగా అన్నాఅన్నా అంటాడు బాగానే వుంది, మళ్లీ అధికారం దక్కితే ఎవరన్నా, మీరు? అంటాడేమో’ అనే భయం పార్టీ కార్యకర్తలకు ఉండదా? జగన్ ఒక ప్రజానాయకుడిగా పాలించలేదు. టెన్‌ టు ఫైవ్ పని చేసే ఒక గుమాస్తాగా వ్యవహరించాడని అందరూ చెప్పారు. గుమాస్తాకు అరగంటే లంచ్‌టైమ్. ఇతనికి రెండు గంటలు. వారానికి రెండు రోజులు సెలవులు. ఎవరినీ కలవకుండా, ఎక్కడికీ వెళ్లకుండా, యింటి కెళ్లి రెస్టు తీసుకుంటున్నాడని గమనించి, ఐదేళ్లు రెస్టు తీసుకుంటే మంచిది కదాని ప్రజలు యిలా తీర్పు యిచ్చి ఉంటారు.

ఇక్కడ తమాషా ఏమిటంటే ప్రజలు తమ మనసులో మాటను దాచుకుని ఉంచారు. ఉపయెన్నికలలో కానీ, స్థానిక ఎన్నికలలో కానీ వ్యతిరేక పవనాలు వీచి ఉంటే జగన్ మేల్కొనేవాడు. కానీ అలా ఎలర్ట్ చేయలేదు ప్రజలు. వేచి ఉండి అసెంబ్లీ ఎన్నికలలోనే దెబ్బ వేశారు. జగన్‌ది సైలెంట్ ఓటు అంటూ వచ్చారు, కానీ సర్వేకారులకు అందని పోటు అని తర్వాత అర్థమైంది. ఆ పోటు వేసినది కూడా జగన్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా కూటమి ఎదిగింది అనే నమ్మకం కుదిరిన తర్వాతే! దీన్ని జగన్ ఎందుకు పసిగట్టలేక పోయాడు? ఎందుకంటే అతను ప్రజల్లో దశాబ్దాలుగా తిరుగుతూ వచ్చిన ప్రజా ప్రతినిథులను నమ్మడం మానేసి, కార్పోరేట్ స్టయిల్ సర్వే, స్ట్రాటజీ సంస్థలను నమ్మడం చేత! తెలివైన వాడైతే ఒకదానితో మరొకదాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాల్సింది.

అక్కడికీ ఐప్యాక్ సర్వేలను చెవిరెడ్డి సర్వేలతో పోల్చుకుని చూశాడట. కానీ చెవిరెడ్డి సర్వేలు క్షేత్రస్థాయి నిజాలను ఎంత గొప్పగా ప్రతిబింబించాయో ఫలితాలు చెప్పాయి. జగన్ కోటరీ అంతా అసమర్థులే అని పదకొండు అంకె చాటి చెప్పింది. వాళ్ల చేత కళ్లకు గంతలు కట్టించుకుని, వాళ్లు చేసే శ్రావ్య స్తోత్ర పాఠాలు వింటూ మైమరచిన జగన్‌ను ప్రజలు కుదిపికుదిపి, కుండెడు చన్నీళ్లు పోసి మేల్కొల్పారు. జగన్ అనే కాదు, అధికారంలో ఉన్న వారందరికీ యిదే సమస్య. చంద్రబాబు 2004లో ఓడిపోయినప్పుడు ‘‘ఇండియా టుడే’’ తన మే 25 సంచికలో ఏం రాసిందో ఉటంకిస్తాను. పరాజయ కారణాలు అంటూ యిచ్చిన బుల్లెట్లలో – ‘ఏకవ్యక్తి కేంద్రం, ప్రతికూల స్పందనలను వినడానికి అధినేత ఎన్నడూ సిద్దంగా లేకపోవడం వల్ల వాస్తవాలను తలకెక్కించేవారు లేకుండా పోయారు.’ అని యిచ్చిన అమరనాథ్ మేనన్ వ్యాసం చివర్లో దాన్ని విశదీకరించారు కూడా.

‘తమ సర్వాధినేత చెవులకు ఇంపుగా ఉండేలా నివేదికలు పంపడం తప్ప ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేని నాయకులు, కార్యకర్తలతో నిండిపోయిన తెలుగుదేశం పార్టీలో, అట్టడుగు స్థాయి నుంచి సరైన సమాచారాన్ని రాబట్టాలంటే సామాన్యమైన సంగతి కాదు. ఆ విధంగా వాస్తవ పరిస్థితిని గ్రహించే అవకాశాన్ని టిడిపి అధినేత చేజేతులా పోగొట్టుకున్నారు. పార్టీ నాయకత్వంలో రెండో శ్రేణి అనే దానిని పుట్టనివ్వకుండా, అధికారం అంతటినీ తన చేతులలో కేంద్రీకరించుకున్న చంద్రబాబు రాజకీయ నిర్వహణ శైలి, నేడు తెలుగుదేశం ఘోరపరాభవానికి మూలకారణం అనడానికి సందేహం అక్కర్లేదు.’ అని. 20 ఏళ్ల నాటి యీ వివరణ జగన్‌కు పూర్తిగా అన్వయిస్తుంది కదూ! బాబు మళ్లీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. అదీ సగం రాష్ట్రానికి! విభజన జరగకపోతే ఏమయ్యేదో దేవుడి కెరుక.

ఇది జగన్ వినకపోవడం సమస్య గురించి రాసినది. ఇక చెప్పకపోవడం, విమర్శిస్తున్నా ఖాతరు చేయకపోవడం గురించి తర్వాతి వ్యాసంలో! (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2024)

80 Replies to “ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 06”

  1. “ప్రభుత్వం తరఫున ప్రెస్ క్లబ్ బిల్డింగు కట్టి దానికి ఆయన పేరు పెడితే సరేలే అనుకోవచ్చు. ఏకంగా ఎయిర్‌పోర్టుకా?”

    ఒక గుడారం వేసి, రోజుకి వస్తాయో రావో తెలీని, వాలినా అనేక గంటలు ఆలస్యంగా వచ్చే నాలుగు విమానాలను పట్టుకొని అదొక airport అని కూడా అంటారా? జగనన్న తప్ప గన్నవరం airport ని ఎవడూ పట్టించుకోడు. Of course వల్లభనేని ఉపయోగపడొచ్చు.

  2. “జగన్ కోటరీ అంతా అసమర్థులే అని పదకొండు అంకె చాటి చెప్పింది”

    పెద్దిరెడ్డి కుటుంబం, YSx కుటుంబం, సజ్జల, విజయసాయి, బొత్స కుటుంబం, జోగి, పేర్ని, దేవినేని అర కుటుంబం, ఆళ్ళ…వీటి సమాహారమేగా ఆ party అంటే!

    మొత్తానికి గురువుగారు గురుమూర్తి లాంటి వారికి తన వ్యాసరచనల్లో కించిత్ ప్రస్తావన కూడా లేకుండా చేశారు.

  3. ఇవన్నీ, ఎన్నికలకు ముందు అందరూ అన్నవే. ఈ పద్దతులన్నీ తప్పు, ఈ అహంకారం కూడదు, ఓడిపోతాడు, ఓడిపోయే అవకాశం ఉంది, అని ఒక్కసారి కూడా తమరనలేదు. ఈ మటలు చెప్పడానికి ఇంత అనాలిసిస్ అవసరంలేదు.

    పైగా ప్రశాంత్ కిశోర్ ఈలాంటి మాటలన్నాడనే, టీడీపీకి అమ్ముడుపోయాడన్నారు.

    అయినా నగదు అమ్మకాలు ఎందుకు జరిపాడో తెలియదా తమరికి? అయోమయంగా ఉందా? నిజంగా బాంకులో పనిచేసారా మీరు? సరే నేను చెబుతా వినండి. సాధారణం ప్రైవేటు వ్యక్తులు 1) లెక్క చూపించలేని ఆదాయం లాండరింగ్ కోసం. లేని సరుకు అమ్మి, బిల్లులు చూపించి పన్నుట్టి వైట్ చేయడానికి. 2). ఆదాయం తక్కువ చూపి, టాక్స్ తక్కువ కట్టి బ్లాక్ పెంచడానికి.

    ఇక్కడ ప్రభుత్వం ఎందుకు చేసినట్టు? జనరేట్ అయిన బ్లాక్మనీ ఇంతా విజయనగరం వెళ్లిపోయణదని టాకు.

  4. హేవిటో నీ కష్టాలు. నువ్వు ఇక్కడ రాయడం వలన ఏమి ప్రయోజనం రా బాలరాజు. పాలస్ కి పోయి అన్నకి ఇవన్నీ వినిపించ వచ్చు కదా?

  5. మొన్న జొగి రమెష్ తన కులం చెప్పుకొని రాజకీయలు చెయలి అని చూసినప్పుడు కూదా ఇలాంటి ఆర్టికల్ నె రాయాల్సింది కాదా? మరి ఎందుకు రాయలెదు?

    .

    నువ్వు దొం.*.గ పెపర్లు స్రుస్టించి అగ్రిగొల్డ్ భూములు నీ కొ.*.డు.*.కు పెరున అమ్మెసి సొమ్ములు చెసుకుంటె, ఒక సధారణ గొడ కులస్తుడు ఎందుకు నీ కొసం పోరాడాలిరా గూట్లె, అని అడిగావా? ఎందుకు అడగలెదు?

    1. ఎవ్వడైనా విజయం మీద ఆర్టికల్స్ వదులుతాడు. వీడు మాత్రం పరాజయాల మీద ఓ తెగ ఆర్టికల్స్ వదులుతున్నాడు. అంటే వాడికి ఆల్రెడీ కారిపోతుంది బాసూ.

  6. నేను ఉన్నాను , నేను విన్నాను , నేను చూసాను అని ఒక్క చాన్సు తో అడ్డదారిలో అధికారంలోకీ వచ్చి నేను వినలేదు , నేను చూడలేదు అన్నాడు అదేంటి అని అడిగిన సామాన్య జనాలను చంపి డోర్ డెలివరీ చేసాడు నీచుడు జగన్

  7. ఇసుక మూలంగా అనేక వ్యాపారాలు దెగ్గతున్నాయి. ముక్యం గా పెడప్రజలు. ఎందుకంటే పని లేదు అన్న క్యాంటీన్లు లేవు

    అప్పులపాలై ఉన్న చిన్నం బంగారం బంగారం అమ్ముకుని తర్వాత అడుక్కుని శరీరం గా మానసికంగా నాశనమయ్యారు..

    ఇంకా తాగే వారు అయితే చెప్పే పని లేదు .. ఇంకే ప్రభుత్వ హయాంలో ఇంత గోరం జరగలేదు

  8. Are you alright Leven Mohana??

    ఓటమికి కారణం

    అంతా E’VM లే చేశాయి అన్నావు

    మోసం అన్నావు కానీ ఎవరు చేశారు? ఎలా చేశారో చెప్పలేదు.

    inkosaari Chandraబాబు ఇచ్చిన హామీలు అన్నావు

    ఇప్పుడేమో నేను పలావు, చంద్రబాబు బీర్యాని అంటూ కొత్త కథలు మొదలెట్టవు

    Okademo అభివృద్ది చేయకపోవడం అంటాడు

    Good morning gaademo సినిమా వాళ్ళని avamaaninchadam అంటాడు.

    ఇంకొకడు చెత్త పన్ను అన్నాడు

    ఇంకోడు నీ తల్లి చెల్లి అన్నాడు

    ఈడేమొ తాగుబోతులు అంటున్నాడు

    గల్లీ లీడర్ కూడా Failure ని accept చేసి నీకంటే డీసెంట్ గా practical కారణాలు ఏంటి అని analyze చేసి చెప్పాడు కానీ నువ్వు, నీ కొటరి కి నచ్చదు.. ఈ భ్రమల్లోనే ఉండండి. మాకు ఇదే కావాలి

  9. జగన్ వీర అబిమానులు అతని మీద వీర అభిమానం తో కక్కుసు కామోడు మీద అతని బొమ్మ ప్రింట్ వేసుక్కుని ఉదయ్యాన్నె పనికి వెలినప్పుడ్ చూసుకుని తృప్తి పడ్డారు అన్నారు అప్పట్లో.

  10. ఆ బూమ్ బూమ్ బ్రాండ్ లు అన్నీ జగన్ బినామీ లే అని ప్రత్యర్థి వర్గాల ఆరోపణ.

    ఆ రోజు వారీ హార్డ్ కాష్ రోజు రాత్రికి ప్యాలస్ కి వచ్చి చేరేది అని ప్రజలు నమ్మారు.

    దానికి తోడు ఢిల్లీ లో కవిత అక్కయ్య మద్యం కేసులో జగన్ కి చెందిన మద్యం వ్యాపారులు పాత్ర ఉందని కూడా ఆరోపణ.

  11. ఇంత కష్టపడి ఆర్టికల్స్ వదులుతున్నావు. వెళ్లి పాలస్ పులకేశి కి ఇవన్నీ చెప్పా వచ్చు కదా ?

  12. ఎయిర్పోర్ట్ కి రామోజీ రావు పేరు పెడతారు అనేది చూసి రాస్తున్నాను, తెలంగాణా లో గద్దర్ అవార్డ్స్ అన్నట్లు ఇక్కడ కూడా రామోజీ అవార్డ్స్ అంటే సరి, ఎలాగూ సినిమాలు, టీవీ చానెల్స్ ఉన్నాయి కదా ఆయన తాలూకు!

  13. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకూ ఇసుక రాంపు లు వేలంలో పెట్టి లీజుకు ఇచ్చేవారు. పాడుకున్నవారు ఇసుకను ఒక ధరకు ప్రజలకు అందించేవారు. ప్రభుత్వానికి కూడా వేలం ద్వారా ఆదాయం ఉండేది.

    చంద్రబాబు వచ్చినతర్వాత ఉచిత ఇసుక పేరు మీద ఆ వేలం పద్దతిని రద్దు చేసారు. ఆ రాంపులను రాజకీయపక్ష్లులు ఆక్రమించుకుని సొమ్ము చేసుకోవటం మొదలయ్యింది. పేరుకు ఉచిత ఇసుకే గానీ ఒక్క సీనరేజీ తప్ప మిగిలిన దోపిడీ అంతా మామూలే. ప్రభుత్వానికి వెళ్ళాల్సిన ఆదాయం రాజకీయపక్షుల జేబుల్లోకి వెళుతున్నాయి

    జగన్ వచ్చిన తర్వాత కూడా అదే పద్దతి కొనసాగింపు. కాకపోతే జేబులు మారాయి

    ఈ ఉచిత ఇసుక మూలంగా జనానికి కలిగిన లాభం ఏమీలేదు. మనమెళ్ళి ఇసుక తవ్వుకుంటాము మా బండి మీద తెచ్చుకుంటాము అంటే అక్కడ ఉన్న రాజకీయపక్షులు కాళ్ళు విరగగొడతారు.

  14. టీడీపీ నాయకులు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వాళ్ళు చంద్రబాబు ని చెడగొడతారు కాని మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తే సమర్ధుడు అయిన నాయకుడు జగన్ తో పోలిస్తే చాలా బెటర్!

    1. ఖర్మ అలా ఏడ్చింది…….ఇలా ఎన్నాళ్లు పొగడాలో, మళ్ళీ విడిపోయాక ఎన్నాళ్లు తిట్టాలో……

  15. బసవతారకం కిట్లు పంచగాలేనిది, రామోజీ విమానాశ్రయం అంటే తప్పేముంది?

  16. అయిపోయిన పెళ్లికి బాజాలన్నట్టు, చెవిటోడి ముందు శంఖారావంలా నువ్వు ఎన్ని రాసిన వృదానే. వైసిపి వాళ్ళు evm వలనే ఓడిపోయాం అని బల్లగుద్ది చెపుతుంటే నువ్వు ఇంకా వైఫల్యాలు అని రాస్తున్నవేమిటి ?

  17. తమ్ముళ్ళారా మిమ్మల్ని ఇంకా తాగిస్తాను అని బాబు ఎప్పుడు అన్నారో quote చేయండి.

  18. ఎంత నిజమో తెలియదు కానీ, ఏకంగా కన్న తల్లి తండ్రుల పైనే చెయ్యేత్తే దుందుకుడు అలవాటు జగన్ కి చిన్నప్పుడు నుంచే వుంది అని, అది నచ్చకే , అతన్ని తాను సిఎం గా వున్న కాలంలో , బెంగళూర్ లో వుండి వ్యాపారాలు చేసుకో, తన పరంగా అన్ని సదుపాయాలు , పరిచయాలు, కాంట్రాక్టు లు , లైసెన్సు లు ఇప్పిస్త కానీ హైద్రాబాదు మాత్రం రావొద్దు అని వైఎస్ఆర్ గారు అన్నారు అని కడప స్థానిక జనాల్లో బాగా ప్రచారంలో వుంది.

    1. తన తండ్రి విషయంలో అప్పటిదాక సీబీ*ఐ విచా*రణ కావాలి అని గొడవ చేసి, అధికారం రాగానే, హటాత్తుగా యెందుకు వద్దు అని ఆపేసారు అనేది, ఇప్పటికీ వైఎ*స్ఆర్ భక్తు*లకు అర్థం కానీ పెద్ద అను*మనం.

      ఇదే విధానం, చిన్నాన్న విషయంలో కూడా జరిగింది, ఇప్పుడు అందులో అన్న పాత్ర వింది అని సొంత వివేకా కూతురే ఆరోపణ చేశారు. కనుక అన్ని చుక్కలు కలిపి చూస్తే, ఇ*తని పైన అనుమానము కలిగే టట్లు అనిపిస్తుంది. రాజకీయాల్లో సి*ఎం పదవి కోసం ఏదైనా చేస్తారు కా*బట్టి.

      1. రోసయ్య గారు స్వ*యంగా చెప్పారు, తన మీద చేయి చేసు*కున్నాడు అని, చెప్పకూడని దూషణ భాష వాడారు అని.

  19. ఐఏఎస్ లో ఫెయిల్ అవ్వాల్సిన కాండిడేట్ కి ఏదో పొరబాటు జరిగి ఫస్ట్ ర్యాంక్ వచ్చి , నేరుగా చీఫ్ సేకరియరీ పదవి ఇస్తే ఎలా చేస్తారో, జగన్ కూడా అలానే చేశాడు అని జనాలు అనుకుంటున్నారు.

  20. MBS garu EVM la gurinchi intha issue jaruguthu vunte vati gurinchi enduku matladatledu meeru.. Meru rase ee sequel articles ippatike chala mandi chepparu lendi.

    1. AP lo 49 lakhs votes extra paddayi
    2. Form 20 Election commission inka upload cheyaledu
    3. Balineni re verification pettukunte ECI suprime courts order prakaram Re verification cheyatledu.

    ilanti important details matladakunda sodhi rastunnaru one month nundi

  21. MBS garu EVM la gurinchi intha issue jaruguthu vunte vati gurinchi enduku matladatledu meeru.. Meru rase ee sequel articles ippatike chala mandi chepparu lendi.

    1. AP lo 49 lakhs votes extra paddayi
    2. Form 20 Election commission inka upload cheyaledu
    3. Balineni re verification pettukunte ECI suprime courts order prakaram Re verification cheyatledu.

    ilanti important details matladakunda sodhi rastunnaru one month nundi

  22. నాకు తెలిసి 11 వ్యాసాలు రాస్తారు అనుకుంటా వైసీపీ ఎమ్మెల్యే ల సంఖ్య కు సింబాలిక్ గా

  23. Nee chetta nakodaka neku evadra award ichindi..intha chetta vedhavalaga vunnav chusthunte.Ante jagan chesina anni manchi panule kani janalu ardham chesukoledu or TDP dushpracharam chesindi anthe kani vadoka vedhava ani matram oppukolevu..endukura munda neelanti sannasulu bathakatam

  24. మీ మెదడు కొంచెం … బాగానే …. పాడైపోయినట్లుంది ….

    కొంచెం …. మోకాళ్ళ కు స్కాన్ చేయించండి …

    కొంచెం కూడా నిజానికి దగ్గరగా లేదు … ఈ కధ, కధనం

  25. //దీన్ని అలుసుగా తీసుకుని టిడిపి జగన్ సర్కారు అమ్మే బ్రాండ్లు రుచీపచీ లేనివనీ, నాణ్యత లేనివనీ, విషపూరితమనీ, తెగ ప్రచారం చేసింది.//

    అది ప్రచారం కాదు నిజం. రాకేష్ మాస్టర్(ఇతను రెడ్డి) ఈ ఆంధ్రా కల్తీ మద్యం తాగే చనిపోయాడు. శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మద్యం మీద కొన్ని వీడియోలు చేశాడు. రఘురామకృష్ణంరాజు(అప్పటికి వైసీపీలోనే ఉన్నాడు) కల్తీ మద్యానికి సంబంధించిన రిపోర్టులు అనేక డిబేట్లలో చూపించాడు. పురంధేశ్వరి కూడా ఆస్పత్రిలో కల్తీ మద్యం బాధితుల్ని కలిసింది. యూట్యూబ్ లో అనేక వీడియోలు ఉంటాయి చూడండి

    1. రాకేశ్ మాస్టర్ పోస్ట్ మార్టమ్‌లో అలా ఉందా? వీడియోలు చేసి ఊరుకుంటే ఎలాగండి? పోలీసు రిపోర్టు యివ్వాలి, లాబ్స్‌కి పంపించి రిపోర్టులు తెప్పించాలి. అడ్డమైనదానికి కోర్టుకి పరిగెట్టే రఘురామ దీనిపై ఎందుకు కేసు వేయలేదు? ఇక కల్తీ మద్యం వేరు, అభీషియల్‌గా అమ్మే బ్రాండ్లలో విషం ఉండడం వేరు. రెండిటిని కలపకండి

      1. రాకేష్ మాస్టర్ ఫ్యామిలీ హైదరాబాద్ లోనే ఉంటారు, వాళ్ళనే వెళ్ళి అడగండి ఏమి జరిగిందో, అతనికి వైద్యం చేసిన హాస్పిటల్ వాళ్ళని కూడా అడగండి. కల్తీ మద్యమే అధికారికంగా కమిషన్ తీస్కుని అమ్మారు. ల్యాబ్ కి శాంపిల్స్ ఎందుకు పంపలేదు అన్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ చూపించాడు అంటుంటే కోర్టుకి ఎందుకు పోలేదు అంటున్నారు. తర్వాత ఏంటి శ్రీమంతుడు లో మహేష్ బాబులా ఫ్యాక్టరీ ఎందుకు తగలబెట్టలేదు అని అడుగుతారా?

      2. మీరు రాసే అడ్డమైన వాడి మీద వ్యాసాల కన్నా, రఘురామా కోర్టులకు అడ్డమైన దానికి ఏమీ వెళ్లట్లేదు.

        1. పోనీ అలాగే అనుకోండి. మద్యం రిపోర్టుల విషయం నిలువైనది అనుకోకపోవడం చేతనే కదా, దీనిపై కోర్టుకి వెళ్లలేదు?

          1. పోనీ మీరు చేపినట్టే అది కూడా అలాగే అనుకుందాం. కానీ ఇండిపెండెన్స్ రోజు కూడా మీ వ్యాసం (05) అడ్డమైన వాడి మీదే రాయాలా? ఆ రోజు అన్నా దేశ భక్తుల గురించి రాయాలని అనిపించ లేదా మీకు? ఇది తప్పు కాక పోతే, ఏదీ తప్పు కాదు. డబ్బు అవసరమే, కానీ ఉపయోగ పడండి సమాజానికి. జీవితం చాలా చిన్నది, నలుగురికి ఏమి మంచి చేసాం అనేది ముఖ్యం.

  26. కొందరు పాఠకులు అర్థమే కారు. జగన్ ఓటమి గురించి చాలామంది చెప్తూ వస్తున్నారు కదా, తక్కిన రాష్ట్రాల గురించి చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఎప్పుడో రాద్దామనుకుంటే, ‘ఏం, జగన్ గురించి రాయడానికి భయమా?’ అంటూ వ్యాఖ్యలు పెట్టారు.

    సరే అని మొదలు పెట్టి రాస్తూ ఉంటే యింకా ఎన్ని రాస్తావు? అని మరి కొందరి ఘోష. ఎన్ని రాస్తే ఏమిటి, రాసిన పాయింటు తిరిగి రాయటం లేదు. అనేక కోణాల్లోంచి చర్చిస్తున్నాను కదా. నచ్చకపోతే చదవడం మానేయవచ్చు, ఇవన్నీ మాకు ముందే తెలుసు అనుకుంటే యీ ఆర్టికల్ ఓపెన్ కూడా చేయనక్కరలేదు. రావడం దేనికి, నేను చదవలేదు అని గొప్పగా వ్యాఖ్య పెట్టడం దేనికి?

    నా గణాంకాల్లో కానీ, లాజిక్‌లో కానీ తప్పులుంటే ఎత్తి చూపించాలి తప్ప వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, యింకా ఎన్ని రాస్తావని అడగడం శుద్ధ వేస్టు. ఇలాటి వ్యాఖ్యలు ఉంచడం వలన మిగతా పాఠకుల సమయం వృథా అవుతుంది అనుకుని తీసేస్తే నేనేదో భావస్వేచ్ఛను హరించేస్తున్నట్లు, ‘నా కామెంట్స్ ఎందుకు తీసేసావంటూ’ మరో వ్యాఖ్య.

    జీవితంలో అత్యంత విలువైనది సమయం. చేజారితే తిరిగి రానిది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వినియోగించ వలసినదాన్ని యిలా వ్యర్థం చేసే వాళ్లను చూసి జాలి పడుతూంటాను. ఇప్పటికైనా అర్థవంతమైన వ్యాఖ్యలు చేసి, కామెంట్స్ కాలమ్ విలువ పెంచండి. ఇవి ఎన్ని రాస్తావు, అదెందుకు రాయవు అని అడగడం మానండి. నాకు తోచింది నేను రాస్తాను, మీకో తోచింది మీరు చదవండి. దీనిపై ప్రశ్నత్తరాలు అనవసరం.

  27. sigguleni sannasi nuvvu YCP dhaggara dabbulu mekki nee istam vachhina raathalu rasthe leni thappu maa comments ki vachhindhaa delete chesaavu….nee chariithra anthaa thelusu.

  28. రాకేష్ మాస్టర్ ఏదో పని మీద వచ్చి ఆంధ్రాలో మద్యం తాగి, హైదరాబాద్ వెళ్ళి వీడియో చేశాడు నాకు ఏదో తిక్క తిక్కగా ఉందని ఆంధ్రా మందు తాగినప్పటినుంచి.

    https://youtu.be/_Z9qJ5o_AX0?feature=shared

    మీరు ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి వాళ్ళ కుటుంబసభ్యులను కలిసి ఏమైందో స్వయంగా కనుక్కోండి. నన్ను పోస్టుమార్టం రిపోర్ట్ అడగడం, కామెంట్ డిలీట్ చెయ్యడం హాస్యాస్పదం. ఆంధ్ర మందు తాగిన వాళ్ళకి కాలేయంలో, ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఆస్పత్రి పాలవుతున్నారు. కొందరు కోలుకున్నారు, కొందరు మరణిస్తున్నారు. పైగా నా అవగాహన మేరకు ఆత్మహత్య, ప్రమాదం లాంటి సందర్భాల్లో పోలీసు కేసు పెట్టి పోస్టుమార్టం నిర్వహిస్తారు, ఇలా అనారోగ్యం సందర్భాల్లో చేయరు. తెలంగాణలో చనిపోతే ఆంధ్రలో ఉన్న జనాలకు పోస్టుమార్టం రిపోర్టు ఎలా వస్తుందనుకున్నారో మీకే తెలియాలి.

  29. తేనే తుట్టె ని కదిలించారు కదా? వాసుదేవరెడ్డి తో అన్ని నిజాలు కక్కించాక రాస్తే బాగుండేది. అసలు అప్పటివరకు వున్న మద్యం తయారీ కంపెనీలను నయానో భయానో బెదిరించి వాళ్ళతో వైసీపీ బినామీలకు అమ్మించేయడమో, లేక తరిమేయ్యడమో చెయ్యటం , వాటి లోంచి చీప్ లిక్కర్ తయారుచేసి, ఇష్టమైన ధరలకు అమ్మి తాగు బోతు వాళ్ళ నడ్డి విరచడమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా పాడుచేసి, ఈ అమ్మకాలన్నీ నగదు ద్వారా నే అమ్మించి, ఆ డబ్బు ని పాలస్ కి తరలించి ప్రతి రోజు ఆరు దాటాక, ఈ రోజు కలెక్షన్ ఎంత అని ఒక మాఫియా చక్రవర్తి లా లెక్కలు వేసుకుని, లాకర్ కంటైనర్లు లో దాచుకున్న ఒక సీఎం పరాజయానికి ఏ ఒక్కరిని నిందించక్కర్లేదు. పరదాలు లేకుండా ఏ ఒక్క తగుబాతు కి దొరికిన పాదరక్షల పట్టాభిషేకం జరిగి ఉండేది. మల్లి జగన్ ఆంధ్ర కి సీఎం అవ్వటం అనేది అసంభవం.

  30. Prasad gaaru..

    Namasthe. You have covered a tons of valid reasons for Jagan’s fiasco. But you have nowhere mentioned how Pawan Kalyan was insulted by Jagan and how Jagan incited his ministers to continously speak nonsence about Pawan’s marriages and how the largest Kaapu community took it so personal and ensured that Pawan got 100% success in all seats he ran for!!

    From the day 1, you guys have been trauducing Pawan’s image and belittling hism that no other community was with him except the Kaapu community. Why are keeping silent on this point?? Kindly clarify!!!

  31. JAGAN wasted lots of public money in inserting full page advertisements in state & national papers.. repeatedly telling about his ministry’s achievements.. along with his large photo, and inserting the name of the concerned minister to the bottom corner (and of course with no snap if the minister).. 😀

  32. అయిబాబోయ్, ఇన్ని కారణాలా.. ఒక సంవత్సరం ధారావాహిక రాసినా సరిపోయేట్లు లేవు అన్న లీలలు ..

    సారు ఒక భారీ ప్రాజెక్ట్ ధీసిస్ తలకేత్తుకున్నారు

    ఈ దెబ్బకు పిహెచ్డి కొట్టేస్తారేమో

  33. One thing I want to tell . I will not take alcohol, but few of my friends they will take very occasionally but when they taken J brand’s seriously effected and few taken oath until Jagan government dissolved they will not take alcohol.

Comments are closed.