కులనాయకుడు

ఒక్కోసారి అత్యుత్సాహం, అతి నిరుత్సాహం అనేవి కొంపలంటుకునేలా చేస్తాయి. కమ్మవారిలో ఉన్న ఈ గుణం ఇప్పుడు తెలుగుదేశం కొంప ముంచుతోంది.  Advertisement చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లినప్పటినుంచీ “కమ్మవాళ్లు మాత్రమే” చేస్తున, చేయిస్తున్న నిరసన కార్యక్రమాలు…

ఒక్కోసారి అత్యుత్సాహం, అతి నిరుత్సాహం అనేవి కొంపలంటుకునేలా చేస్తాయి. కమ్మవారిలో ఉన్న ఈ గుణం ఇప్పుడు తెలుగుదేశం కొంప ముంచుతోంది. 

చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లినప్పటినుంచీ “కమ్మవాళ్లు మాత్రమే” చేస్తున, చేయిస్తున్న నిరసన కార్యక్రమాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. 

ఐటీ ఉద్యోగుల నిరసనలు అంటూ హైదరాబాదులో కొన్ని చోట్ల హడావిడి చేసారు. వాళ్లని ఆరా తీస్తే బెజవాడ కమ్మ యాసలో సమాధానాలు చెప్తున్నారు. ఇంకాస్త గుచ్చి అడిగితే తమది కమ్మ సామాజికవర్గం అని చెప్తున్నారు. 

అయితే వాళ్లల్లో నాన్-కమ్మాస్ కూడా కొందరున్నారు. వాళ్లని అడిగితే, నిజంగా చంద్రబాబు కోసమైతే కాదని తమ కమ్మ ఫ్రెండ్స్ కొంతమంది పిలిస్తే ఫ్రెండ్షిప్ మీద వెళ్లామని చెప్పారు. 

అంటే దీనినిబట్టి ఏమర్ధమవుతోంది? “కమ్మ”ప్రమేయం లేకుండా అసలెక్కడా చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా నిరసనే జరగలేదు. 

ఈ తంతు ఒక్క హైదరాబాదులోనే కాదు..అమెరికా, లండన్ లో కూడా ఇదే కథ. అసలే అమెరికాలో కులసంఘాలు మరీ ఎక్కువ. 

అమెరికాలో, లండన్లో జరుగుతున్న నిరసన చూస్తుంటే ఖలిస్తాన్ తీవ్రవాదులకి కమ్మవారికి పెద్ద తేడా లేదనిపిస్తోంది. ఇండియాలో లేని ఖలిస్తాన్ ఉద్యమం ఆయా దేశాల్లో ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్ లో లేని “చంద్రబాబు అరెస్టు వ్యతిరేక ఉద్యమం” పక్క రాష్ట్రంలోనూ విదేశాల్లోనూ ఉంది. దీనిని బట్టి అర్ధం కావట్లేదూ…ఇదంతా ప్రేరేపిత కార్యక్రమం మాత్రమే అని. 

ఇక సినీ రంగం విషయానికొస్తే అరెస్టవగానే తొలుత స్పందించిన ప్రముఖుడు కె. రాఘవేంద్రరావు. ఆ వెంటనే కె.ఎస్.రామారావు, అశ్వినీదత్, బండ్ల గణేష్. అందరూ కమ్మవారే. 

“మా కులపెద్ద, తండ్రిలాంటి బాబు అరెస్టయితే అన్నం తినబుద్ధి కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా బాబు వలన లబ్ధిపొందిన మా కులపోళ్లు ముందుకు రావాలి” అంటూ బంద్లగణేష్ అన్న మాటలు తెగ వైరలవుతున్నాయి. ఆంధ్రా మాజీ సీయం చంద్రబాబుని కేవలం “కులపెద్ద”గా కార్నర్ చేసేసాడు బండ్ల గణేష్. 

ఇదొక ఎత్తైతే నిన్న ఏదో సినిమా ప్రెస్మీటులో విలేకరులు చంద్రబాబు అరెస్టు గురించి అడిగిన ప్రశ్నలకు దగ్గుబాటి సురేష్ బాబు లౌక్యంగా తప్పించుకునే ప్రయత్నం చేసారు. 

సినీరంగాన్ని అందరూ అభివృద్ధి చేసారని, ముఖ్యంగా చెన్నారెడ్డి అందులో ముఖ్యులు అంటూ అసలు చంద్రబాబు ప్రస్తావనే తేలేదు. వ్యక్తిగతంగా తనకి, తన తండ్రి దివంగత రామానాయుడుకి తెలుగుదేశంతో అనుబంధం ఉండొచ్చేమో కానీ, సినీ రంగం పరంగా తామంతా నాన్-పొలిటికల్ అని చెప్పుకొచ్చారు. అంతవరకు సరే…ఇది విన్న కొంత మంది కమ్మ సినీప్రముఖులు సురేష్ బాబుని ఆఫ్ ద రికార్డులో బండబూతులు తిడుతున్నారు. 

బండ్ల గణేష్ అయితే సురేష్ బాబుని “గోడ మీద పిల్లి” అంటూ ఒక రీట్వీట్ చేసి మనసులోని ఆవేదనని బయటపెట్టుకున్నాడు.

ముస్లిమ్మైతే టోపీ పెట్టుకోవాలి, క్రైసవుడైతే శిలువ ధరించాలి అన్నట్టుగా.. కమ్మవాడైతే కచ్చితంగా చంద్రబాబుని వెనకేసుకురావాలి అనే “కులనియమం” పెట్టేసుకున్నట్టు ఉన్నారు. అందుకేనేమో కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి తాజాగా రజిని చౌదరి..వీళ్లంతా కమ్మవారిచేత వెలివేయబడ్డ ప్రముఖులు. 

అన్నట్టు చంద్రబాబు అరెస్టుని జాతీయవిపత్తుగా భావిస్తూ డబ్బాకొడుతున్నది కూడా కమ్మ మీడియానే. ఈ విధంగా యావత్ కమ్మ సమాజం కలిసి చంద్రబాబుని కార్నర్ చేసి పారేసింది. 

గతంలో బాలకృష్ణ సినిమా విడుదలైనప్పుడు, తెదేపా ఒకటో రెండో ఎమ్మెల్సీ సీట్లు గెలిచినప్పుడు అవసరానికి మించి అత్యుత్సాహం చూపించి కమ్మవాళ్లు మిగిలిన కులాల చేత “ఛీ”కొట్టించుకున్న సందర్భాలున్నాయి.

ఇప్పుడైతే అతి నిరుత్సాహంతో డిస్పరేషన్ చూపిస్తూ అదే పని చేస్తున్నారు. 

– ఇండియాకి ఐటీని తీసుకొచ్చిన ఆద్యుడు రాజీవ్ గాంధి.

– హైదరాబాదులో హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దనరెడ్డి.

– దేశంలో సెల్ఫోన్ విప్లవాన్ని  “కర్లో దునియా ముఠ్ఠీ మే” అనే నినాదంతో నాంది పలికింది అంబాని. తక్కువ ధరల్లో ప్రతి మధ్య-పేద తరగతి వాడికి విస్తృతంగా సెల్ ఫోన్స్ అందించిన తొలి సంస్థ రిలయన్స్.

– ఎంతో మంది యువతకి ఐటీ ఉద్యోగాలు వచ్చింది చంద్రబాబు కట్టిన బిల్డింగుల వల్ల కాదు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజ్ రీ-ఇంబర్స్మెంట్ వల్ల. ఆ స్కీమువల్ల ఎంతో మంది మధ్య-పేద తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివి ఐటీ ఉద్యోగాలు పొందారు.

– లక్షలాదిమంది ఎన్నారైలు అమెరికాలో స్థిరపడడానికి చంద్రబాబు నాయుడు కారణమంటే సిగ్గుచేటు. అక్కడ తెలుగువాళ్లే కాదు అన్ని రాష్ట్రాల వాళ్లూ ఉంటున్నారు. 

ఇలా ప్రతి విషయంలోనూ పక్కనోడి క్రెడిట్ లాగేసుకుని మనుగడ సాగిస్తున్న చంద్రబాబుని కమ్మ మీడియా, కమ్మవాళ్లు భుజానకెత్తుకుని మోస్తుంటే కమ్మజాతిని మానసికంగా వెలివేస్తున్నారు తక్కిన ప్రజలు. 

చుట్టూ చూసి లోకజ్ఞానం పెంచుకోకుండా కేవలం కమ్మపత్రికలు, కమ్మ చానళ్లు చూసే సాధారణ జనం కూడా తెదేపా డ్రగ్ ఎడిక్టులైపోయి, తీవ్రవాద సంస్థల్లో బ్రెయిన్ స్టార్మింగ్ కి గురయ్యే కసబ్బుల్లాగ తయారవుతున్నారు.

వీళ్లకి సత్యాలు కనపడవు, వినపడవు. ఒక వర్చువల్ ప్రపంచంలో బతుకుతుంటారు. పైన బులెట్ పాయింట్స్ లో చెప్పిన సత్యాలు వెయ్యి సార్లు చెప్పినా వీళ్లకి అర్ధం కాదు. 

హైటెక్ సిటీ అంటే చంద్రబాబే అంటూ, సెల్ఫోన్ తెచ్చింది కూడా మా బాబే అంటూ ఊగుతుంటారు. వీళ్లని ఏ రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టినా ఫలితం రాకపోవచ్చు. 

అన్నట్టు రేణుకా చౌదరి అన్నది ఒకసారి చెప్పుకోవాలి. చంద్రబాబు అరెస్టుపై తన కమ్యూనిటీ జనమంతా సంయమనం పాటిస్తున్నారు కాబట్టి ఇలా ఉంది కానీ, లేకపోతే వేరే రకంగా ఉండేదన్నట్టుగా చెప్పింది. అంతే కాదు, జగన్ మోహన్ రెడ్డి కమ్మవాళ్లని తొక్కేస్తున్నాడని మైకులో చెప్పింది.

దీనిమీద స్పందిస్తూ తాజాగా మహిళానాయకురాలు రజిని చౌదరి కూడా ఒక మాట అన్నారు- “కమ్మవారిలోనూ, ఖమ్మంలోనూ టికాణా లేని రేణుఖా చౌదరి మాటల వల్ల కమ్మ వాళ్లని మిగిలిన కులాల వాళ్లు దూరం చేసుకుంటున్నారు” అని చెప్పారు.  

అది నిజం. ఇలాంటి మాటల వినే తెలుగుజనం.. ఇదంతా  ప్రభుత్వానికి, కమ్మవాళ్లకి మధ్యన జరిగే గొడవలాగ అర్ధం చేసుకుంటారు తప్ప ఎవడికి మాత్రం ఎమోషనల్ కనెక్ట్ ఎందుకుంటుంది? 

ఆల్రెడీ 2019 ఎన్నికల్లో తెదేపా మట్టికరవడానికి కారణం కమ్మవారి అతిపోకడల వల్ల ఏర్పడ్డ “యాంటి-కమ్మ ఫీలింగ్” ఒకానొక ప్రధాన కారణం. అయినా బుద్ధి తెచ్చుకోకుండా 2019-2024 మధ్యలో కూడా అవే విన్యాసాలు చేస్తుంటే ఏమనాలి? 

ఊపిరాడని గదిలో కూర్చోపెడితే సఫొకేషన్ ఎలా ఉంటుందో అలా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు ఈ కమ్మజాతీయులు. అంత అవసరం లేదు. ఇలా ప్రతి కులపోడు తమ కులనాయకుడే సీయం అవ్వాలని కూర్చుంటే రాష్ట్రం, తెలుగుజాతి అధోగతి పాలవుతుంది. 

వైకాపాలో రెడ్లు లేరా అని అడొగొచ్చు. ఉన్నారు. ఎంతమందున్నా వారితో పాటు మిగిలిన కులాల వాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఉన్నా లేకపొయినా రెడ్డి నాయకులతో మిగిలిన కులాలవాళ్లకి ఇబ్బంది లేదు. అందరినీ కలుపుకుపోతారు, అందరి బాగోగులూ చూస్తారు అనే అభిప్రాయం జనంలో ఎక్కువగా ఉంది. 

ఒక్కసారి తరచి చూస్తే అర్ధమవుతుంది. ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు, బ్రాహ్మలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల అభిమానాన్ని వైకాపా ఎలా పొందగలిగింది?

ఎందుకంటే ఆ కులం వాళ్లు ఎప్పుడూ ఇలా ఏకపక్షంగా, కులైకమత్యంగా ఒక్కటై మాట్లాడలేదు. జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినప్పుడు రెడ్లపై దాడిగా వాళ్లు అభివర్ణించలేదు.

“మా బ్లడ్డు-బ్రీడు” అంటూ ఏ ప్రముఖ రెడ్డి నాయకుడు అనలేదు. అందుకే రెడ్ల పాలనపై ప్రజల్లో కంప్లైంట్ లేదు..ఉంటే గింటే కేవలం చంద్రబాబు పక్షపాతులైన కమ్మవారికుంటుందంతే. 

చంద్రబాబు పరువుని, తెదేపా కొంపని ముంచుతున్నది ఎవరో కాదు..అతి చేస్తున్న కమ్మలు మాత్రమే.

రాజకీయంగా తెదేపా కమ్మల ప్రాబల్యం పూర్తిగా మసకబారిందని చెప్పొచ్చు. దీనికి కారణం కూడా స్వయంకృతాపరాధమే తప్ప మరొకటి కాదు. 

“ఏరు దాటే వరకు ఓడ మల్లన్న- ఏరు దాటాక బోడి మల్లన్న” అనే సామెత తెదేపాకి చెందుతుంది.

1983 నుంచి నేటి వరకు, ఎన్నికల సీజం మొదలయ్యి ముగిసే వరకు తెదేపాకి అందరూ మిత్రులే..అన్ని కులాలవాళ్లు స్నేహితులే. 

ఒక్కసారి ఎన్నికలయ్యి పదవొస్తే మాత్రం లబ్ధి పొందేవారిలో 99% మంది కమ్మవారే. ప్రతి ప్రాజెక్టుకి ఎక్కడో ఉన్న కమ్మవాడిని పట్టుకొచ్చేవారు. ప్రతి చిన్న సివిల్ కాంట్రాక్టు కమ్మవాడికే కట్టబెట్టేవారు.

అదే కాంగ్రెసు ప్రభుత్వంలో ఈ లెక్క కాస్త వేరుగా ఉండేది. 60%-70% రెడ్లు లబ్ధిపొందితే మిగిలిన 30%-40% మంది అన్యకులస్థులు కూడా లబ్ధి పొందేవాళ్లు. రాజ్యాధికారాన్ని ఆ రకంగా పంచేవాళ్లు. 

అందుకే ఇప్పుడు చంద్రబాబు అరెస్టయితే తమ కులానికి మాత్రమే లబ్ధిచేకూర్చిన కమ్మవాళ్లు తప్ప ఇంకెవ్వరూ రోడ్డెక్కట్లేదు. 

– హరగోపాల్ సూరపనేని