Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఎక్స్ క్లూజివ్ - లోకేష్ విప్లవాత్మక నిర్ణయం

ఎక్స్ క్లూజివ్ - లోకేష్ విప్లవాత్మక నిర్ణయం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏదీ అంత సులువుగా తేల్చరు. లాస్ట్ మినిట్ వరకు అన్నీ లెక్కలు పెడతారు. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో ఆఖరి నిమిషం వరకు ఏదీ తేల్చరు. అయితే ఫర్ ఏ ఛేంజ్ ఈ సారి అలా కాదు. 

పార్టీ నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లొకేష్ ఈసారి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ డిసెంబర్ లోగానే 100 సీట్లకు అభ్యర్ధులను దాదాపుగా ప్రకటించేయాలని ఆయన డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. 

అలాగే వచ్చే సమ్మర్ లోగా మరో ఇరవై వరకు ప్రకటిస్తారు. జనసేన ఇతర పొత్తుల కోసం 30 సీట్లు పక్కన పెడతారు. ఒకవేళ జనసేనతో పొత్తు కుదరకపోతే అప్పుడు ఆ సీట్ల సంగతి చూస్తారు.

జనసేన మదిలో పొత్తులో భాగంగా 40 సీట్లు తీసుకోవాలని వుందని తెలుస్తోంది. కానీ 30 సీట్ల వరకు ఇవ్వడానికి తెలుగుదేశం సిద్దంగా వుందని బోగట్టా. అయితే కేవలం జనసేన వస్తే పెద్దగా ప్రయోజనం వుండదని, భాజపాతో కలిసి వస్తేనే ప్రయోజనం అని తెలుగుదేశం పార్టీ కీలక బాధ్యులు భావిస్తున్నారు. 

ఇటీవల వైకాపా పట్ల వ్యతిరేకత బాగా పెరగిందని, అందంతా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అనుకూలంగా మారుతోందని అందువల్ల జనసేన కలసి రాకున్నా ఫరవాలేదని కొందరు నేతలు భావిస్తున్నారు. కానీ వస్తే మాత్రం భాజపాతో కలిసి వస్తేనే బెటర్ అని వారు లెక్క కడుతున్నారు.

భాజపా నుంచి జనసేన ఎలా బయటకు వస్తుంది అన్నది పాయింట్. ఆ మధ్య స్టీల్ ప్లాంట్ వ్యవహారం పీక్ లో వున్నపుడు బయటకు వచ్చి వుంటే పక్కా లాజికల్ గా వుండేది. ఇప్పుడు సరైన రీజన్ కావాలి. సరైన టైమ్, సరైన రీజన్ లేకుండా బయటకు వస్తే వికటించే ప్రమాదం వుంది.

అలా అని అక్కడే వుంటే జనసేననే భాజపా బరువు మోయాలి తప్ప భాజపా జనసేన బరువు మోయదు. అదే తెలుగుదేశంతో కలిసి వెళ్తే కనీసం కొంతయినా లాభం వుంటుంది. కానీ అలా కలిసి వెళ్తే మైనస్ కాకుండా వుండాలి అంటే సరైన రీజన్, సీజన్ రెండూ వుండాలి.

ఇవన్నీ అంత సులువుగా సాధ్యమయ్యేవి కావు. మోడీ-చంద్రబాబు-పవన్ కలవాలన్నది యాంటీ వైకాపా జనాల భావన. కానీ అది కూడా అంత సులువు కాదు. అందుకే ఇవన్నీ లెక్కలు వేసుకోకుండా స్వంత బలం మీదనే డిపెండ్ కావాలని లోకేష్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

జనసేన పొత్తు గురించి చంద్రబాబు ఆలోచించినంతగా లోకేష్ ఆలోచించడం లేదని బోగట్టా. అందుకే ముందుగా ఎమ్మెల్యే అభ్యర్ధుల పేర్లు డిసైడ్ చేసి, వారికి బాధ్యతలు అప్పగించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

-విఎస్ఎన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?