హ‌లో ప‌వ‌న్‌… మీ కార్పొరేట‌ర్ ఘ‌న కార్యం చూశారా?

విశాఖ‌లో జ‌న‌సేన కార్పొరేట‌ర్ పీత‌ల మూర్తి యాద‌వ్ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. వైసీపీ హ‌యాంలో విశాఖ‌లో భారీ భూదోపిడీ జ‌రిగిందంటూ ఆయ‌న నిత్యం మీడియా ముందుకొచ్చి ఆరోప‌ణ‌లు చేస్తుండేవారు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల ముంగిట…

విశాఖ‌లో జ‌న‌సేన కార్పొరేట‌ర్ పీత‌ల మూర్తి యాద‌వ్ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. వైసీపీ హ‌యాంలో విశాఖ‌లో భారీ భూదోపిడీ జ‌రిగిందంటూ ఆయ‌న నిత్యం మీడియా ముందుకొచ్చి ఆరోప‌ణ‌లు చేస్తుండేవారు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల ముంగిట ఆయ‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన మూర్తియాద‌వ్‌పై ప‌రువు న‌ష్టం కేసు వేస్తున్న‌ట్టు జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు.

తాజాగా మ‌రోసారి జ‌న‌సేన కార్పొరేట‌ర్ పీత‌ల మూర్తి యాద‌వ్ వార్త‌ల్లో నిలిచాడు. ఈ ద‌ఫా అత‌ను మోస‌గించిన‌ట్టు బాధిత మ‌హిళ విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చికి ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌ద్దిల‌పాలెం మంగాపురం కాల‌నీ తారా మ‌సీదు ప్రాంతానికి చెందిన బాధిత మ‌హిళ సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో త‌న గోడు వెళ్ల‌బోసుకున్నారు.

వ్యాపార అవ‌స‌రాల పేరుతో త‌న వ‌ద్ద మూర్తి యాద‌వ్ రూ.30 ల‌క్ష‌ల న‌గ‌దు, 90 గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడ‌ని, ఆ త‌ర్వాత ముఖం చాటేస్తున్నాడ‌ని ఆమె వాపోయారు. మూర్తి యాద‌వ్‌కు సంబంధించి ఇది రెండో కోణం. అత‌నిపై బ్లాక్ మెయిల్ ఆరోప‌ణ‌లున్నాయి. మీడియా ముందుకొచ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి, ఆ త‌ర్వాత బేరాలు కుదుర్చుకుంటాడ‌ని సొంత పార్టీ నేత‌లు సైతం ఆరోపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌లంటే విప‌రీత‌మైన గౌర‌వం ప్ర‌ద‌ర్శించే జ‌న‌సేన అధ్య‌క్షుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ బాధితురాలి విష‌యంలో జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం వుంది. మోస‌గించాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ది సొంత పార్టీకి చెందిన కార్పొరేట‌ర్ కావ‌డంతో, నిజానిజాలు తెలుసుకుని బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్య‌త ప‌వ‌న్‌పై ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అప్పుడే ప‌వ‌న్ ఇమేజ్ మ‌రింత పెరుగుతుంది. లేదంటే ప‌వ‌న్ ఉత్త మాట‌ల లీడ‌ర్‌గా మిగిలిపోతారు.

11 Replies to “హ‌లో ప‌వ‌న్‌… మీ కార్పొరేట‌ర్ ఘ‌న కార్యం చూశారా?”

  1. నిన్ను ఎమైనా అంటె రక్తం కక్కుకొని చస్తారు అన్నావ్ ..లైట్ తీసుకొ ..రక్తం కక్కుంటారు

  2. వ్యాపార అవసరాలకి తీసికుంటె ఎదొ ఒక పత్రం ఉంటుంది కదా. అది తీసుకొని కొర్ట్ కి వెల్లవచ్చు!

  3. ఇందులో అతను ఏమి దొంగిలించలేదు ఆమె సమ్మతితోనే తీసుకొన్నాడు అతను ఇవ్వకపోతే కోర్ట్ లకు వెళ్ళాలి పవన్ వద్దకు వెళ్ళాలసింది అతను దౌర్జన్యం గ అన్యాయం గ దొంగిలించినప్పుడు మాత్రమే

  4. 😂😂😂…. VIZAG లో మన vi sa re దోచుకున్న వేలకోట్ల అవినీతి సొమ్ము , అక్రమ సంబంధాల గురించి రోజూ ప్రెస్ మీట్లు పెడుతున్నాడని కడుపు మంట….అంతేనా GA….

Comments are closed.